S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/27/2016 - 22:48

‘‘నరకపురి రోడ్డు...’’ అరిచాడు కండక్టర్.
బస్సులో లేడీస్ సీట్లోంచి చటుక్కున లేచి నిలబడింది లతిక.
మోకాలు దాటిన క్రీమ్ కలర్ ఫ్రాక్, ఆకుపచ్చ స్టాకింగ్స్, ఎత్తు మడమల జోళ్ళు. భుజానికి ఎయిర్ బ్యాగ్. చేతిలో వానిటీ బ్యాగ్.
కొంత వయసు. కొంత అందం. కొంత ఆధునికత. కొంత మధ్యతరగతి.
లతిక లేవగానే బస్సులో చాలామంది ఆమె వంక చూశారు.

03/27/2016 - 07:53

వారి పగ అంతటితో చల్లారలేదు. పటపట పళ్ళు కొరుకుతూ హుస్సేన్ నిజాం షా రామరాయల దగ్గరిగా వచ్చాడు.

03/25/2016 - 22:18

రామరాయలు నిరంతరం ముసల్మాను ప్రాంతాలనదుముకుంటూ ఉండటంతో బీజాపూర్ ఆదిల్‌షా అతనికి వ్యతిరేకంగా ఓ కూటమి తయారుచేసి రామరాయల అహంకారాన్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న యుద్ధం ఇది.
రాజగురువు సుదర్శనుల వారు ఆఖండజ్యోతిని వెలిగించారు. విద్యారణ్యస్వామి విజయనగర స్థాపకులకు ప్రసాదించిన ఖడ్గాన్ని రామరాయలకు అందజేశారు.

03/24/2016 - 21:38

శ్రీకృష్ణదేవరాయలు బతికి ఉన్నపుడు విజయనగర సామ్రాజ్యం పేరు వింటేనే గజగజలాడే ఆదిల్షా దర్జాగా మంది మార్బలంతో, సైన్యంతో తరలివచ్చాడు. తిమ్మయ్య ఇచ్చిన అపూర్వ స్వాగతం అందుకున్నాడు. సభా మండపానికి ఆదిల్షాను తీసుకెళ్లాడు తిమ్మయ్య. విజయనగర సింహాసనం చూడగానే ఆదిల్షాకు కోరిక పెరిగింది.

03/24/2016 - 02:27

ఇన్నాళ్ళు విజయనగరంతో మిత్రత్వం నటించే పోర్చుగీస్ వాళ్ళు పశ్చిమతీరం నుండి తూర్పు తీరం చేరి శాంథోమ్ దాటి తిరుపతి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఎందరినో క్రైస్తవులుగా మార్చారు. రామరాయలు చేసేది లేక కందవోలుకు వెళ్ళిపోయాడు.
***
తిమ్మయ్య పిలుపుమేరకు అతని సమావేశ మందిరానికి చంద్రప్ప వచ్చాడు.
‘‘నీవేనా తిమ్మరుసుకు వేగుసాయం చేసిన పాటగాడివి?’’ వ్యంగ్యంగా అడిగాడు.

03/22/2016 - 21:36

‘‘అయితే మీరిక నాతో మాట్లాడేదేం లేదు’’ అచ్యుతరాయలు రామరాయలు మొహం మీదే అనేశాడు.
రామరాయలు తీవ్రంగా ఆలోచిస్తూ వెనుదిరిగాడు. హఠాత్తుగా అతనికి శ్రీకృష్ణదేవరాయల మరణశాసనం గుర్తొచ్చింది.
‘‘అవును అలా చేస్తేనే ఈ విజయనగర సామ్రాజ్యం మరికొన్నాళ్ళు నిలుస్తుంది...రేపే తాత ఇంట పెరుగుతున్న అసలు వారసుడు సదాశివరాయలకు కబురుచేస్తాను’’.

03/20/2016 - 22:09

దానిని అణిచేసి గోవిందరాయలును కారాగారంలో బంధించాము’’.
సేనానాయకుని మాటలకు మహారాణి మొహం వివర్ణమైంది.
‘‘రామలింగనాయకా! ప్రభువుకీ వివరాలు తెలిపే సమయం ఇదికాదు. మంత్రిగారితో చర్చించి నిర్ణయాలు తీసుకొండి. మీరిక వెళ్ళవచ్చు’’ మహారాణి ఆజ్ఞను అనుసరించి వాళ్ళు తిరుగుమొహం అయ్యారు. రాజదర్శనం కాకపోవటం వల్ల నిరుత్సాహంగా ఉంది. సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకున్నాడు అలసటగా.

03/19/2016 - 21:50

‘‘మంజూ! మనకింక ఎడబాటు ఉండదు. మధురమైన జీవితంలో కష్టసుఖాలు కలిసి అనుభవించటం మధురంగానే ఉంటుంది సుమా’’
‘‘చంద్రా! నీ కోసం నేను, నా కోసం నువ్వు’’
‘‘అంతేకాదు మంజూ! నా గానం నీ కోసం, నీ నాట్యం...’’
‘‘నీ కోసం...’’ గల గలా నవ్వింది మంజరి. ప్రవహిస్తున్న సెలయేరు ఒకసారి ఆగి ఆమె నవ్వుల్ని విని పరవశించి మళ్లీ ముందుకు సాగిపోయింది.
***

03/18/2016 - 23:32

ఏమిటిది గోవిందా! ఈ తిమ్మరుసు బతికి ఉండగానే విజయనగర ప్రజలు క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారా! రాజ్యమంతా విప్లవిస్తోందా? ఇది నాకు ఆనందాన్ని కల్గిస్తుందనుకుంటున్నావా?’’ తండ్రిని కలవటానికి వచ్చిన గోవింద రాయలతో తిమ్మరుసు ఆవేదనను పంచుకొన్నారు.

03/18/2016 - 01:41

‘‘ఆయన మన మొర ఆలకిస్తాడా! అలా అయితే ఇంత దూరం వస్తుందా?’’ మొదటి వ్యక్తి అన్నాడు.
‘‘ఇందులో ఏదో కుట్ర ఉంది. వేరెవరో ఈ నేరం చేసి తిమ్మరుసుల వారిని బలిపశువును చేశారు. ప్రభువు తొందరపడి పుత్రశోకంతో అమాత్యులను శిక్షిస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఆ కుట్రని ఛేదించాలి. దీనికి మనమంతా పోరాడాలి’’ చంద్రప్ప ఆవేశంగా అన్నాడు.

Pages