S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

10/03/2019 - 21:58

ఈ సింహం బక్క మృగాలపట్ల మృత్యుదేవతగా ఉంటే ముందు వెనుకలు చూడని వేటగాడు ఈ సింహం పట్ల యముడుగానే ఉంటున్నాడు. వేశ్యావాటికలోని రంగేళీ రాయుళ్ళ నుంచేగాక, వాళ్ళను వేటాడేందుకు నియమించబడిన రక్షక భటులనుంచి కూడా తనను తాను కాపాడుకోవాలి. వేటగాడికి అడవిలో జంతువులన్నీ లోకువే కదా!

10/03/2019 - 19:05

తీగ లాగితే కంపంతా కదిలినట్లు, మొదట్లోనే ఈ హంసపాదు పడిందో, తాను ఊహించిన బ్రహ్మాండమైన ఈ వృక్షం కూకటివేళ్ళతో కదిలినట్లేననిపించింది.
ఇంకా ఇలాంటివేముందుగా ఊహించలేని అనేక క్లిష్ట పరిస్థితులు ఏర్పడవచ్చు. వాటన్నిటినీ తలచుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. కనుక ప్రస్తుతానికి సిద్ధాంతరీత్యానన్నా ముందుకు సాగుతున్నట్లే భావించుకోవలసి వుంటుంది!

10/01/2019 - 20:02

వీరభద్రుని చిరునామా కాని, తదితర వివరాలు కాని ఎవర్ని అడిగి తెలుసుకొనేట్లు? తన దూరపు బంధువొకాయన రాజుగారికొలువులో వున్నాడు. వీరభద్రుడు అందరి దృష్టినీ ఆకర్షించి, అందర్నీ ఒప్పించి, మెప్పించిన మేటిగా చాలా స్వల్పకాలంలోనే కీర్తికాంత వరించిన వీరుడుగానే ముద్రవేయబడి ఉండటంవల్ల మాటల సందర్భంలో ఆ దూరపు బంధువు ద్వారానే వీరభద్రుని వివరాలు రాబట్టవచ్చుననే ఆశ సరస్వతి మనసును ఆవరించి ఆక్రమించింది.

09/30/2019 - 19:39

‘‘ఒక్కరే!’’ అన్నది సరస్వతి అల్ప ప్రసంగానికి దిగి.
‘‘ఎంతిస్తారు?’’
‘‘ప్రవేశ నిష్క్రమణలకు కలిపి యాభై సువర్ణ ముద్రికలు!’’
‘‘అంతేనా! ప్రాణాపాయంతో కూడిన పని. సరే.. ప్రాధేయపడుతున్నావు కనుక చెపుతున్నాను. బహుమతిని రెండింతలు చెయ్, బేరమాడవద్దు’’ ఆతృతతో కూడిన హెచ్చరిక అది!

09/29/2019 - 22:33

‘‘అర్థరాత్రి పనేమిటి?’’ అని మెల్లిగా గొణుక్కుంటూనే కరదీపికను ఆర్పివేశాడు.
‘‘నీ పేరేమిటి?’’
‘‘జయచంద్రుడు!’’
సరస్వతి గుండెల మధ్య ఒక ఇనుపగుండు పడినట్లయింది. కలలోని ద్వారపాలకుడి పరు జయపాలుడు, ఇతని పేరు జయచంద్రుడు!

09/27/2019 - 20:39

‘‘రాణీ! నిరాశపడకు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. నా శరీరంలోని చిట్టచివర రక్తకణాన్ని కూడా తమసేవలో వ్యయపరుస్తాను!’’ అన్నది సరస్వతి ఉద్రిక్తంగా.
‘‘నాకు తెలుసు సరూ! కాని విధి విలాసాన్ని అనుసరించే నడవాలి కదా!’’

09/26/2019 - 19:16

చాలామందికి ఆ తెలివితేటలూ, సామర్థ్యం, నేర్పూ ఉండవు. కనుకనే ప్రపంచంలో నేరం చేయాలని ప్రయత్నించేవారి సంఖ్య తక్కువగానే వుంటూన్నది. అదీగాక ఆ అత్యవసర పరిస్థితుల ఒత్తిడి నెత్తిమీదకి రానంతవరకూ, పవిత్ర జీవితాన్ని గడిపేందుకు అందరూ ప్రయత్నిస్తారు. దీనికి ఉదాహరణ తమ జీవితమే! ఇక నేరాన్ని విజయవంతంగా రూపొందించేందుకు ముఖ్యమైనవి రెండు. అనుకూల వాతావరణమున్న స్థలమూ సరైన సమయమూనూ.’’

09/25/2019 - 19:29

కాకులు దూరని కారడవుల్లో యధేచ్చగా, సర్వ స్వతంత్రంగా విహరించే సివంగి, తన రాజసాన్ని, హొయలనూ, ఠీవినీ, దర్పాన్నీ ప్రదర్శించగలిగే విధంగా గర్జించగలిగేది బోనులో పడి, క్రమంగా నీరసించి, దీనంగా, జాలిగా, బాధగా చావంటే భయపడిపోయిన విధంగా మూలుగుతున్నట్లు పరిణమించింది రుూ రాణి స్థితి- అనుకున్నది సరస్వతి.

09/24/2019 - 20:19

చచ్చి బతికినట్లయిన ఆ అనుభవం తనకు రెండు జీవితాల్ని ప్రసాదించింది. మొదటిదాని అనుభవం తనకిప్పుడు దివ్యకాంతుల్ని ప్రసారం చేయగలదు!

09/23/2019 - 19:56

ఈ న్యాయాన్యాయాల విచారణా, న్యాయాన్ని ప్రయోగించగలగటం మొదలైనవి తన బాధ్యతలూ కావు. తనకా అవకాశాలూ, అధికారాలూ లేనే లేవు. కేవలం తాను నిర్వర్తించదలచుకొన్న ‘విధి’ తాలూకు ఫలితాలను సమీక్షించటం ద్వారా తేలిందిది. అంతకన్నా తను చేయబోయే పనులను సమర్థించుకొనేందుకూ, అంతరాత్మను సమాధానపరచుకునేందుకూ ఉపయోగపడే తర్కమిది.

Pages