S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/12/2016 - 22:10

‘‘లేదు.. స్వర్గంలో పెళ్లిళ్లు నిర్ణయించేది ఎవరా? అని ఆలోచిస్తున్నాను’’ అని నవ్వాడు సామ్రాట్.
ఆమె భ్రుకుటి ముడిపడిందతడి మాటల్తో. ‘‘చూడబోతే మీదీ నాలాంటి సమస్యలానే కనిపిస్తోంది. అవునా?’’ అంది సాహిత్య.
‘‘ఊ.. ఇంచుమించుగా అంతే. కాకపోతే మా సంసారంలో నేను మీరైతే, మా ఆవిడ మీవారు’’ అన్నాడు సామ్రాట్ భావరహితంగా.

11/12/2016 - 07:27

‘‘మనం ఒకరి గురించి మరొకరికి వివరంగా చెప్పుకోకపోయినా మన మధ్య భావసారూప్యత ఉండటంతోపాటు మన నిత్య జీవితంలోని అసంతృప్తులు కూడా మనమిలా కల్సుకుందుకు చాలావరకూ కారణమేమో!’’ అంది సాహిత్య.
‘‘మీ వారూ..’’ అని ఆగిపోయాడు సామ్రాట్.

11/11/2016 - 00:04

వారి ముందు తన చేతిని చాపి ‘‘తీసుకోండి. కాలక్షేపం బఠానీలు.. ఒక్కో పొట్లమూ రెండ్రూపాయలే!’’ అన్నాడా కుర్రాడు.
చేతినైతే వారిద్దరిమధ్యకూ చాపాడు గానీ వాడి చూపులు మాత్రం సామ్రాట్‌పైనే ఉన్నాయి.
ఆ కుర్రవాడి అనుభవంలో అలా పార్కుల్లోనూ, ఇతర విహార స్థలాల్లోనూ అటువంటి సరుకును కొనేందుకు ఆడవాళ్లంతగా ఇష్టపడకపోవడమూ, కొండకచో మగవాళ్లు కొనబోయినా ఆడవాళ్లందుకు అడ్డుపడడమూ చాలాసార్లు జరిగింది.

11/10/2016 - 07:48

భోజనాలయ్యాక అది నిజమో కాదో తెల్సుకుందుకు తన చేతిని గిల్లుకోబోయిన అతణ్ణి వారించి, తన మొహాన్నతడి దగ్గరగా చేర్చి, ‘‘ఇది కల కాదు నిజమే! అనుమానంగా వుంటే నా బుగ్గ గిల్లి చూసుకోండి’’ అంటూ అతడికి మరింత దగ్గరగా జరిగింది సామ్రాజ్ఞి.

11/08/2016 - 21:12

‘‘గుర్తుంచుకో! పిల్లిలా ఉండే మొగాడు ఉన్నట్టుండి పులిలా మారాడంటే పెళ్లాం పట్టు అతడిమీద సడలినట్టే! అలా సడలడానికి కారణం.. సాధారణంగా మరో ఆడదాని సహాచర్యం అతడికి దొరకడమే అయ్యుండే అవకాశాలే ఎక్కువ!’’ తల్లి మాటలు గుర్తుకురాగానే సామ్రాజ్ఞి గుండె ఝల్లుమంది!
ఆఫీస్ టూర్‌మీద పొరుగూరి వెళ్లి నాల్రోజులుండి వచ్చాడు సామ్రాట్. టూర్‌కు వెళ్లకముందు సామ్రాట్ ఇలా లేడు.

11/06/2016 - 21:54

సాహిత్య వంటి వ్యక్తి తనకు స్నేహితురాలిగా దొరికిన తర్వాత కూడా సామ్రాజ్ఞి ప్రవర్తన గురించి బాధపడడంలో అర్థం లేదనిపించిందతడికి.

11/06/2016 - 04:26

పుస్తకాలుంటే చాలు నాకు, ఇంకేమీ అక్కర్లేదు. బజారుకెళ్లి చీరలు, నగలు కొనుక్కోవడంకంటే నాకిష్టమైన పుస్తకం కొనుక్కోవడమే నాకు ఎక్కువ తృప్తినిస్తుంది’’ అందామె సంతోషం నిండిన కళ్లతో.
‘‘మీరేమైనా అనుకోండి సాహిత్యగారూ.. మన మధ్య ఇంత సారూప్యత ఉన్నప్పుడు మన పరిచయాన్ని ఇక్కడితో ముగించడం నాకిష్టం లేదు’’ అన్నాడు సామ్రాట్ దృఢంగా.
సాహిత్య ఉలిక్కిపడింది.

11/04/2016 - 21:49

‘‘ఉహూ.. మీ పెదాలనుంచి వచ్చే మాటలకూ, మీ కళ్లు వ్యక్తం చేస్తోన్న భావాలకూ పోలికే లేదు. సూటిగా చెప్పాలంటే నా పేరూ, ఊరూ, వృత్తి, ప్రవృత్తి.. వగైరాలు తెలుసుకుని నాతో పరిచయం పెంపొందించుకోవాలని ఉంది మీకు. కాదంటారా?’’ అందామె సీరియస్‌గా.
తన మనసులోని మాటల్ని అంత స్పష్టంగా చదివిన ఆమె తెలివితేటలకు మనసులో అభినందించినా పైకి ఏం మాట్లాడాలో తెలియక తడబడ్డాడు సామ్రాట్.

11/03/2016 - 21:50

‘‘చూడండీ.. మీతో గొడవ పడ్డానికి నేనీ బస్ ఎక్కలేదు. మాకు కేటాయించిన సీట్లలో కూర్చున్నందుకు సిగ్గుపడడం మానేసి ఎదురు దబయిస్తారేమిటి?’’ అందామె.
‘‘మీకంటే ముందుగా వచ్చి ఈ సీట్లో కూర్చున్నాను. మీరు బస్ బయల్దేరేవేళకు వచ్చి నన్ను లేవమంటే నేను లేచి నిలబడి మీకు ఈ సీటు ధారాదత్తం చేయాలా?’’ అన్నాడతడు ఉక్రోషంగా.

11/03/2016 - 03:18

ఇల్లు శుభ్రంగా ఉంటే మెచ్చుకోవడమే తప్ప తాను ఇంటిని శుభ్రంగా ఉంచే బాధ్యతను చేపట్టడమంటే వల్లీప్రియకు మహాచిరాకని పెళ్లయ్యాక గానీ తెలియలేదు నాకు.
పెళ్లికి ముందు ప్రతిరోజూ సాయంత్రం నాతో పార్కుకో, సినిమాకో, వాకింగ్‌కో వెళ్లడం ఎంతో ఇష్టం వల్లీప్రియకు. పెళ్లయ్యాక నాతో తాను బయటకు సరదాగా వచ్చిన రోజుల్ని వేళ్లమీద లెక్కపెట్టొచ్చిప్పుడు.

Pages