S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/15/2017 - 03:52

ఆమె మాటలు, చేష్టలు చూసి జంతువులు, పక్షులు కూడా ముగ్ధులవుతాయి’’.
‘‘నీ మాటల్లో నాకు తెలిసిన ఓ కన్యరూపం కనబడుతోంది. నాకు ఆమె తెలుసు కదా!’’
‘‘ఔనమ్మా, నీకు తెలుసు.. ఆమె మరెవరో కాదు, మన మోరీ..’’
‘‘మోరీనా.. నా దాసీ... మన నిమ్న జీతగాడు. చేనేత వస్తక్రారుడి కూతురు ఈ ఇంటి కోడలా.. నీకు మతిపోయిందట్రా?’’

11/12/2017 - 21:15

‘‘మనం ఏకాంతంలో కలుసుకోవడం మంచిది కాదనిపించింది చిన్నయ్యగారూ. ఎవరికి తెలిసినా స్ర్తిగా నా పరిస్థితి ఏమవుతుందో తమరు ఆలోచించాలి’’.
‘‘మరి నిన్న ఒప్పుకున్నావే?’’
‘‘ఒప్పుకున్నా కానీ తర్వాత నాకు ధైర్యం కలగలేదు. మన వివాహం నిశ్చయమయాక మనం కలుసుకోవడం భావ్యమని నా అభిప్రాయం’’.
‘‘నా మీద నీకు నమ్మకం లేదా?’

11/11/2017 - 19:19

ధైర్యం చేసి ‘‘మోరీ నీకోమాట చెప్పాలి’’ అన్నాడు కింది చూపు చూస్తూ.
ఆమె ‘సెలవివ్వండి చిన్నయ్యగారూ’ అంది వినయంగా.
‘‘నేను నిన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించా’’ అన్నాడు కింది చూపుతోనే.
ఆమె నివ్వెరపోయింది. నోట మాట రాలేదు.
తేరుకుని ఇలా అడిగింది. ‘‘తమరు ఏం అనుకోకపోతే ఓ ప్రశ్న అడిగేదా?’’
‘‘ఎన్ని ప్రశ్నలైనా అడుగు, మోరీ’’
‘‘తమరు ఈ మాట బాగా ఆలోచించే అన్నారా?’’

11/10/2017 - 19:27

తమరు అనుమతిస్తే వెళ్ళి శుభ్రం చేయించే ఏర్పాటుచేస్తా’’ అంది.
అజోడా ఆమెను ఆపలేకపోయాడు. ఆమెపై కోపం వచ్చింది. తనంటే అంత నిర్లక్ష్యమా! ఆమె తన ఇంటిలో సేవకురాలు కాని తన విధులు ఆమె సవ్యంగా నిర్వర్తిస్తోంది. అందరూ ఆమె పనిని మెచ్చుకుంటున్నారు. అటువంటిది తాను ఏ అధికారంతో ఆమెను నిలదీయగలడు?

11/09/2017 - 19:04

ఇన్ని వస్తువులు తన కోసం కొనుక్కున్నా మాజా మోరీకి ఒక వస్త్రం కాని, పూసల హారం కానీ కొనిపెట్టలేదు. ఆమె పిసినారి కాదు.
మోరీపట్ల భర్తకు ఏమంత ఆసక్తి లేదు. కానీ మోరీ అంటే కొడుకు అజోడా మరీ ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. అందుకే మోరీ అంటే (మాజా)ఆమెలో అసూయ జనించింది. ఆమెను మరీ నెత్తికెక్కించుకోకూడదు. ఆమె మనసు బాధపడాలి, అదీ ఆమె ఉద్దేశం.

11/08/2017 - 18:37

వాటిని అక్కడే పొయ్యిమీద మరగబెట్టి చిన్న పాత్రల్లో యజమానికి, కుటుంబానికి అందిస్తారు.
ఉదయం అజోడా, తండ్రి హనోడా భవంతి వెనుక వ్యాయామశాలలో వ్యాయామం చేస్తారు. అక్కడనుంచి వచ్చి పాలు తాగుతారు.

11/07/2017 - 18:21

కాస్సేపటికి మోరీ అక్కడకు వచ్చింది. తండ్రి కూతుళ్ళు వేరుగా మాట్లాడుకున్నారు.
తర్వాత మాజా ముందుకువచ్చారు.
‘‘ఏమంటుంది మోరీ?’’
‘‘నాకు మీ కుటుంబానికి సేవ చేయడం సమ్మతమే అమ్మగారు. కానీ నాకు సంగీత నృత్య కార్యక్రమాలలో పాల్గొనేందుకు, రోజువారీ సాధనకు అవకాశం అవసరం ఉంటుంది,’’ అంది మోరీ.

11/07/2017 - 18:51

‘‘అక్కర్లేదు చిన్నయ్యగారు. నాకు నడక అలవాటే. అంతేకాక ఉదయాన నడక వంటి వ్యాయామం మరోటి లేదు’’.
‘‘సరే నీ ఇష్టం’’
‘‘నే వెళ్లి వస్తా చిన్నయ్యగారూ’’ అని మోరీ వెళ్లిపోయింది.
***

11/04/2017 - 18:50

మాజా ఓ రోజు భర్తతో, కొడుకుతో ‘‘నేను బాగా పాడలేను కదా! అటువంటిది పూజ జరుగుతున్నపుడు పాటగత్తె వచ్చి భక్తిపాటలు పాడితే ఎంత బాగుండును’’ అంది.
‘‘అమ్మా, ఊరి సభాస్థలిలో అటువంటి ఆరితేరిన పాటగత్తె పాడుతూ, నర్తిస్తూ చూశాను. ఆమె పాడుతూంటే నేనే కాదు అక్కడున్న జనం అంతా మంత్రముగ్ధులై విన్నారు. పేరు మోరీట. ఆమె మన ప్రధాన చేనేత వస్తక్రారుడి అమ్మాయేనట’’.

11/03/2017 - 18:41

ఆ భవంతి వాస్తు సౌందర్యంతో కళకళలాడుతోంది. అజోడా నగరంలో ఆమోద గృహంలో మిత్రులతో కలిసి పాచికలాట ఆడి మద్యం సేవించి రాత్రి కాస్త పొద్దుపోయాక ఇంటికి వచ్చి నిద్రించాడేమో పెందరాళే మెళుకువ రాలేదు. పరిమిత మోతాదుల్లో మద్యపానం ఆ సమాజంలో మామూలే. అజోడా తల్లి మాజా ‘‘ఇవాళ పండుగ రోజురా నాన్నా. స్నానోత్సవానికి కొండపై స్నానాగారానికి వెళ్లాలి.

Pages