S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

05/13/2018 - 22:00

అదేచోట తన బైక్ పార్క్‌చేసి దాని పక్కనే నిలబడి ఉన్నాడు కార్తీక్. నల్లటి హెల్మెట్ ధరించి ఉండటంతో అతడి ముఖం కనపడటం లేదు. పైగా మెడ చుట్టూ నల్లటి మఫ్లర్ చుట్టుకుని ఉన్నాడు కార్తీక్.

05/11/2018 - 21:58

అంతలో కార్తీక్ దగ్గర ఫోన్ మోగింది. అవతలనుంచి కార్తీక్ తండ్రి వాసుదేవరావు కంఠం వినపడింది.
‘‘కార్తీక్...! ఒకసారి ఇంటికి వస్తావా? నీతో అర్జెంట్‌గా మాట్లాడాలి’’
‘‘ఇప్పుడే వస్తున్నా....!’’అంటూ చెప్పి ఫోన్ ఆఫ్ చేసి, ఫ్రెండ్స్‌వైపు చూస్తూ అన్నాడు కార్తీక్.
‘‘మా నాన్ననుంచి ఫోన్....! మా నాన్నని కూడా వాడు బెదిరించాడేమో!!’’

05/10/2018 - 21:58

ఐతే ఇంటర్వ్యూ ఉండటంతో అర్జెంటుగా విజయవాడ నుంచి రావలసి వచ్చింది. కార్తీక్‌కు అప్పడప్పుడు గోపిక గుర్తుకు వస్తోంది. గుర్తుకు వచ్చినపుడుల్లా-
‘‘తన పేరుకూడా తెలియదు. ఫోన్ నెంబర్ తీసుకున్నా బాగుండేది’’ అని అనుకుంటున్నాడు కార్తీక్.

05/10/2018 - 21:46

‘గంగా సంగమ మిచ్చగించునె? మదిన్ కావేరి దేవేరిగా/ అంగీకారమొనర్చునే? యమునతో ఆనందముం పొందునే?/ రంగత్తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ/ అంగంబంటి సుఖించునేని గుణభద్రా, తుంగభద్రా నదీ!’ - తుంగ, భద్ర అనే నదులు రెండూ వేర్వేరు చోట్ల పుట్టి, పడమటి కనుమల్లోని ‘కూడలి’ దగ్గిర పరస్పరం పెనవేసుకుంటాయి. అవి రెండూ కలిసి, ఒకే నదిగా అయిదు వందల కిలోమీటర్లు ప్రవహించి, ఆ తర్వాత కృష్ణానదిలో లీనమవుతాయి.

05/09/2018 - 22:04

ఇప్పుడు మార్కెట్‌లో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది రూపాయలకు ఒక దిర్హామ్ ఇస్తున్నారు. మనం రద్దయిపోయిన కరెన్సీకి రెండువందల రూపాయలకు ఒక దిర్హామ్ చొప్పున ఇద్దాం...! ఆలోచించు అన్నా...! బోలెడు లాభం....!’’
నిరంజన్ నవ్వి చెప్పాడు.

05/08/2018 - 22:10

షాక్‌నుంచి తేరుకోగానే ఆలోచించాడు. నిరంజన్ దగ్గర బ్లాక్‌మనీ చాలా ఉంది. అది అంతా ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లలో ఉంది. తన దగ్గర ఉన్న పాత నోట్లని కొత్త నోట్లుగా మార్చటానికి పథకం వేసాడు. అంత డబ్బు మార్చటం తన ఒక్కడివల్ల కాదు. అతడు తన అసిస్టెంట్స్ సహాయం తీసుకోవాలి అనుకున్నాడు. నిరంజన్ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం తాలూకు లెక్కలు చూసే ఆడిటర్ ఒకడు ఉన్నాడు. అతడి సలహాలు కూడా తీసుకున్నాడు నిరంజన్.

05/07/2018 - 21:55

‘‘అకిటోహికిటో... వాడెవడు?’’
‘‘ప్రపంచానికి సహజీవన వ్యవస్థను పరిచయం చేసిన మహానుభావుడు. అందుకే ఆయనకు నోబెల్‌ప్రైజ్ వచ్చింది.’’
‘‘ఓహో!... మన ఇద్దరిలో నువ్వే సీనియర్‌వి... ఐతే ఎప్పుడూ నీమాటే చెల్లుతుంది అన్నమాట?’’
‘‘అవును! అందుకే మనం ఇప్పుడు ఇడ్లీనే తినాలి... నువ్వు నా మాటే వినాలి!’’ కామేశ్వరి కోపంగా చెప్పింది.
‘‘నేను తినను...! అంతేకాదు మన సహజీవనం క్యాన్సిల్!’’

05/06/2018 - 21:43

చెప్పండి అన్నట్లు చూసాడు కార్తీక్.
‘‘ఏం లేదు. మనకున్న పరిచయంతో చెపుతున్నా!..... మీకు లాభం కలిగించే విషయం...’’ అని ఆగాడు బంగారయ్య.
కార్తీక్ చెప్పమన్నట్లు చూసాడు.
‘‘మీకు తెలుసుగా?... పెద్ద నోట్లు రద్దయిపోయాయి... వాటిని మార్చుకోవటం కష్టంగా ఉంటోంది.

05/04/2018 - 21:52

వెంటనే నవ్వుతూ అన్నదా అమ్మాయి.
‘‘నన్ను గుర్తుపట్టారన్నమాట...!... నేను వచ్చింది మిమ్మల్ని తిట్టటానికి కాదు....! టెంపుల్లో జరిగిన దానికి అయామ్ సో సారీ....!’’
ఆ మాటతో కార్తీక్‌తోపాటు, పున్నాగ చెట్టు చాటున ఉన్న గోపిక కూడా ఉలిక్కిపడింది. అయోమయంగా ఆ అమ్మాయి వైపు చూసాడు కార్తీక్.
ఆ అమ్మాయి అన్నది.

05/03/2018 - 21:36

‘‘ఇందాక నా గురించి డ్రైవర్‌తో ఏమన్నావ్? నేను నీకు ఏదో అవుతాను అన్నట్టున్నావ్??’’ కోపంగా అడిగింది గోపిక.
‘‘ఆ సంగతి ఇప్పుడు అడుగుతున్నావేంటి? అప్పుడే అడక్కపోయావా?’’
‘‘అడిగేదానే్న!....కానీ!!...’’
గోపికకు ఏంచెప్పాలో అర్ధంకాలేదు. ఆ సమయంలో ఆమె పిల్లర్ వెనక దాక్కుని ఉంది. ఆమె ఆలోచిస్తుండగానే కార్తీక్ పక్క సీట్లో కూర్చున్నాడు.

Pages