S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/24/2015 - 04:36

హైదరాబాద్ వెళ్లి కాలేజీలో చేరా.. నాకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో నాన్నకు రెండుసార్లు మాత్రమే ఫోన్ చేశా, డబ్బుకోసం.. ఏ పండగలకూ, ఏ లీవులకూ ఇంటికి వెళ్లలేదు. వెళ్లానిపించలేదు.
నేను పెరిగిన వాతావరణం, నేను చదువుకున్న చదువు, నా ఆలోచనలు పూర్తిగా భిన్నం. ఊరికి వెళ్లినా అమ్మా నాన్నతో ఒక్క రోజు కూడా ఉండలేననిపించింది. నాన్న మాత్రం ఎవరిదో బంధువుల పెళ్లికని ఒక్కసారి వచ్చి చూసి వెళ్లారు.

11/23/2015 - 04:28

నేను వెళ్లి ఆ బంగారు పూవును తీసుకొచ్చాను. నేను పూవుతో తిరిగి రావడం చూసి అమ్మా నాన్న, కరస్పాండెంట్లు గట్టిగా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు గుండె, ఒక చేయి తప్ప మరేమీ మిగలని విషయం వాళ్లకు తెలీలేదా, తెలిసినా తెలీనట్టు ఉన్నారో అర్థం కావడంలేదు.

11/21/2015 - 23:24

అందరికీ దూరంగా, అన్నిటికీ దూరంగా ఎంత హింస అనుభవించాను. దానిని ఎవరూ గుర్తించరెందుకు? ఒకవేళ నాకు ర్యాంకు రాకుంటే, అవును.. ర్యాంకు రాకుండా ఉంటే.. అపుడు నాకు ఇన్ని పొగడ్తలు ఉండేవి కావు. ఇంత గుర్తింపు ఉండేది కాదు.. నాలాంటివాళ్లు హాస్టల్లో మరో వందమంది ఉన్నారని ఒకసారి లెక్కలేసుకుని అనుకున్నా. వారిలో ఏ ఒక్కరికీ నాలా ర్యాంకు రాలేదు. కనీసం పది ర్యాంకుల్లో కూడా స్థానం లేదు.

11/20/2015 - 22:57

‘‘ఏ అమ్మా నాన్న అయినా ఉండే ఒకే ఒక్క కొడుకును రెండేళ్లపాటు ఇంటికి తీసుకుపోకుండా ఉంటారా? వీళ్లిద్దరూ ( అమ్మా నాన్నను చూపించి) రెండేళ్లలో ఒక్కసారి కూడా వాళ్ళబ్బాయిని ఇంటికి తీసుకుపోలేదు. వాళ్లకు చదువు గొప్పతనం తెలుసు. వాళ్ల కొడుకు గొప్పవాడు కావాలనేదే వాళ్ల కోరిక. అందుకోసం వాళ్లు కొడుకుమీది ప్రేమను త్యాగం చేశారు..

03/18/2015 - 11:58

ఇంకా శరభాంకారాధ్యుడు, మల్లికార్జున పండితుడు ఇత్యాది పాలకుర్తి సూరనాధ్యుడు, శివగణము ఐదువేలమంది, విష్ణ్భుక్తులైన ఆచార్య స్వాములు మూడు వందలమంది, శాక్తేయులు, గాణాపత్యులు, క్షేత్రపాలకులు నాలుగువేల మూడు వందలమంది వీరందరితోను నిండు పేరోలగము కిటకిటలాడుతుండగా ముందు వేదస్వస్తి జరిగింది. తర్వాత కవితా గోష్ఠి విద్యనాధ అగస్త్యుడు సంస్కృతంలో కవిత్వం చెప్పాడు.

Pages