S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/01/2018 - 01:09

కాశి అటుకేసి రావడం గమనించింది.
‘‘మళ్లీ వీలు దొరికినపుడల్లా మాట్లాడుతాను’’ ఫోన్ ఆఫ్ చేసింది లోహిత.
హోటల్లో భోజనం చేసి ప్రయాణం కొనసాగించాడు.
ఉయ్యూరు నుంచి ఎడంవైపునకు తిరిగి కొమ్మమూరు, దేవరకొండ మీదుగా ఐలూరు వైపు వెళ్ళే రోడ్డుకు మళ్లించాడు కారును.
అన్నీ పల్లెటూళ్లే. ఎటువైపు చూసినా పచ్చటి పొలాలు.
చెరకు తోటలు, అరటి తోటలు ఎక్కువగా కన్పించాయి.

02/27/2018 - 21:08

పదేళ్ళ కుర్రాడు చెక్కతో చేసిన బొమ్మలు తెచ్చి కారులో కూర్చున్న లోహితకు చూపించాడు. కారు దిగి రెండు నిముషాలు ఆ కుర్రాడితో మాట్లాడాలన్పించింది ఆమెకు.
కారు దిగింది లోహిత.

02/26/2018 - 21:54

క్షణాల్లో భయం కుప్పకూలిపోయింది’’ అన్నాడతను సెల్‌లో రికార్డు అయిన ఫొటోను అరిఫ్‌కు చూపిస్తూ.

02/25/2018 - 22:35

మాన్‌హోల్‌లోపల ఒకటే మురుగువాసన.
దోమలు పీకుతున్నాయి.
మొహానికి కప్పిన దుప్పటి తొలగించుకుని పెద్దగా కేకలు పెట్టింది. ఆమె అరుపులు, కేకలు ఎవరికీ విన్పించడంలేదు.
నడుం లోతువరకు మురుగునీళ్ళు ఉన్నాయి. చేతులు కిందకు చాపితే మురుగునీళ్ళు తగులుతాయి. మళ్లీ ఆ చేతుల్ని మొహం దగ్గర పెట్టుకోలేదు.

02/23/2018 - 22:27

‘‘మీరు స్కంద, ఐపియస్ గదా!’’
‘‘అవును’’ అన్నాడు స్కంద.
‘‘మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు?’’
‘‘ముంబైలోని అరిఫ్‌గారి బిల్డింగ్‌లో గ్యారేజ్‌లో, అండర్‌గ్రౌండ్ రూములో బాంబులు పెట్టారని, అవి ఏ క్షణాన్నైనా పేల్చవచ్చని మాకు సమాచారం వచ్చింది.. ఆ సమాచారాన్ని ముంబై పోలీసు కమిషనర్‌గారితో షేర్ చేసుకున్నాం! బాంబులు నిర్వీర్యం చేసే పనిలో వున్నాం.. మీరెవరో చెప్పారుగాదు’’ అన్నాడు స్కంద.

02/22/2018 - 23:31

ఎదుటివాడు మాట్లాడింది నచ్చకపోతే ఎగిరిపడతాడు. అతను చెప్పింది వినడం, చెయ్యమన్న పని చెయ్యడం ఉత్తమం!
వౌనంగా వుండిపోయాడు అరవింద్.

02/22/2018 - 05:12

‘‘విష్‌యు హాపీ జర్నీ సార్’’ అంది లోహిత.
‘‘ఈ ప్రయాణాలు నాకు మామూలే! ముంబై, పాట్నా తరచుగా వెళ్తూనే వుంటాను.. నీ పెళ్లి కుదిరితే నాకు ఫోన్ చేసి చెప్పు!’’ అన్నాడు అరవింద్ కారు ఎక్కుతూ.
నవ్వుతూ అక్కడే వుండిపోయింది కారు స్టార్ట్ అయ్యేదాకా.
డాక్టర్ అరవింద్ వెళ్ళేక పెద్దగా నిట్టూర్పు విడిచింది.
***
ఎయిర్‌పోర్టులో కారు డిపార్చర్ వింగ్ దగ్గర ఆగింది.

02/20/2018 - 21:45

తన వెనుక ఓ స్కార్‌పియో కారు వస్తూ ఉంది. తన కారును దాటుకుని వెళ్ళే ప్రయత్నం చెయ్యడంలేదు. తన కారు వెనుక ఫాలో అవుతుంది ఆ కారు. కారు డ్రైవరు వీలు చూసుకుని తనకారును ఢీకొట్టే ప్రయత్నంలో వున్నాడని గ్రహించాడు స్కంద.
కారు వేగం పెంచాడు.
తరుముకుంటూనే వస్తూ వుంది ఆ కారు.

02/19/2018 - 21:07

రెండునెలల క్రిందట పాకిస్తాన్‌లో వున్న గుడ్ సమారిట్ హాస్పిటల్ మూతపడింది. అక్కడి ప్రభుత్వం ఆ హాస్పిటల్‌ను హేండోవర్ చేసుకుంది. పేదవాళ్ళ కిడ్నీలు, ఇతర అవయవాలు పెద్ద ఎత్తున మార్పిడి జరుగుతున్నాయనే విషయాలు బయటపడడంతో బోర్డు సభ్యుల్లో ఆందోళన పెరిగింది. అనాజ్‌ను చైర్మన్‌గా ఎన్నుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అరిఫ్ కొడుకు మీద ఒత్తిడి తెచ్చి వప్పించారు.

02/18/2018 - 21:39

సీ॥ కమలలోచన నన్ను గన్నతండ్రివి గాన
నిన్ను నేమఱకుంటి నేను విడక
ఉదరపోషణకునై యొకరి నేనాసింప
నేర నా కన్నంబు నీవు పెట్టు
పెట్టలేనంటివా పిన్నపెద్దలలోనఁ
దగవు కిప్పుడు దీయఁదలఁచినాను
ధనము భారంబైనఁ దల కిరీటము నమ్ము
కుండలమ్ములు పైడి గొలుసులమ్ము

Pages