S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

07/05/2016 - 21:38

రోడ్డుమీద వేగంగా దూసుకుపోతున్న కార్లనీ స్కూటర్లనీ తప్పించుకుంటూ రోడ్ క్రాస్ చేసి బస్టాప్ దగ్గరకొచ్చి నిలబడింది హరిత.

07/03/2016 - 21:21

‘‘కావచ్చు. కానీ ఆ రోజు భరణి గెస్ట్‌హౌస్‌కి వచ్చే సమయానికి వాచ్‌మెన్ అక్కడ లేకపోవడం మాత్రం యాదృచ్ఛికం కాదు. ఎవరో కావాలనే ఆ సమయానికి అతడు అక్కడ ఉండకుండా ప్లాన్ చేసారు’’
‘‘ఎలా చెప్పగలుగుతున్నారు?’’

07/03/2016 - 01:12

‘‘్భరణికి చాలా పెద్ద మిత్ర బృందమే ఉంది. ఎక్కువగా అతడితోపాటూ తిరిగేది మాత్రం రాజు, శ్రీను. వాళ్ళిద్దరూ భరణి క్లాస్‌మేట్లు. ముగ్గురూ కాలేజీలో ఒకరోజే జాయినయ్యారని చెప్పుకుంటుంటే విన్నాను. భరణి ఏం చేస్తున్నా, ఎక్కడికెళ్లినా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పక్కనే ఉంటారు’’.
‘‘ప్రస్తుతం వాళ్ళెక్కడ ఉన్నారో తెలుసా?’’

07/01/2016 - 22:01

అమ్మాయిలకి అతడిపట్ల హీరోవర్షిప్. అతడి వెంట ఎప్పుడూ ఎవరో ఒకమ్మాయి ఉంటూ ఉండేది. అమ్మాయిలంతా వెంటబడే అతడంటే అబ్బాయిలకి కూడా హీరో వర్షిప్ ఉండేది. భరణి మాత్రం స్టూడెంట్లందరికీ ‘ఎంజాయ్ చెయ్యండి, కానీ మీరిక్కడికి వచ్చింది ఎంజాయ్ చెయ్యడానికి కాదనీ, చదువుకోవడానికనీ మర్చిపోకండి’ అని చెబుతూ ఉండేవాడు.

06/30/2016 - 21:21

‘‘అవును. నువ్వంటూ ఉంటావు కదా? ఉరుము ఉరిమి మంగలమీద పడిందని. అందులో మంగలం అంటే ఎవరు?’’

07/01/2016 - 22:02

‘‘్భరణి శవాన్ని మొదటిసారి చూసింది నువ్వేనా?’’

06/28/2016 - 22:55

దీన్ని బట్టి ఇక్కడికి భరణితోపాటూ వచ్చిన వాళ్ళకి భరణి మరణంతో సంబంధముందన్న విషయం అర్థవౌతోంది. అది నా అనుమానానికి రెండో కారణం’’.

06/27/2016 - 03:22

అప్పుడు కూడా అతడి కొడుకు భరణి ఆ గెస్ట్‌హౌస్‌లోనే ఉన్నాడు.. కాకపోతే పై అంతస్థులోని పడక గదిలో శవమై పడి ఉన్నాడు.
ఒక్కగానొక్క కొడుకు మరణవార్త తాలూకు దుఃఖంతో క్రింద హాల్లో కూర్చున్న భుజంగరావు కూడా ప్రాణం వున్న శవంలాగే ఉన్నాడు.
‘‘అబ్బాయికి హార్టు ప్రోబ్లమ్స్‌గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా?’’ హాల్లోవున్న జనాల్లో ఎవరో అడిగారు ప్రక్కన కూర్చున్నవాళ్ళని.

06/25/2016 - 21:35

‘‘నిన్ను నేను మొదటి చూపులోనే ప్రేమించాను. నీ అందం నన్ను పిచ్చివాడని చేసింది. నాకెందుకో మొదటినుంచీ అనిపిస్తూనే వుంది రాజేష్‌గాడు నీకు కరెక్ట్ కాదని!’’

06/24/2016 - 21:42

అపుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది. ‘ఈవినింగ్’ అంటే చీకటి రాత్రులనీ, ‘నైట్’ అంటే అర్థరాత్రి దాటిన తెల్లవారు ఝాము అనీ అర్థాలు మారిపోయినట్లనిపిస్తుంది అక్కడి వాతావరణాన్ని చూస్తే.

Pages