S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

09/01/2016 - 21:22

కన్సల్టేషన్ రూం తలుపుకు ఒక పక్క శే్వత నేమ్ ప్లేట్ ఉంది.
హాల్లోగాని, రూంలోకాని ఎవరూ లేరు. కింద అంతా నిశ్శబ్దంగా ఉండటంతో నెమ్మదిగా మెట్లెక్కి పైకి వెళ్ళాడు రణధీర్. పైన మాటలు కొంచెం పెద్ద స్వరంలో వినిపిస్తుండటంతో రణధీర్ మెట్లమీదే ఆగి విన్నాడు.
ఇద్దరూ సీరియస్‌గా వాదించుకుంటున్నారు.

08/31/2016 - 23:20

ఎవరి దగ్గరా ఎంతుంటే అంతిచ్చారు. అయిదువేలు అప్పటికప్పుడు పోగయినయి. నేను ఎట్టా తీరుస్తానని గానీ, అసలు తీరుస్తానా లేదా అని కూడా సూడకుండా ఆళ్ల దగ్గరున్నది ఇచ్చారు. ఎందుకంటే, ఇరుగుపొరుగు ఒక చోట కల్సి మెల్సి ఉంటున్నాం అని సాయం చేశారు సారూ.. కానీ ఆస్పతాల్‌కి తీసుకెళ్తే పాతికవేలు కడితేగానీ చేర్చుకోమన్నారు. ఇప్పుడు అయిదువేలు కడతాం.. తెల్లారేక ఎట్టగోట్టా తెచ్చి మిగతా డబ్బు కడతామని బతిమిలాడాం.

08/30/2016 - 19:50

‘‘ప్రేమ వివాహమే. పెళ్లికి కూడా వెళ్ళాను. ఆయన సంపన్న కుటుంబానికి చెందినవాడు. రాజకీయాల్లోనూ, చిన్న వయసులోనే పెద్ద పదవులు చేపట్టి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత ఆ నర్సింగ్ హోం కట్టించాడు. ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెట్టారు. అసలే ఉన్నవాళ్లు.. రాజకీయాల్లోనూ బాగానే సంపాదించాడు. నర్సింగ్ హోం, కాలేజీ.. అన్నీ బాగా కలసి వచ్చాయి..’’ అని చెప్పింది.

08/28/2016 - 21:12

ఎవరి ద్వారా అతనికి మెసేజ్ వెళ్లిందో తెలిస్తే, తీగ దొరికినట్లే.. ఆ తీగ లాగితే డొంక కదులుతుంది..’’ అన్నాడు రణధీర్.
‘‘ఆమె హత్యకు కారణం ఏమిటి? వాటీజ్ ద మోటివ్- అన్న కోణంలోనూ ఎగ్జామిన్ చెయ్యాలి..’’ అన్నడు అడిషనల్ కమీషనర్.

08/27/2016 - 21:00

లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించినవాడు, లంచాలు తీసుకోకుండా ఎలా ఉంటాడు? మంత్రుల దగ్గిరినుంచీ కుంభకోణాలు, కేసులు, అరెస్టులు జరుగుతుంటే, నేనెందుకు మడికట్టుకుని కూర్చోవాలని అనుకుంటాడు. అదే ఒక చిన్న బట్టల దుకాణంలోనో, సూపర్‌బజార్‌లోనో పనిచేసేవాడికి, లేదా ఒక పెద్ద కంపెనీలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కో లంచం ఇచ్చేవాడు లేడనుకుందాం.

08/26/2016 - 21:40

‘‘ఇంతకీ మీకు రాత్రి బాగా నిద్రపట్టిందా?’’ అని అడిగింది సత్యభామ.
‘‘ఎక్కడ? కనుమూసినా, నీవాయే, కను తెరిచినా నీవాయె..’’
‘‘ఆహా.. ఎన్ని అబద్ధాలు ఆడతారండీ? మీకు కలలో కలిసి ఇలలో దొరికేదెవరో నాకు తెలియదా?’’ అన్నది సత్యభామ వ్యంగ్యంగా.
‘‘మొన్న మా అడిషనల్ కమీషనర్ ఏమన్నాడో తెలుసా? ఆఫీసే మొదటి భార్య.. ఇల్లు రెండో భార్య.. అన్నాడు..’’

08/25/2016 - 21:22

చాలామంది ప్రముఖులు వచ్చి శే్వత శరీరంమీద పూలరేకులు వేసి నమస్కారం చేసి ప్రక్కనే కుర్చీలో కూర్చున్న అహోబలరావుకు చేతులు జోడించి ప్రక్కకు తప్పుకుంటున్నారు. పార్టీ నాయకులు, ప్రముఖులు వచ్చినపుడు మాత్రం ఆయన లేచి నిలబడితే వాళ్ళు ఆయన్ను ఆలింగనం చేసుకుని ఓదారుస్తున్నారు.

08/24/2016 - 23:35

‘‘యస్.. లీటర్ విస్కీ కాదండీ బాబూ.. లీటర్ వాటర్...’’ అన్నాడు ఫక్కున నవ్వుతూ.
భార్యమీద ఇంత ప్రేమ చూపిస్తున్న మనిషితో, ఇంత సంతోషంగా జోకులేస్తున్న మనిషితో ‘మీ భార్య అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేయబడి రక్తం మడుగులో శవంలా పడి వుందని ఎలా చెప్పడమా?’’ అని రణధీర్ ఆలోచిస్తున్నాడు.

08/23/2016 - 21:27

‘‘కింద ఎవరూ లేరు.. మేడం పైన డెలివరీ కేసులో ఉన్నారనీ, ఆమె వెళ్ళటానికి లేటవుతుంది కదాని.. చౌకీదార్ చాయ్ తాగడానికి వెళ్ళాడంట.. వచ్చి చూసేటప్పటికి.. మేడం చనిపోయి వున్నారు..’’ అని చెప్పింది మమత.
‘‘కాబట్టి హంతకుడు రావడం కానీ, పోవటం గానీ చూసిన వాళ్ళు ఎవరూ లేరు..’’
‘‘ఔను సార్.. ఎవరూ చూడలేదు..’’ అన్నది మమత.

08/21/2016 - 22:59

‘‘రండి.. నర్సింగ్ హోం వాళ్ళంతా పైనే వున్నారు.. భయపడుతున్నారు..’’ అన్నాడు శుంభుప్రసాద్ మేడపైకి దారితీస్తూ...
రణధీర్, శంభుప్రసాద్ పైకి వెళ్ళేటప్పటికి అక్కడున్నవాళ్ళంతా లేచి నిలబడ్డారు.
‘‘అసలేం జరిగింది?’’ అని అడిగాడు రణధీర్ నర్సును.
‘‘డ్యూటీ డాక్టర్ చెబుతారు..’’ అని తప్పుకుంది నర్సు కన్నీళ్ళు తుడుచుకుని. రణధీర్ డ్యూటీ డాక్టర్ వంక చూశాడు. ఆమె ముఖంమీద కన్నీటి చారలున్నాయి.

Pages