S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

11/04/2017 - 18:47

శాస్ర్తీకి ఏమీ అర్థం కాలేదు. బూటీ ఇదంతా చూస్తూ ‘శాస్ర్తీగారు, బాబా పురుషార్థాలను ప్రసాదించే భగవంతుని స్వరూపులమని నీకు చెపుతున్నారు. దీని ర్థం అంతే ఉంటుంది’ అని చెప్పాడు.
బాబా దాన్ని విని చిరునవ్వు నవ్వాడు. అంతలో బాబా బూటీ నాకు కాషాయ వస్త్రాలు కట్టాలని ఉంది. నీవు తెప్పిస్తావా అని అడిగాడు.

11/03/2017 - 18:30

అవి తీసుకుని ఇదిగో ఈ మూడు రూపాయలు నీవే తీసుకుని ఇంతకుముందే నీవు ఇచ్చావులే. అయినా నీకు ఏదీ గుర్తుండదు. ఒకనాడు మీ దగ్గరకు వచ్చి బాగా ఆకలి వేస్తుంది, ఏదైనా ఉంటే ఇవ్వమని అడిగాను కదా. అపుడు నీ దగ్గర ఈ ఐదు రూపాయలు ఉన్నాయి. కాని నీకు ఇవ్వబుద్ధి కాలేదు. మూడు రూపాయలు చాల్లే అన్నావు. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను అన్నారు.

11/02/2017 - 18:51

ఒకసారి అనుకోకుండా వాళ్ళ అత్తగారి గాజులు ఈమె తీసుకొందని అపవాదు వేశారు. దానితో ఆమె ఎంతో కృంగిపోయింది. సాయిబాబా నీవే దిక్కు. నాకీ అపవాదును పోగొట్టు అని పదే పదే సాయిబాబానే వేడుకుంది. అంతటి నింద వేసిన అత్తగారే కొద్దిసేపటికి ఈ కొత్త పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి ‘‘లక్ష్మీ నేనే నీ గాజులు తీసుకుని ఇక్కడ పెట్టాను. ఆ విషయం మర్చిపోయాను.

11/01/2017 - 18:34

కాని అక్కడ వారికి బాబా కనిపించలేదు.
అంతలో స్టేషను వారు ట్రైను రెండు గంటలు ఆలస్యంగా వస్తుందని చెప్పారు.
బాబాకు ఉన్న దయామృతాన్ని వారు తలుచుకున్నారు.
బాబాను స్మరిస్తూ ఆయన రొట్టెలు తిన్నాడు.
అలా బాబా దగ్గరకు వచ్చిన వారికి వారు కోరకుండానే వారికేమి కావాలో బాబానే చూసుకునేవారు.
బాబాను నమ్మినవారికి ఇక కొదువ ఏముంటుంది?

10/31/2017 - 18:23

ఏమీ ఫర్వాలేదు అంతా సవ్యంగా జరిగిపోతుంది అని ఆ మిత్రుడన్నాడు.
***
మరోసారి సాయిబాబాకు ఎక్కడినుంచో ఓ భక్తుడు మామిడిపండ్లు తెచ్చి ఇచ్చాడు. వాటిని అందరికీ పంచుతూ అందులోంచి నాలుగు పండ్లను దాచిపెట్టారు. ఎందుకు బాబా నాలుగు పండ్లు దాచావు అని హేమాదిపంత్ అడిగాడు.
ఏమీ లేదు. దామోదర్ రాస్నే వస్తాడు కదా. వానికి ఇద్దామని అన్నాడు మళ్లీ హేమాదిపంతు.

10/30/2017 - 01:53

డాక్టర్లందరూ ఇది ఏంటి నాలుగు రోజుల నుంచి పక్షపాతం వచ్చింది. ఇపుడు హాయిగా తిరుగుతోంది. ఇదంతా దేవుని మహిమనే అని చెప్పి వారు వెళ్లిపోయారు.
ఆ తరువాత జరిగినది తెలుసుకుని బాబా ఎందుకు నొప్పి అన్నారో నాలుగు రోజులు తగ్గుతుంది అన్నారో తెలిసి సర్వాంతర్యామి అని నమస్కారం చేశారు.
బాబాకు కేవలం మనుష్యుల గురించి కాదు ఆఖరికి బల్లుల గురించి కూడా తెలుసు.

10/28/2017 - 19:39

బాబాను ఎక్కడికీ తీసుకొని వెళ్లక్కర్లేదు. మీరంతా బాబా భజన చేయండి చాలు, ఆయనకు తగ్గిపోతుంది. అసలు ఆయనకేమీ బాధ లేదు అని చెప్పాడు.
అందరూ మహిల్సాపతి వైపు వింతగా చూసి నీకేమన్నా పిచ్చా అన్నారు.
అంతలో బాబా నిటారుగా కూర్చున్నాడు. అబ్బా తగ్గిపోయింది బాబూ అన్నారు.
అంతలో అక్కడికి ఒక పరిచయంలేని వ్యక్తి గబగబా వచ్చాడు. బాబా బాబా అని అరుస్తూ వస్తున్నాడు.

10/27/2017 - 18:22

సరేలే అదిగో అక్కడ నీ పెట్టెలోనుంచి తీసిన జీతం బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి, తీసుకుని వెళ్లు. ఇందాక తీసుకుని వచ్చాను అన్నాడు బాబా.
అక్కడే కూర్చుని ఉన్న మహిల్సాపతి బాబా మీరు పొద్దున్ననుంచి ఇక్కడే ఉన్నారు కదా మీరెప్పుడు వెళ్ళారు అన్నాడు.

10/26/2017 - 18:42

బాబా కరుణ నాకు చాలా అవసరం అనుకున్నాడు. అనుకున్నట్లుగా నూల్కర్ వచ్చాడు బాబాను దర్శనం చేసుకున్నాడు. ఎంతో ఆనందం కలిగింది. దానితో అతడు తన దగ్గర ఉన్న బంగారు నాణేన్ని తీసి బాబాకు ఇచ్చాడు.

10/25/2017 - 18:38

ఆమె కాస్త శాంతించింది. నీకో కథ చెప్తాను విను.
కృష్ణుడు యశోదమ్మ దగ్గర పెరిగే సమయంలో అందరి ఇండ్లలో పాలు పెరుగు తాను తింటూ తన స్నేహితులకు పెట్టేవాడని నీవు విన్నావు కదా. ఆయన స్నేహితులకే కాదమ్మా కోతులకు కుక్కలకు కూడా పెట్టేవాడు. అలా పెట్టడం అంటే ప్రతి ప్రాణిలో నా అంశ ఉందని చెప్పక చెబుతున్నట్లే కదా.

Pages