S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

01/29/2016 - 23:03

ఈ చరాచర సృష్టి అంతటా పరచుకొని వున్న అనంత కోటి జీవరాశులలో అత్యంత సర్వోన్నతుడైన ప్రాణి మానవుడు. ఇతర జీవరాశుల నుండి మానవుని వేరు చేసి ఉత్తమునిగా, ఉన్నతునిగా నిలబెట్టేది బుద్ధి. ఆ బుద్ధి నుండి జనించేది వివేకం. కనుక మనిషి ఎల్లప్పుడూ వివేకంతో ఆలోచించి బుద్ధికి పదును పెట్టుకుంటూ ఆదర్శ జీవనం గడపడానికి ప్రయత్నం చేయాలి.

01/29/2016 - 05:17

ధర్మసంస్థాపనలో మానవుడు తన కర్తవ్యమును నిర్వహించుటకు మార్గదర్శనము చేసిన దైవ దత్తమైన ఆత్మజ్ఞాన బోధనలే భగవద్గీత మరియు వసిష్ఠగీతలు. త్రేతాయుగములో వాల్మీకి, ద్వాపర యుగములో వ్యాసుడు మనకందించిన గొప్ప ఆధ్యాత్మిక ఆయుధములు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచములో లోక కళ్యాణమునకు ఉద్భవించిన మణిపూసలు. ఏ జీవి సోమరి కాకుండా కర్మాచరణకు మార్గమును చూపించిన గొప్ప తత్త్వరాజములు.

01/28/2016 - 03:59

మానవుడు జీవరాశులన్నింటిలోనూ ఉత్కృష్టమైన జీవి. విచక్షణా జ్ఞానాన్ని ఎరిగినవాడు. అటువంటి మనిషి పశుప్రాయుడిగా మారడానికి కారణం నైతిక విలువలు తెలీకపోడమే. మన పౌరాణిక గ్రంథాలు మనకెన్నో మంచి విషయాలను తెలియజేసాయి. వాటి అవగాహన మనకెంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పవిత్రమైనటువంటి రామాయణ మహాభారతాలు మనకెన్నో ఉన్నతమైనటువంటి జీవన విలువలను అందిస్తాయి.

01/27/2016 - 20:58

నేడు ఎక్కడ చూచినా పూజలు, భజనలు ఎక్కువగా కనిపిస్తున్నాయ. ఇక్కడ మతం ప్రమేయంలేకుండా సర్వులూ పూజాదికార్యాక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నట్టు తెలుస్తోంది. కాని దురాచారాలు జరుగుతూనే ఉన్నాయ. అన్యాయాలు, అక్రమాలు కనబడుతూనే ఉన్నాయ. ఎందుకని ఆలోచిస్తే పూర్వం రాజులు, మహర్షులు సమాజ శ్రేయస్సుకై విధిగా యజ్ఞాలు, యాగాలు చేసేవారు. తత్ఫలితంగా ఆయా రాజ్యాలలో కరువు కాటకాలుసమసిపోయేవి.

01/24/2016 - 20:51

‘‘గతా సూన గతాసూంశ్చ నామ శోచంతి పండితాః’’- గతించిన వారిని గురించి, జీవించి ఉన్నవారిని గురించి పండితుడు ఒకే భావన కలిగి ఉంటాడు. పండితుడంటే స్థితప్రజ్ఞుడని భావం. దీనికే సమ దృష్టి అని పేరు.
మనస్సాగరంలో ఉద్భవించే కోరికలనే అలల్ని అణచి, కట్టడి చేసి ఆత్మ తృప్తిని పొందినవాడు స్థితప్రజ్ఞుడు. బాహ్యమైన కామనలపట్ల వెంపర్లాట కూడదు. అప్పుడు ఆత్మానందం తనకు తానే వశమవుతుంది. వాడే బ్రహ్మజ్ఞాని.

01/23/2016 - 20:42

వేదాలలో అసంబద్ధముగా కనపడే విషయాలు నవీన విజ్ఞానం పెరిగిన తర్వాత అద్భుత శాస్ర్తియ విజ్ఞాన అవతారాలు అవుతున్నాయి.

01/22/2016 - 20:38

అమరకోశం అనుసరించి ‘పుష్యయుక్తా పౌర్ణమాసీ పౌషీ మాసేతు యత్రసా! నామ్నాస పౌతిః’ పుష్యమీ నక్షత్రంతో కూడిన పౌర్ణమిగల మాసం పుష్యమాసం. ఈ మాసానికి పుష్యా అని, పౌషః అను పేర్లు కూడా ఉన్నాయి. ఈ మాసానికి ‘తిష్య’ అనే మరో పేరుంది. పౌషే తైష సహాస్యౌద్వౌ’ పుష్యమీ నక్షత్రానికి తిష్య అనే పేరుండడంవలన తైషమాసంగా పిలువబడుతున్నది. ‘తిష్యః’ అంటే బలము. ఆ విధంగా, పుష్య, తిష్య సహస్యము కారణంగా పుష్యమాసం బలవత్తరమైనది.

01/20/2016 - 22:54

శ్రీకృష్ణావతారంలో ఈశ్వరుడే లోకంలోకి దిగివచ్చి కురుక్షేత్ర యుద్ధ పూర్వరంగంలో అర్జునునకు బుద్ధియోగం నుండి భక్తియోగం వరకు అనేక విధాలుగా యోగబోధ చేస్తాడు. తన ఐశ్వర్య రూపాన్ని ప్రసాదించి, సఖుని ఒప్పించి, నమ్మించి మోక్షార్హుణ్ణి చేయపూనుకొంటాడు పరమాత్మ.

01/19/2016 - 22:23

మనదేశం అభివృద్ధి పథం వైపు వేగంగా దూసుకుపోతున్న ఈ కీలక తరుణమందు మతం కేంద్రంగా పరిభ్రమిస్తున్న వరుస సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. ఈ సంఘటనలు పునరావృతమవుతూ ఉంటే నల్లేరుపై నడకలా సాగుతున్న జీవన స్రవంతికి గండిపడే అవకాశం వుంది. మొదటినుంచి ఈ కర్మభూమిలో సనాతన ధర్మం కేంద్రంగా హిందూ మతం వెల్లివిరుస్తూ వుంది అంటే అందులో అతిశయోక్తి లేదు.

01/19/2016 - 21:26

మనోనిబ్బరంతో పట్టుదలతో ప్రయత్నిస్తే కానిపని ఏదీ లేదు. యుగాలు గడిచినా తరాలు మారినా మారనిది ఒక్కటే ధర్మం. అధర్మం ఎప్పుడూ పరాజయంవైపే పయనిస్తుంది. మంచివారికెప్పుడూ మంచే జరుగుతుందన్నది చరిత్ర చెప్పే సత్యం. ఎన్ని ఆటంకాలు వచ్చినా మొదలుపెట్టిన పనిని పూర్తిచేసేవరకు కొందరు విశ్రమించరు. ఒక పని ప్రారంభించాక మధ్యలో ఆపకుండా కొనసాగించడమే కార్యదీక్షకు నిదర్శనం.

Pages