S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

12/17/2018 - 20:01

ఇప్పుడా తేనెపట్టు ముదురు గోధుమరంగులో నిగనిగలాడుతూ, నాణ్యమైన మామిడి తాండ్ర వ్రేలాడుతున్నట్టుంది!
పట్టునుంచి బొట్లుబొట్లుగా తేనె చుక్కలు పడుతూంటే ఓ బుంగను దానిక్రింద పెట్టారు.
తేనె బొట్లు లీలగా చప్పుడు చేస్తూ, బుంగలో పడుతున్నాయి.

12/16/2018 - 22:29

ఇప్పుడు పట్టు యింకా స్పష్టంగా కనిపిస్తున్నది.
తేనె పట్టునిండా చలన రహితంగా కుదురుకున్న తేనెటీగలు ఉదయభానుడి వెల్తురు కిరణాలు పరావర్తనం చెందుతూ మిణుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి!
పట్టు సగభాగంమీద ఎండ పొడపడుతూ, మిగిలిన సగ భాగం నీడలో వుంటే- గ్రహణం విడుస్తున్న చందమామలా వుందా తేనెపట్టు!
వాళ్ళు ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. ‘‘జాగ్రత్త’’అని హెచ్చరించుకున్నారు, కనుసైగలతోటే!

12/14/2018 - 18:39

‘‘ఎట్టా’’
‘‘మంచి బువ్వెట్టి మందుగోలీలు మింగిచ్చి దేవుడి పందికి శావలు జేస్తే - మడుసుల్లో యింకా భక్తి ఉండట్టు. పంది దారి పందిదంటే భక్తి లేనట్టు’’
‘‘ఏందేలింది’’ అని కాళీచరణ్ అడిగాడు
‘‘ఉండట్టే ’’
‘‘ఎట్టా’’
‘‘జొర్గవ్ తగ్గాలని పూజలే జేశారా. పొర్లు దండాలే బెట్టారా కొబ్బెరకాయలె గొట్టారా సివరాకరికి సర్కారు గూడా పందికి మంచి వైజ్జిగం సెయ్యాలని ఆడరేసింది’’

12/13/2018 - 19:22

‘‘ఏం ఖనిజఁ వుందంట?’’ బాణావతు అడిగాడు.
‘‘బాక్‌సయిటు అంటారంట దాన్ని’’
‘‘అదిగూడా కానిస్టేబులే జెప్పిండా?’’
‘‘సెప్పిండు.’’
‘‘ఇంకా ఏటన్నాడేఁవిటి?’’
‘‘ఒక్క ఖనిజఁవేగాదు, రుూ సుట్టుపక్కల అడివిలో కలివికోళ్ళు ఉండయ్యంట. అయ్యి గొప్ప జాతకోళ్ళంట. సత్తే యింక దొరకవంట... అంశాత, కోళ్ళకోసరఁవ్ గూడా కొంత అడివిని కేటాయిచ్చి రచ్చణ గల్పిత్తారంట...’’

12/12/2018 - 18:40

‘‘వాల్యాగాడ్ని తెత్తానుండు’’ అని బైటికి దారితీసాడు బాణావతు.
* * *
ఎన్నో తరాలుగా నిర్మలంగా పవిత్రంగా గంగా జలంలా వున్న అడవి పుత్రుల్లో ఇప్పుడు చాలామంది సంతబేరం కోసం గౌరారం వెళ్లటం, నాగరికులతో కలవటం పరిచయాలు పెంచుకోవటంవల్ల సహజత్వం కోల్పోయి అపవిత్రమై పోతున్నారన్నదే తండా పెద్దల బాధ!

12/11/2018 - 21:54

తండ్రికి అన్యాయం జరిగిందన్నకోపంలో వళ్లుమరచి, ఆవేశంలో ఏదో ఆలోచించాడు కానీ, కొండదేవర-దేవరకు మహత్మ్యం లేకపోతే విశ్వసృష్టి ఎలా జరిగేది?’’ ఎలా మనుగడ సాగించేది?
దేవుడ్ని శంకించినందుకు తనను తానే నిందించుకున్నాడు. అంతలోనే భయం వేసింది. తలెత్తి, నల్లకొండ వైపు చూశాడు నాయక్!
కోపంగా వున్న కొండదేవర ఊహలో కనిపించాడు!
సందేహం లేదు!
తననలా, తప్పని వారించింది కొండదేవరే!

12/11/2018 - 18:46

ఆత్మను చంపుకొని దళారీలతో రాజీపడుతూ శ్రమశక్తిని కారుచవుకగా దోపిడి వర్గాలకు ధారపోస్తూ క్షణమొక యుగంగా బ్రతుకులీడస్తున్నదా-
సంకటి ముద్దలకోసమే!
అలాంటి సంకటిభాండానే్న బ్రద్ధలు చేశాడు వాల్యా.
లక్ష్మీబాయికోపం కట్టలు తెంచుకుంది.
ఆవేశం అవధులు దాటింది.
ఉత్తుంగ తరంగాలుగా ఎగసిపడ్డ ఆగ్రహం ‘నిగ్రహం’ అనే చెలియలికట్టలు దాటి, పుత్ర వాత్సల్యాన్ని కూడా ముంచెత్తి-

12/09/2018 - 22:46

బైనెట్లతో పొడుస్తున్నారు.
నిస్సహాయంగా బాధను భరిస్తూ, బాధ ఆవేదనై, ఆవేదన కోపమై కోపం క్రోధంగా మారి, అంతకన్నా చేసేదేమీలేక వాళ్ళమీద కాండ్రించి ఉమ్మేశాడు రెడ్డియానాయక్.
అతని కళ్ళు జ్వలిత జ్వాలలయ్యాయి. ఎర్ర మందారాలయ్యాయి.
ఒక్క అవకాశం చిక్కితే ఎంత బావుంటుందో!

12/07/2018 - 23:03

మీరీబాయి విసురుగా భర్త దగ్గరికి వెళ్ళింది.
‘‘రొండుబార్ల పొద్దెక్కింది. గూడెం నిదర లెగిసింది. తోటోళ్ళు అడివికెళ్ళినా దొరోరికింకా నిదరేనా... లెగు...లెగు వింక! లెగిసి, తొందరగా తానంజేసి అడివికెళ్ళు’’అన్నది చేత్తో భర్తను తట్టి పిలుస్తూ.
రెడ్డియా పూర్తిగా కళ్ళుతెరిచాడు. భార్యను చూస్తూ మురిపెంగా నవ్వాడు. లేచి కూర్చొని చుట్టూ చూసాడు!

12/06/2018 - 19:23

ఓ టేకు చెట్టుదగ్గర బాణావతు నిలబడి ఉన్నాడు.
వినమ్రంగా తల వొంగి టేకుచెట్టుకు నమస్కరిస్తూ, కొద్ది క్షణాలు వౌనం పాటించాడు.
నెమ్మదిగా కళ్ళుతెరచి ఆర్తిగా చూశాడు!
టేకు చెట్టు కాండం నిండా బెరడు పొడలు నెత్తుటి గాయాల్లా ఉన్నాయి.
విషాదంగా నవ్వాడు బాణావతు.
అతని చిత్తడి కళ్ళనుంచి అశ్రుకణాలు బొట్లుబొట్లుగా జారి చెక్కిళ్ళగుండా నేల తల్లిని స్పృశిస్తున్నాయి.

Pages