S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/24/2019 - 22:19

‘‘నీ విషయం కాదు సరూ! రాణి నిన్ను నా మీద ఎందుకు ప్రయోగించింది? మనిద్దరి మధ్య గాఢానురాగం ఉన్నదని తెలిసి కూడా, తనకది ప్రస్తుతానికి దక్కదని గ్రహించి కూడా, నిన్ను ఇక్కడికి ఎందుకు పంపింది? నాకీ బహుమానాలు ఎందుకు ప్రసాదించింది? సూక్ష్మంగా ఆలోచిస్తే ఏ విధంగానైనా సరే నన్ను ఆకర్షించి, తన కోరికను తీర్చుకోవటమే ఆమె ఆదర్శం..

11/23/2019 - 21:51

‘‘మన పాపలేగా అవి!... చూడు.. ఎలా చుంబిస్తున్నవో!’’ అని ఆమెను ఉద్రేకపరుస్తూ వాటిని చూపాడు.
ఆమె సిగ్గుపడి అటు చూడరాదనుకుంటూనే, వీరభద్రుడు గమనించనప్పుడు దొంగ చూపులతో తిలకిస్తూ ఆనందించసాగింది. వీరభద్రుడు అటు చూసేందుకు ప్రయత్నించినపుడల్లా ‘తప్పు కదూ!’ అంటూ, అతన్ని చూడనీకుండా చేతులు అడ్డం పెట్టింది. వీరభద్రుడు ఆ తామర తూళ్ళను తొలగించి, ప్రతిబింబాల ప్రణయరాధనను తిలకిస్తూనే ఉన్నాడు!

11/21/2019 - 22:26

సరస్వతిని ఎంతో గర్వం ఆవహించింది. జఘనాలను విలాసంగా, వయ్యారంగా కదుపుతూ, బిగీ బింకం ఉండి పరిపూర్ణ రూపాన మొనలుదేరిన రొమ్ములను ముందుకు విసిరి వేస్తూ, చూపుల్లోనే సవాలు చేసే ఘన స్వాగతాలను పొందుపరిచి, అలవాటైన వీరభద్రుడు సైతం హఠాత్తుగా చూస్తే తన ప్రేయసేనా అని క్షణం నిర్ఘాంతపోయి, కొత్త రూపురేఖలు దిద్దుకున్న ఈ సుందరాంగి తనదేననే ఊహలో పరవశుడయ్యే విధంగా ప్రవర్తించి, సఫల ఐనదామె.

11/20/2019 - 22:48

తనకింద గొప్ప నాయకుడు దొరికినందుకు నా పూర్వజన్మల పూజాఫలమే కారణమై ఉండాలని ఆమె విశ్వాసం.
‘‘ఇంత త్వరగా వస్తావనుకోలేదు- అయినా విరహాన్ని భరించటం అంత తేలిక కాదని తెలుసనుకో!’’

11/19/2019 - 22:53

ముఖ్యంగా సంపెంగి వాసనలంటే నిజంగా మత్తుతో తూలిపోతున్నట్లుంటుంది తనకు. బహుశా తన నాయకునిక్కూడా అవి ఎంతో ఇష్టమవటంవల్లనే వాటిని అత్యధికంగా ఇక్కడ సమకూర్చి ఉండాలి.
ఆ సంపెంగలన్నిటినీ మాలగా గుచ్చి జడలో తురుముకుందామనుకుందామె. మరి ఊదీ, దారమెక్కడ? రాత్రి వీరభద్రుడు ఆ పాడు గూడు చీకటి గుహలోంచి దారపు ఉండ తీసి తన రవికె కుట్టిన సంగతి ఆమెకు గుర్తుకొచ్చింది.

11/18/2019 - 23:19

మల్లెపువ్వులు ఆరబోసినట్లుగా తెల్లని దుప్పటి పరచబడి వున్నది. సుగంధాలు వెదజల్లే రకరకాల పువ్వులు పక్కమీద విరజిమ్మబడి ఉన్నవి. ఒక మూల చిన్న బల్లమీద పాత్రలో ఇసుక పోసి అందులో గుచ్చబడిన అగరువత్తుల పొగ ఘుమఘుమలాడుతూ గదంతా అలముకుంటున్నది.
గది వాకిట అల్లిక పనిచేసిన తెర దించి ఉన్నది. ఒక చిన్న బల్లమీద తాంబూలానికి అనువైన ద్రవ్యాలూ, చందనమూ, కస్తూరీ, జవ్వాదీ మొదలైన సుగంధ ద్రవ్యాలూ అమర్చబడినవి.

11/17/2019 - 22:18

అంతేకాదు, దృఢమైన లోహమనబడే ఉక్కు కూడా, వేడిమీద విడవకుండా దెబ్బలు వేస్తే కావలసినవిధంగా సాగుతుంది. అందులోనే కాస్త మెలకువ అవసరం అంతే’’
‘‘రాణీ! మీరు చెప్పినంత తేలికగా తోచదు’’ అన్నది సరస్వతి.

11/16/2019 - 21:53

అంతేకాదు- ఇప్పటికి జరిగిపోయిందేదో దాన్ని జరగకుండా ఉంచగలవారెవ్వరూ లేరు. ఇక జరగబోయేదాన్ని తానే స్వతంత్రించి నిర్ణయించటంకన్నా, రాణి సూచనల్ని అనుసరించి నడుచుకుంటే తనకొక రక్షణ ఏర్పడుతుంది.
‘చెపుతాలే రాణీ.. మీరు స్నానానికి సిద్ధంకండి’’ అన్నది సరస్వతి.

11/14/2019 - 23:09

పాలరాతి బుగ్గలమీద పగుళ్ళు ఏర్పడ్డ విధంగా చారలు కూడాను.! ఇపుడు తెలిసిందా అక్కా!.. మదనుడు స్ర్తి హృదయాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తాడో! ఇకముందు నన్ను దెప్పిపొడవకుండా నా మన్మథావస్థ ఎలాంటిదో స్వయంగా తెలుసుకోగల జ్ఞానం నీకు వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. అది సరే గాని.. ఎలా ఉన్నదా అనుభూతి! బావగారి రసికత్వాన్ని గూర్చి కాస్త చెప్పుదూ!’’
సరస్వతి మెదలకుండా ఊరుకున్నది.

11/14/2019 - 00:46

గాలిలో తేలిపోతూన్నట్లనిపిస్తోంది.

Pages