S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

05/19/2016 - 21:19

నాలుగు ఆప్షన్సిచ్చి అందులో ‘వేము’ కూడా ఇచ్చారు. అది మన పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి కాదు. ఎవరికో ఒకరికి పదివేల రూపాయల బహుమతి ఇవ్వాలని వాళ్ల ఉద్దేశ్యం. ఎందుకో మనకి సాయపడాలని అత్తయ్యకి అనిపించింది. శాస్త్రానికన్నట్లు ఓ షరతు పెట్టింది. రహస్యమని పెద్ద హడావుడి చేసి - నేను అవలీలగా చెయ్యగల పని నాకు అప్పగించింది. ఇక మన కష్టాలు తీరినట్లే అనుకో అమ్మా!’’ అన్నాడు.

05/19/2016 - 04:21

బహుశా బిచ్చగాడి హత్య గురించి చెప్పొచ్చని అతడికి అనిపించింది. అదే నిజమైతే రాజా ఎక్కడున్నదీ ఇంట్లో వాళ్లకి తెలిసుండాలి.
శ్రీకర్ శ్రద్ధగా వింటున్నాడు.

05/17/2016 - 21:31

గోపాల్ అన్న రాజా కొన్నాళ్లుగా కనిపించడంలేదు. పోలీసు స్టేషన్లో కంప్లయింటివ్వడానికి మేనత్త ఒప్పుకోవడం లేదు. రహస్యంగా ఇద్దామంటే పోలీసులతో వ్యవహారం ప్రమాదకరం అని భయం. జనాల్ని సానుభూతితో అర్థం చేసుకునే ఒకే ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్ శ్రీకర్ అని ఊళ్లో చెప్పుకోవడం విన్నాడు. తన కేసు మధురాపురి ఏరియాది కాకపోయినా- ఆయన పెద్ద మనసు చేసుకుని విని సాయపడతాడని ఎంతో ఆశతో ఇక్కడికొచ్చాడు.

05/15/2016 - 22:46

కానీ బాధ్యత మనదౌతుంది. తెలివిని ఇతరులకమ్మితే- మనకి సంపాదన తక్కువుండొచ్చు కానీ బాధ్యత ఉండదు. బాధ్యతలు లేని సంపాదన మనిషికి ఎదుగుదలకంటే ఎక్కువ సంతోషాన్నిస్తుంది. జీవితంలో సంతోషానికి ప్రాధాన్యం ఇవ్వడమే అసలైన తెలివి’’ అంటాడు సందరం తండ్రి. ఆయన్ని అనుసరిస్తూ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు.

05/14/2016 - 22:24

అటు ఆ గ్రామస్థులనుంచి కానీ, ఇటు మన మీడియా నుంచి కానీ- ఫిర్యాదులూ లేవు, సహకారమూ లేదు..’’ అని నిట్టూర్చాడు.
‘‘నేనో మాటంటాను సార్- ఏమీ అనుకోవద్దు’’ అన్నాడు సుందరం. శ్రీకర్ చెప్పమన్నట్లు చూడగానే, ‘‘ఇక్కడికి ఈశ్వర్ సారొచ్చారు. మధురాపురిలో నేరమన్నది లేకుండా పోయింది. ఆయన స్థానంలో మీరొచ్చారు. నరకపురి విషయం తేలిపోతుందని నాకనిపిస్తోంది’’ అన్నాడు.
‘‘ఎందుకని?’’ అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా.

05/13/2016 - 23:03

శ్రీకర్ కళ్లు మెరిశాయి. సుందరం కళ్లు మెరిశాయి. ఏం చెబుతాడోనని ఇద్దరి ముఖాల్లోనూ ఆత్రుత.
‘‘నాది నరకపురి సార్!’’ అన్నాడు అప్పూ.
‘‘వ్వాట్!’’ అన్నాడు శ్రీకర్. ఇక్కడ నరకపురి ప్రసక్తి వస్తుందని అతడూహించలేదు.
‘‘ఔను సార్! నాది నరకపురి. నరకపురి వాళ్లకి ఎక్కడైనా జీతాలెక్కువ’’ అన్నాడు అప్పూ.
‘‘ఎందుకు?’’
‘‘అది ఇచ్చేవాళ్లని అడగాలి సార్- నాకేం తెలుస్తుంది?’’ అన్నాడు అప్పూ.

05/12/2016 - 21:36

‘‘ఇంతవరకూ నాకు పోలీసు రికార్డు లేదు సార్!’’ అన్నాడు అప్పూ చటుక్కున.
‘‘పోలీసు రికార్డులు లేని చాలామంది- దొంగనోట్లు అచ్చేస్తున్నారు. మర్డర్లు చేస్తున్నారు..’’
‘‘నన్ను నమ్మండి సార్! పోనీ మీరు నేనుండే గదికొచ్చి చుట్టుపక్కల వాకబు చెయ్యండి. నా కారెక్టర్ గురించి ఏ ఒక్కరు చెడుగా చెప్పినా- మీరే శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధం’’ అన్నాడు అప్పూ.

05/12/2016 - 06:24

చంద్రి విదిలించుకోబోతే అప్పూ పట్టు బిగించాడు. ఇద్దరిమధ్యా కాసేపు పెనుగులాట. చివరికి చంద్రి, ‘‘రాస్కెల్! ఒంటరిగా ఆడపిల్ల కనబడితే కళ్లు నెత్తికెక్కాయా?’’ అంటూ చాచి లెంపకాయ కొట్టింది అప్పూని.
అప్పూకిది ఊహించని ఘటన. క్షణం పాటు నిశే్చష్టుడయ్యాడు.
అంతలో అక్కడ నలుగైదురుగురు జనం మూగారు. వాళ్లలో కానిస్టేబుల్ సుందరం కూడా ఉన్నాడు.
‘‘ఏం జరిగిందమ్మా?’’ అన్నాడు సుందరం.

05/10/2016 - 21:25

అప్పుడతడికి ఆమె జడలో సంపంగి పూలు కనబడ్డాయి. ఆ పరిమళం గుప్పుమని ఉక్కిరిబిక్కిరి చేసిందతణ్ణి.
ఆమె ఆసక్తిగా వీడియో చూస్తోంది. ఆమె ముఖం చూస్తుంటే- ఆత్రంగా కాశీమజిలీ కథ చదువుతున్నట్లు అమాయకంగా వుంది.
మొబైల్‌లో వీడియో, పక్కనే అందాల భామ. అప్పూకి వళ్లు వేడెక్కింది. ఏమైతే అయిందని తన ఎడమ చేతిని ఆమె కుడిచేతిమీద ఉంచాడు.

05/08/2016 - 21:39

చామనచాయ రంగు. ముదరాకుపచ్చ పరికిణి. నల్ల జాకెట్టు. లేత నీలం ఓణీ. జుట్టు బాగా బిగించి జడ వేసుకుంది. కళ్లనిండా అమాయకత్వం. చూడగానే పట్నం వాసన ఆట్టే తెలియని పల్లెటూరి పిల్లలా ఉంది.
ఆమె అతణ్ణి చూసి స్నేహపూర్వకంగా నవ్వింది.
అప్పూ ఆశ్చర్యపోయాడు. ఆ పల్లెటూరి అమ్మాయి నవ్వు అంత మనోహరంగా ఉంటుదనుకోలేదతడు.
తనూ నవ్వి, ‘బస్ కోసమా?’ అన్నాడు.

Pages