S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

10/19/2016 - 22:58

నీ మొగుడికి అటు డబ్బు సంపాదనా లేదు.. ఇటు సుఖపెట్టటమూ తెలియదు. నీ యవ్వనం అంతా అడవిన కాచిన వెనె్నల అయిపోతోంది.. అందరికీ పురుళ్ళు పొయ్యటమే గానీ నువ్వు పురుడు పోసుకునేదెప్పుడు? నేనున్నాను గదా.. నా హెల్ప్ తీసుకో.. తప్పులేదు. పరాయివాడి సాయంతో తల్లికావటం మొదటిసారీ కాదు.. చివరిసారీ కాదు.. చరిత్రలో ఎన్నో ఎనె్నన్నో ఉదాహరణలున్నాయి. అయినా నేను పరాయివాడ్ని కాదు.. నీ వాడ్ని..
..రాజశేఖర్

10/18/2016 - 21:16

పిలిస్తే పలకవాకు, కోమాలో ఉన్నట్లు యాక్ట్ చెయ్.. ఏ నిమ్స్‌కో పంపించి, అక్కడ అడ్మిట్ చేస్తారు.. టెస్ట్‌లనీ చేస్తారు.. ఓసారి ఫ్రీగా చెకప్ చేయించుకో.. సాయంత్రం వచ్చి కలుస్తాను. మన పోలీసులుంటే మేనేజ్ చేస్తాను...’’ అన్నాడు రణధీర్.
దీప్తి ఆయన చెప్పినట్లే చేసింది..
సాయంత్రం మళ్లీ రణధీర్‌కి ఫోన్ చేసి హస్పిటల్‌లో తను ఏ వార్డులో ఉన్నదీ చెప్పింది.

10/19/2016 - 23:21

‘‘ఎవరెవరొస్తుంటారు?..’’
‘‘రాజశేఖరు సారొస్తడు, రోజిడిసి రోజన్న వొస్తడు.. ఇగ మాసారూ, ఆ సారూ కూర్చుంటే సీసాలు ఖాళీ అయిపోతయి..’’
‘‘అమ్మ ఏమీ అనదా?..’’
‘‘ఆస్పటాల్ నుంచి వచ్చినంత అమ్మ కూడా అసేపు కూసుని ఈ ముచ్చట ఆ ముచ్చట చెప్పేడిది..’’
‘‘అమ్మ కూడా తాగేదా?’’

10/15/2016 - 21:16

కొందరు ఓపెన్‌గా.. కొందరు సీక్రెట్‌గా.. భూమీద సుఖపడితే తప్పులేదురా.. అన్నాడో మహానుభావుడు.. రాత్రి ఏడింటికి మా కంపెనీకి రండి.. అందరూ అమెరికా వెళ్లి చూడాలి.. లండన్ వెళ్లి చూడాలి.. అంటారు గానీ.. ఇండియాలో ఇంటి పక్కనున్నవి చూడరేంటి సార్?..’’ అన్నది దీప్తి.

10/15/2016 - 02:56

‘‘ఏమిటో ఎందుకో తెలియదు.. చాలా భయంగా ఉంది..’’ అన్నది దీప్తి కన్నీరు పెట్టుకుంటూ.
‘‘ఈ ప్రపంచంలో దేన్నీ లెక్కచేయనంత ధైర్యవంతురాలివని అనుకున్నాను. నువ్వూ ఏడుస్తున్నావా?’’ అన్నాడు రణధీర్.
‘‘చాలా భయంగా ఉందండీ..’’ అంటూ దీప్తి ఆయన గుండెలమీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది.

10/13/2016 - 21:06

‘‘అలా కుదరదండీ.. ఒకసారి మాటిచ్చాక మాట మీద నిలబడాలి..’’ అన్నది దీప్తి.
‘‘మాట లేదు.. గీటా లేదు..’’
‘‘మీ బోణీ మంచిదని.. అన్నట్లు రెండు రోజులు మీరు వేరే పనులు పెట్టుకోకండి.. రేపు మనం తిరుపతి వెళ్తున్నాం..’’ అన్నది దీప్తి.
‘‘అదేంటి ఇంత సడెన్‌గా.. ఇక్కడ స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి..’’ అన్నాడు రణధీర్.
‘‘అదేనండి.. మన స్టోరీ కొంచెం దేవుడికి కూడా చెప్పిరావాలి గదా..’’

10/13/2016 - 04:29

‘‘నువ్వు ఒంటరిగా ఉన్నావు.. కారణాలు ఏవైతేనేం జరగవల్సిన వయసులో నీకు పెళ్లి జరగలేదు.. ఇప్పుడీ అవకాశం అయాచితంగా వచ్చింది.. ఇంక నీ అనుమానం ఏమిటి?..’’ అని అడిగాడు రణధీర్.

10/09/2016 - 22:29

‘‘మీరు చెప్పింది నిజమేనండి.. కానీ ప్రొప్రయిటర్‌గారు చెప్పిన పని చెయ్యకపోతే, ఆయనకు కోపం వస్తుందండి.. అనుకున్న పని కాదని తెల్సినా, పైవాళ్ళు చెప్పినట్లు చేస్తే వాళ్ళు సాటిస్‌ఫై అవుతారండి.. మేం ఉన్నది వాళ్ళు చెప్పినట్లు చెయ్యటానికేనండి.. అన్నాడు మేనేజర్.

10/08/2016 - 21:50

‘‘అంటే మీరు ఫైనాన్స్ చేస్తుంటారా?’’ అని అడిగాడు రణధీర్ అమాయకంగా మొహం పెట్టి...
‘‘ఆ.. మనది చిట్‌ఫండ్ అండ్ ఫైనాన్స్ బిజినెస్. చాలామంది ప్రొడ్యూసర్స్ వస్తుంటారండి.. సినిమావాళ్ళే కాదు.. బయట వేరే ఏదైనా బిజినెస్‌కి కావాలన్నా తీసుకుంటుంటారు.. అహోబలరావు కూడా యాభై లక్షలు తీసుకున్నారండి..’’ అన్నాడు రాజశేఖర్.
‘‘అంటే వాళ్ళు సినిమా ప్లాన్ చేస్తున్నారా?’’

10/07/2016 - 21:29

‘‘స్వామీజీ.. మన కంపెనీలో పార్ట్‌నర్ స్వామీ.. నిన్ననే చేరింది..’’ అన్నాడు రాజశేఖర్.
‘‘శుభం.. లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలు అవుతుంది.. వర్కింగ్ పార్ట్‌నరా? స్లీపింగ్ పార్ట్‌నరా?’’ అని అడిగాడు స్వామీజీ.
‘‘వర్కింగ్ పార్ట్‌నర్ స్వామీజీ.. యం.డి.గా అపాయింట్ చేశాను.. ఒళ్లు దాచుకోకుండా కష్టపడి పనిచేస్తుంది స్వామీజీ..’’ అన్నాడు రాజశేఖర్.

Pages