S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

08/09/2017 - 23:25

‘‘నిన్ను హర్ట్ చేయాలని కాదమ్మా నా ఉద్దేశ్యం’’ అన్నాడు.
‘‘నాకు తెలుసు. నువ్వు ఉద్దేశపూర్వకంగా నన్ను ఎప్పుడూ హర్ట్ చేయలేవు’’ అన్నాను చెయ్యి నొక్కుతూ.
తలుపు చప్పుడయింది.
సంభాషణ మారిపోయింది.
కానీ ఆ రాత్రి నా మనసులో వౌళి మాటలు తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ లేనిది వౌళికి అలా ఎందుకు అనిపించింది.

08/08/2017 - 21:26

అమ్మమ్మ, తాతగారు, అందరూ చాలా వర్రీ అయిపోతున్నారు. నేను, మా పెద్ద మామయ్య మాత్రం చాలా ధైర్యం నటిస్తున్నాం.
నాకు మాత్రం గుమ్మం వంక చూస్తూ కూర్చోవడం ఇంఫాజిబుల్‌గా అనిపించింది. చివరకు మామయ్యతో ‘‘నేను వెళ్లి చూసొస్తాను అని లేచాను’’ అన్నాడు వౌళి.
‘‘ఎక్కడికని వెడతావురా? ఈ వానలో’’ అన్నాడు మామయ్య.

08/06/2017 - 23:04

అయినా ఎవ్వరూ ఇండియా రావడం మానరు. ఇండియా గురించి మాట్లాడం మానరు. అక్కడ రాజకీయాలు, వ్యాపార వ్యవహారాలూ, అందరూ శ్రద్ధగా ఫాలో అవుతారు.
ఏ నలుగురు కలిసినా, భారతదేశం గురించి మాట్లాడకుండా ఉండరు. జరుగుతున్న అరాచకాలకు బాధపడకుండా ఉండరు. దేశంలో ఏదైనా చెయ్యాలన్నా తపన మానరు.
చాలామంది వాళ్ళు పుట్టిన పెరిగిన ఊళ్లకు ఏదో రకపు సహాయాలు అందిస్తూనే ఉన్నారు.

08/05/2017 - 21:59

అవన్నీ పార్ట్ ఆఫ్‌ది వెడ్డింగ్. ఇది నీకు స్పెషల్ గిఫ్ట్.
వాళ్ళ సంభాషణ వింటూ తేజ కుటుంబం అంతా అక్కడే చేరింది.
‘‘ఓపెన్ ఇట్ వౌళి! ఓపెన్ ఇట్! అరిచారు శశి, లతా! సావిత్రి వాళ్ళిద్దరి పిలుపు బావగా మార్చాలని చూసింది. కానీ, వాళ్ళిద్దర్నీ వౌళి అని పిలిస్తేనే బాగుందిట.
మరదళ్ల వంక చూస్తూ ఓపెన్ చేశాడు. తేజాకి కొంత తెలుసు కాబోలు. ఏ భావాలు వ్యక్తపరచకుండా చూస్తూ నుంచుంది.

08/04/2017 - 23:23

‘‘నాకు బాధ, కోపం లేవని చెప్తే నువ్వు నమ్ముతావా?’’
‘‘నమ్మవు కదా! అది నిజమే కదా! నాకూ కోపం వస్తుంది. బాధేస్తుంది. నన్ను నా కోపాన్ని ఎవరిమీద చూపించమన్నావో చెప్పు. ఎవరిని అడగమన్నావో చెప్పు. సమాధానం ఇవ్వలసిన వ్యక్తి దరిదాపుల్లో లేనప్పుడు ఎవరిని అడగమన్నావు? నన్ను ఎలా సమాధానపడమన్నావు. నువ్వు చెప్పు?’’

08/03/2017 - 22:40

చిత్రం అది వ్యక్తమయ్యే బాధ కాదు. నిర్లిప్తమయిన బాధ.
ఏనాడు ఒకరితో ఏమి అనేవాడుకాదు. అయినా తనకు తెలుసు.

08/02/2017 - 21:24

‘‘ఇంక ఇండియన్ ఫుడ్ తినడం మా వల్ల కాదు’’ అంటూ తేజ చెల్లెళ్ళు డిన్నర్‌కి బయటకు వెడదామన్నారు. వౌళి వాళ్ళందరితో కలిసి పిజ్జా తినటానికి బయటకు వెళ్లారు.
మేం పెద్దవాళ్ళం మాత్రం ఇంట్లో ఉన్నాం. నేను ఆ రోజు సావిత్రిని బాగా ఆపేశాను కేవలం చాలా సింపుల్ భోజనం చేద్దామని.

08/01/2017 - 21:37

వెర్రిగా ఆవిడ వంక చూచాను. ఎంత నిజం? వదిన ఎంత సింపుల్‌గా చెప్పేసిందో. వౌళి మొహంలో రఘు పోలికలు తలుచుకుంటూ కళ్ళు దించుకున్నాను.
కొట్టు అతడు అన్నాడు, ‘‘ఒక పని చేద్దాం. ఆ నగలు నాకివ్వండి. మరోసారి పాలిష్ చేయించి మంచి బాక్స్‌లో పెట్టిఇస్తాను’’ అన్నాడు. వౌనంగా అందించాను. వదిన సంతృప్తిగా చూచింది.

07/30/2017 - 21:34

ఆ ఎంసికి తెలుస్తుందని. అతను అలా అనౌన్స్ చేస్తాడని. అసలు ఈ విషయం మా వెరీ క్లోజ్ వాళ్లకి తప్ప ఎవరికీ తెలియదు’’ అన్నాడు.
ఆయన గొంతు చాలా క్షమార్పణ పూర్వకంగా అంది.
‘‘వౌళికి చిన్నతనం నుంచి, ఎటువంటి కాంటాక్ట్ లేకపోవడంతో డా.రఘురాంతో తనని గుర్తించడం ఇష్టపడడు అన్నాను. వౌళి రియాక్షన్‌కి సంజాయిషీ ఇస్తూ.

07/29/2017 - 22:04

నాకు తేజాలాంటి కూతురు దొరికినందుకు సంతోషంగా ఉంది. వౌళికి, మీ అందరిలాంటి స్నేహితులు, దేశానికి దూరంగా ఇంత పెద్ద కుటుంబం దొరకడం చాలా సంతోషం’’ అన్నాను.
వౌళి, తేజా ఒకసారి లేచి మైక్ ముందు నిలబడ్డారు. ఒక నిమిషం నువ్వు ముందంటే నువ్వు ముందు అని ఆలోచించుకున్నారు.

Pages