S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

01/17/2016 - 21:15

సావాసగాండ్రను తీసుకుని వచ్చి వాళ్లకు మేము వండుకున్నవన్నీ పంచి పెట్టాడు. చట్లన్నీ ఖాళీ అయిపోయేట్లు చేశాడు. కుండలు పగలగొట్టాడు. దూడల కట్టు తాళ్ళు విప్పి తల్లుల దగ్గరకు తోలాడు. ఆవుల పొదుగులలో ఒక్క చుక్క పాలు కూడా అవి మిగల్చలేదు. పిల్లలు ఏడ్చినా ఇంట్లో పాలు, పెరుగు లేకుండా చేశాడు. మా ఇల్లు కొల్లబోయింది. నల్లపూసల తాడు ఎప్పటినుంచో అమర్చుకుంటే బాగుండుననుకుంటున్నాను.

01/14/2016 - 00:09

ఇటు రండిరా అని నలుగురు పిల్లలను ఒక చోటికి చేర్చి వాళ్ళ జుట్లు ఒకదానితో ఒకటి ముడిపెట్టి వాళ్ళు గింజుకుంటూ ఉంటే కేకలు పెడుతూ కహకహ నవ్వుతాడు. ఈ విధంగా వ్రేపల్లెలో కృష్ణుడు భరించలేనంత అల్లరి సృష్టిస్తున్నా, దుడుకు చేష్టలు చేస్తున్నా నందుడి పట్ల మొహమాటంవల్ల గోపాలురు ఈ పిల్లవాణ్ణి కట్టడి చేయటం ఎట్లానా? అని కలవరపడ్డారు.

01/13/2016 - 05:27

ఇరుగుపొరుగు ఇండ్లలో గోపికలు చల్లలు చిలుకుతూ ఉండగా అక్కడకు చేరుతాడు. వాళ్ళ కవ్వపు తాటిని పట్టుకుంటాడు. కవ్వం కదలనివ్వడు. ముందు నాకు వెన్న పెట్టాలని పట్టుపడతాడు. ఇంకా అప్పటికీ వాళ్ళు వినిపించుకోకపోతే పైట కొంగు చేతికి చిక్కించుకొని అక్కడనుంచి లేవాల్సిందేనని నిర్బంధిస్తాడు.

01/12/2016 - 04:26

ఏమైనా మన జన్మ జన్మల పుణ్యంవల్ల ఈ గండం గడిచింది కన్నయ్యకు అని చెప్పింది యశోద. ఇట్లా యశోద చెపుతుండగా కొందరు బాలకులు అక్కడకు పరుగు పరుగున వచ్చి ఇట్లా చెప్పారు. మేము ఈ దగ్గరలోనే ఆడుకుంటూ ఉండగా ఏమి జరిగింది చూశామంటే, మీ కృష్ణుడు కాలితో ఈ బండిని గట్టిగా తన్నాడు. అపుడు ఈ బండి ఫెళఫెళ శబ్దం చేసుకుంటూ ఎగిరి అవతల పడిపోయింది. మేము పరుగులు తీశాం. దేవుడు కాపాడాడు. ఇది నిజంగా అద్భుతం అని ఆ బాలురు చెప్పారు.

01/11/2016 - 08:22

చక్రాలు ఊడిపోయినాయి. బండి భాగాలన్నీ విరిగి అటు ఇటూ చెల్లాచెదరై పడిపోయినాయి.

01/10/2016 - 00:22

నందుడు గోకులంలో వున్న వాళ్ళ చుట్టాలనందరినీ పిలిపించుకున్నాడు. వాళ్ళందరికీ అమూల్యమైన వస్త్రాలు బహూకరించాడు. గోపూజోత్సవం జరిపాడు. గోశాలలన్నిటినీ పరమ సుందరంగా అలంకరింపజేశాడు. ఇక గోప వనితలంతా యశోద చుట్టూ చేరి ఆమె భాగ్యాన్ని కొనియాడారు. ఇంత చక్కటి వాణ్ణి కన్నది మన యశోద! ఇంత అదృష్టం ఎవరికైనా ఉంటుందో! ఏమి నోములు నోచిందో. ఏమి వ్రతాలు ఆచరించిందో అని పొగడ్తలతో ముంచెత్తారు యశోదను.

01/09/2016 - 02:06

నీకింత పాడు నిద్ర ఏమరిపాటు ఎట్లా కలిగాయి? అని యశోద నడిగాడు విహ్వలించిపోతూ. ‘కడుపు నిండా పాలిచ్చాను. నిద్ర కళ్ళు వాలిపోతుంటే కన్నయ్యను పడుకోబెట్టాను. ఇప్పటిదాకా దీపం కూడా వెలుగుతూనే వుంది. అలసట వల్ల రెప్పలు మూతబడుతూ ఉండటం, ఏదీ బాగా పొద్దుపోయింది కదా అని కూరుకువచ్చి నెత్తిమీద కూచోగా ఇట్లా కాస్త ఒత్తిగిల్లాను. నిద్రతో తూగిపోయిందేముంది, జాగు చేసిందేముంది! ఇంకా క్షణం కూడా కాలేదు.

01/06/2016 - 23:23

ఈ పనిలో తన అనుచర గణంతో సహా ఆల మందల పల్లెలో పూతన అనే్వషిస్తూనే వున్నది. చీకటి పడగానే ఇల్లిల్లు తిరుగుతూ పురిటి శిశువులు ఎక్కడ ఉన్నారా అని గవేషిస్తూ ఉంటుంది పూతన. ఇట్లా వ్రేపల్లె రాగానే నందుడి ఇంటి ఆవరణలో యశోద పక్కనే వెల్లకిలా తల్లిని ఒత్తుకుని పడుకుని ఉన్న నందుడి ముద్దుల పట్టిని చూసింది. చడీ చప్పుడు లేకుండా కాసేపు ఆ శిశువును పరిశీలనలగా చూసింది.

01/06/2016 - 00:44

పెద ఆవుల దగ్గరకు చేరకుండా ఒకదాన్ని ఒకటి వృషభాలు కుమ్ముకుంటున్నాయి, తోసుకుంటున్నాయి. బలసి ఉన్న కరకు మెడలతో, బలిష్ఠమైన పెద్ద పెద్ద మూపురాలతో, విశాలమైన వీపులతో, అందమైన గంగడోళ్ళతో మద వికారంతో ఒకదానిపై ఒకటి కాలుదువ్వుతూ, రంకెలేస్తూ ఉన్నాయి ఆ వృషభాలు. నేలమీద ఎటుచూసినా ఆవుల నరువులు, దూడలు వేసిన పేడలు కనపడుతున్నాయి.

01/05/2016 - 04:24

కాలం తీరినవాడు ఏం చేయగలడు! అమ్మా! నిన్ను చాలా దుఃఖపెట్టిన మాట కాదనను. నీవు పరమ పవిత్ర చరితవు. నీ చేతులు కాళ్ళూ పట్టుకొని బతిమాలుకుంటున్నాను అని దేవకి క్షమను అర్థించాడు కంసుడు. అపుడు దేవకి కూడా శోక గద్గద స్వరంతో ‘తండ్రీ! నాకిటువంటి దుఃఖం అనుభవించాలని రాసి పెట్టి ఉంది. నా బిడ్డలకు ఇటువంటి దుర్మరణం నిర్ణీతమై ఉంది. నీవేం చేయగలవు!’ అని పెద్ద మనసుతో కంసుడికి చెప్పింది.

Pages