S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/22/2019 - 20:01

‘‘కొండ దేవరయి సావీ’’ అన్నాడు బాణావతు.
ఇక వాళ్ళ వైపు చూళ్ళేదు పూనకం దేవర!
ఆవేశంతో రొప్పుతూ, గాల్లోకి ఎగిరెగిరిపడుతూ.. మధ్యలో పిల్లిమొగ్గలు వేస్తూ, పరిసరాలు ప్రతిధ్వనించేలా అరుస్తూ, పరాకాష్టకు చేరిన పూనకంతో పెద్ద పెద్దగా రంకెలు వేస్తున్నాడు!
‘‘యావయ్యిందంటే సెప్పవేటి దేవరా’’ బాణావతు అడిగాడు.

01/21/2019 - 19:00

రాగ్యా ఒక్క క్షణం ఆగాడు.
‘‘ఇంకా నన్ను నమ్మరా...?’’అని అడిగాడు.
‘‘మడిసి మంచాడయితే సాచ్చీకార్తోపనే్లదు..’’అని కాళీచరణ్ కొడుకు వైపుచూసాడు.
‘‘అంటే, నేను మంచాడ్ని కాదనేగదా’’
‘‘మంచాడివైతే మాకీ కర్మేంటికి పట్టుద్దిగానీ... పద.. పద! ఎర్ర నెమిళ్ళని చూపియ్యి’’ అన్నాడు కాళీచరణ్.
వాళ్ళంతా నెమలిగుట్టకు బయల్దేరారు.

01/20/2019 - 22:38

‘‘దేవరకేంటి కొచ్చింది, ఆగ్గరవ్?’’ నగ్గూరాం అడిగాడు.
‘‘ఏంటికో తెలవదుగానీ, మొత్తానికి దేవరకి అగ్గరవొచ్చింది. మనమీద పగబట్టిండి.
పగబట్టినోడు పావుల్నే అంపిత్తాడో- పులుల్నే అంపిత్తాడో - సివాల్నే అంపిత్తాడో -సంపటవ్ మాత్తరవ్ ఖాయం’’ అన్నాడు రాగ్యా, భయంతో వొణికిపోతూ.
అడవి పుత్రుల ఆవేశం అంతా చప్పున చల్లారిపోయింది! దాని స్థానంలో ఆందోళన చోటుచేసుకుంది!

01/18/2019 - 19:24

‘‘తగినన్ని పోలీసు బలగాలు లేవుకదా.’’
‘‘అదనపు బలగాలకోసం కబురువెళ్ళింది’’అని చెప్పాడు ఎమ్మెల్లే.
గరుడాచలం స్థిమితపడ్డాడు.
కొంతసేపటికి ఎవ్వరో పోలీసు ఉద్యోగి వొచ్చాడు. ఎమ్మెల్లేకి నమస్కరించి వినయంగా నిల్చున్నాడు.
‘‘కొండ దగ్గరి విశేషాలేమిటి’’అని అతన్ని ఎమ్మెల్లే అడిగాడు.
‘‘రెడ్డియానాయక్ తండావాళ్ళు రాగ్యాకోసం వెతుకుతున్నారు సార్’’ అన్నాడతను.

01/17/2019 - 19:17

సాంప్రదాయక ఆధారాలైన ఈటెలు, వేట కొడవళ్ళు, బరిశెలు, వడిశాలలు, బాణా కర్రలూ ఉన్నాయి.
కళ్ళల్లో కసి, కోపం వుంది.
ఆయుధాల మీద బిగుసుకున్న పిడికిళ్ళలో అనంతమైన ప్రతిఘటనా శక్తి వుంది.
వాళ్ళ చూపుల్లో చురుకుదనం వుంది!
రాగ్యా కనిపిస్తాడా?
వాడు పెద్ద తప్పుచేసాడు. పెద్దల్ని ధిక్కరించాడు కట్టుబాట్లను కాలదన్ని, క్షంతవ్యం కాని నేరం చేశాడు.

01/16/2019 - 18:31

వంట పనిలో తాముంటే జలనంలో కలిసి తప్పిపోతారని- పిల్లల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు.
పెద్దవాళ్ళవెంట పిల్లలుంటే రంగులరాట్నం వాడు మాటలతో వూరిస్తూ-
‘‘పిల్లలు తిరిగే రంగుల రాట్నం... దర్జాగా కూర్చోండి. గుండ్రంగా తిరగండి... రాండి పిల్లలూ.., రాండి! రంగుల రాట్నం ఎక్కండి’’ అంటూ పిల్లలకు సైగలు చేస్తున్నాడు.

01/14/2019 - 19:21

‘‘ఎనిమిదిగొంటే?’’ అని అడిగాడు గోపీనాయక్.
కిలాడి వ్యాపారి మొహం వాడిపోయింది!
ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకపోతే తన మోసం బైటపడుతుంది.
ఇక యంత్రాలు అమ్ముడుపోకపోగా, ఇప్పటికే కొన్నవాళ్ళు గొడవ చేస్తారు.
ఏం చెప్పాలా? అని.
ఒక్క క్షణం ఆలోచించి-

01/13/2019 - 23:28

మాదక ద్రవ్యాల జోలికి రావటంలేదు.
పేకాట పట్టించుకోవడంలేదు.
‘‘ ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అంటే నేం!
‘‘అన్యాయం.. అక్రమం’’అని అరిచే ‘లడీకొడుకుల’కన్నా, అరవని ఆ దొంగ.... కొడుకులు ఎంతో నయం!
జాతర సందడి మొదలయ్యింది.
తండాలనుంచి అడవి పుత్రులు తండోపతండాలుగా వొస్తున్నారు.
ముసలివాళ్ళని డోలీల్లో తెస్తున్నారు.
కుటుంబాలకు కుటుంబాలే తరలి వస్తున్నాయి.

01/11/2019 - 19:23

అందుకే నేను టోపీ తీసేసి, చొక్కా విప్పి ప్రక్కనపెట్టి, పూనకం వచ్చినట్టు చిందులేస్తూ, వేప మండలతో సీతాల్ని చావగొడుతూ-
‘ననే్న గురుతుపట్టలేదంటనే పోలేరా! రాజుని. పోతురాజుని! నీ పెనివిట్ని! గాచారవ్ గాలి నీకాడికి సందాకొచ్చిండుగానీ, కానిస్టేబుళ్ళు తల్సుకుంటే కొమ్ముల్దిరిగినోళ్ళే ఇత్తారు సందాలు! ఇడ్సిపెట్టు. ఆడ్నిస్సిపెట్టు’ అంటూ నేను వేపమండలతో సీతాల్ని ఇంకా బలంగా బాదాను.

01/10/2019 - 19:52

గరుడాచలం రాగ్యావైపు మొహం విప్పార్చి చూస్తూ-
‘‘చూశావా రాగ్యా! నీ విషయంలోనే ఎమ్మెల్లేగారు కబురుపెట్టింది. అన్ని ఏర్పాట్లూ వారే చూస్తున్నారు. పెద్దపెద్ద వాళ్ళతో మాట్లాడరుకూడా! చాంద్‌నీనీ, నిన్నూకలపందే నిద్రపోరు’’అని రాగ్యాకి ధైర్యంచెప్పి, ఎమ్మెల్లే గుడారానికి వెళ్ళిపోయాడు గరుడాచలం.

Pages