S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

11/15/2017 - 03:50

శ్రీరాముడే ధర్వస్వరూపుడు. ధర్మానికి రూపం వస్తే అదిశ్రీరాముని రూపును పోలి ఉంటుంది. సత్యధర్మపరాక్రముడన్న పేరును సార్థకం చేసుకొన్న దశరథుని పుత్రుడు. తాటక, మారీచ, సుబాహులను రాక్షసులకు తన అస్త్రాల ద్వారా తిరుగులేని సమాధానం చెప్పాడు.

11/12/2017 - 21:10

అపౌరుషేయాలైన వేదములు మంత్ర ద్రష్టలయిన ఋషులచే పూర్ణమయిన అనంతము నుండి గ్రహింపబడి తమ స్మృతి పథం లో నిక్షిప్తపరుచుకొని తరతరాలకు అందించబడినది. వేదవ్యాసులు వాటిని లిఖించి మానవాళికి మహోపకారం చేసారు. సర్వకాల సర్వావస్థలయందు ఎంతో నియమనిష్టలతో తమజీవితాలను క్రమశిక్షణకు అంకితం చేసి వేదనిథిని కాపాడుకుంటూ వచ్చిన ఋషిపుంగవులకు ఎంతో ఋణపడి ఉంది మన భరతజాతి.

11/11/2017 - 19:15

‘‘ఏ కార్యము సిద్ధించాలన్నా, నెరవేరాలన్నా ‘‘సాధన’’ అవసరమంటారు. ఏ కళ రాణించాలన్నా ‘సాధన’ అవసరం. సంగీతం, నాట్యం, ఏ కళనైనా రాణించాలంటే ‘సాధన’ తోనే ముడిపడి ఉంటుంది.

11/10/2017 - 19:20

హనుమ వాక్చాతుర్యాన్ని మెచ్చుకున్న రామచంద్రుడు పూర్వభాషి అన్న పేరు తెచ్చుకున్నవాడు. తనకు కనిపించిన వారినెవరైనా ముందుగా తానే పలకరించేవాడట. నేను రాజకుమారుడిని అనో, లేక రాజుగారినో అనో ఏ గర్వమును చూపేవాడు కాడట. అట్లాఅని ఆయన అతిగా మాట్లాడేవాడు కాడు. మితభాషి. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడేవాడట. సంభాషణలలో చతురత్వం చూపేవాడట. ఆయనతో కూడా ఉన్న వారందరూ ఎఫుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవారట.

11/09/2017 - 18:59

భగవంతుని గూర్చి తెలుసుకోవాలనుకొని అనే్వషిస్తూ ఉంటే భగవంతుని సృష్టిలోని ప్రతి లీలలోనూ పరమార్థం కనిపిస్తుంది. గాలి వీచడంలోను, నదీజలాలు పారడంలోను ఎన్నో నిగూఢార్థాలు కలిగిఉన్నట్టు కనిపిస్తుంది. సృష్టిలో ఏవస్తువు కూడా పనికిరానిది అంటూ ఏదీ లేదు. ఏ కారణం లేకుండా ఏ జీవి పుట్టదు. వస్తువువైనా, అ వస్తువువైనా దానికోసం ఏదో ఒక కారణంగా అది ఏర్పడుతోంది. ఎపుడైతే కారణం అయపోతుందో అపుడు ఆ ప్రాణి అదృశ్యవౌతుంది.

11/08/2017 - 18:33

శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు. పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు. వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం.

11/07/2017 - 18:14

భక్తి సామ్రాజ్యంలో భక్తుడు భగవంతుడిని ఎన్నో రకాలుగా భావించి పూజిస్తుంటాడు. కొందరు భగవంతుడిని తమ నాథుడిగా భావిస్తారు. వారిది మధుర భక్తి తమకు ఇలలో ఎవరితోను సంబంధ బాంధవ్యాలు ఏమీ అక్కర్లేదు కేవలం భగవంతుడొక్కడుంటే చాలు అతనే ఇహమూ పరమూ అంటారు. వారు భగవంతుడిని తమ భర్తగా భావించి సేవిస్తారు.

11/05/2017 - 22:00

జ్ఞానబోధ చేసేవారు తపోధనులు, గురువులు, తల్లిదండ్రులు, ప్రవక్తలు అని సాధారణంగా అనుకొంటారు. భారతంలో భీష్మ పర్వంలో కృష్ణుడు, కురుక్షేత్రానికి వచ్చి సమరాంగణంలో ఉన్న పెద్దలను, తన వారిని చూసీచూడగానే ఒకవిధమైన నిరాసక్తకు లోనై ఈ యుద్ధం నేను చేయను అంటూ వెనుతిరుగుతానన్న అర్జునునికి గీతోపదేశం చేసాడు.

11/04/2017 - 18:45

యుగయుగాలలో పరమశివ తత్త్వం ఎంతో ప్రాముఖ్యత వహించినది. పరమశివుని నిలయం కైలాసం. జ్ఞానమునకు సంకేతం. శివుడు ఉద్ధరించే శక్తికి ప్రతిరూపం. అసాధారణ సౌందర్యవంతుడు. పాలనాశక్తికి అధిష్ఠాత. జీవులకు ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులను అందించి పతనాలనుండి రక్షించేవాడు శశాంక శేఖరుడు. శివునికి అశుతోషుడు- అభయంకరుడు- కల్యాణశక్త్యాధికారి అని పిలుస్తూ వుంటారు.

11/03/2017 - 18:28

భగవంతునిపై భక్తిని ప్రకటించడానికి మానవుడు, దానవుడు, పక్షి, జంతువు అన్న భేదాలు అక్కర్లేదని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. భక్తితత్వము చేత దైవత్వాన్ని పొందుటకు అవకాశము అధికారం అందరికీ ఉంది. దారులు కొట్టి తన జీవనయానాన్ని గడిపే రత్నాకరుడనే బోయివాడు నిత్యం రామనామం జపం చేసి చివరకు ఆదికవిగా మలచబడ్డాడు. ఆదికావ్యం అయిన రామాయణం వ్రాశాడు.

Pages