S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

04/27/2017 - 02:56

అన్వర్ మాటలలో ఆనాటి సంఘటన..
..బిజినెస్ పనిమీద హైదరాబాద్ వెళ్లిన ప్రణవ్.. ఆ పని చూసుకు తిరిగి తమ ఊరు విజయవాడ వస్తుండగా, బాగా పొద్దుపోయింది.. అతను ప్రయాణం చేస్తున్న కారు సరిగ్గా వందో మైలురాయి దగ్గరకు రాగానే.. కీచుమన్న శబ్దంతో ఆగిపోయింది.. వెనక సీట్లో కునుకుపాట్లు పడుతున్న ప్రణవ్ ముందుకు తూలి గాబరాగా చూసాడు డ్రైవర్ అన్వర్‌కేసి...

04/26/2017 - 01:23

ఇంతవరకూ వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన నాలుగు హత్యలూ, ఐపిఎస్ ట్రైనీ ఆఫీసర్స్ అమర్, ఇంద్రజిత్ హత్యలూ, వారం రోజుల క్రిందట హైదరాబాద్ తాజ్ హోటల్‌పైనుంచి జారిపడి మరణించిన కమల్ అనే క్రైం రిపోర్టర్ మరణం, అతనితో మాట్లాడి రాత్రి అక్కడనుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదంవలన మరణించిన మహేష్ మరణం, ప్రమాదవశాత్తు జరిగినవిగా నిర్థారించి కేసు క్లోజ్ చేసినప్పటికీ, ఆ రెండూ కూడా ఒక పథకం ప్రకారం, కోల్డ్ బ్లడెడ్

04/24/2017 - 03:32

నిజంగా ఆ పిక్చరైజేషన్.. వాహ్.. నిజంగా యుద్ధ సన్నివేశాన్ని తలపింపజేస్తోంది. కొంతమంది సైనికులు అవతలి దేశం వాళ్లకి బందీలుగా చిక్కారు. వాళ్ళని తాళ్ళతో కట్టి తాము ఎక్కిన గుర్రాలకి కట్టి ఆ రణభూమిలో రుూడ్చుకుపోతున్న దృశ్యం, నిజంగా వళ్ళు గగుర్పొడిచింది రాహుల్‌కి.. తనకు తెలియకుండానే ఆ సినిమాలో లీనం అయిపోయాడు..

04/23/2017 - 21:22

దాంతో పై ప్రాణాలు పైకే పోయాయి ఆ యిద్దరికీ..
‘‘సార్ నిజంగానే వాడెవరో నాకు తెలియదు.. వాడిని నే చూడలేదు కానీ, అలా చెయ్యమని నాకు ఎవరో ఫోన్ చేశారు...
‘‘అహా.. ఎవరో ఫోన్ చేస్తే పంపించావ్, ఫోన్ చేసినవాడెవడో తెలియదు, ఆ వచ్చినవాడెవడో తెలియదు.. మరి నీ పదివేలూ ఎలా వచ్చాయ్.. ఎగురుకుంటూ వచ్చాయా..’’

04/21/2017 - 21:25

అయినా అవన్నీ రొటీన్‌గా జరిగేవే...దానికీ అతనెవరో మేడమీంచి పడి చనిపోవడానికి సంబంధం ఏమిటి.. పోలీసులు వచ్చి అన్నీ చూసుకుని అతను నిద్రమత్తులో ప్రమాదవశాత్తు పడి మరణించాడు అని రాసుకు వెళ్లిపోయారుగా, మళ్లీ మీరేంటి.. ఏదైనా అడగాలంటే హోటల్ యాజమాన్యాన్ని అడగండి’’ లేచాడు వెళ్లడానికి అన్నట్టు.

04/20/2017 - 21:17

‘‘చెప్పే విషయం కాస్త నమ్మతగ్గదిగా ఉండాలోయ్, బాల్కనీలోంచి పొరపాటున జారిపడటం అనేది అంత నమ్మదగ్గ విషయంలా లేదు.. అయితే ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఎవరైనా వెనకనుంచి తోసెయ్యాలి లేదా జీవితంవీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలి. బాల్కనీలోకి ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటావా.. ఐ మీన్, బయటినుంచి, అంటే పైనుంచో, పక్కనుంచో..

04/20/2017 - 01:56

రాహుల్ దగ్గర నుంచి బయలుదేరిన అనే్వష్‌కి ఒకసారి లాయర్ భగవాన్ గారిని కలిసి తాము వెడుతున్న సంగతి చెప్పాలన్న ఆలోచన కలిగి అటు వెళ్ళేడు.
‘‘నమస్తే సార్’’ అన్న అనే్వష్ పిలుపుతో ఏదో ఫైల్ చూసుకుంటున్న ఆయన తలెత్తి చూసాడు.
‘‘ఆ రావోయ్ అనే్వష్.. ఏమిటీ వారం రోజులుగా అజాపజా లేవు, మీ ట్రైనింగ్ అయిపోయిందా, పోస్టింగ్స్ ఎక్కడా’’ అంటూ పలకరించేడు.

04/19/2017 - 00:22

లేదంటే ఇంద్రజిత్‌ని వాడుకునే అవసరం, అవకాశం బయట వాళ్లకెవరికి ఉంటుంది.. అయినా ఇంతమంది ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుడిని, అందులోనూ నా ప్రాణానికి ప్రాణమైన కమల్‌ని చంపిన వాడిని నే ఊరికే వదిలే ప్రసక్తే లేదు.. ఎంత కష్టమైనా నేను ఈ చిక్కుముడి విప్పే తీరతాను.. ఈ మిస్టీరియస్ సీరియల్ కిల్లింగ్స్ మిస్టరీ ఛేదించి తీరుతాను’’ ఆవేశంగా అన్నాడు రాహుల్.
‘‘కానీ ఎలా..’’ ఆవేదనగా అన్నాడు అనే్వష్.

04/16/2017 - 23:21

‘‘మరి చావుకి కారణం ఏంటి? వొంట్లో మద్యం లేదు, డ్రగ్స్ లేవు, చుట్టుప్రక్కల వేరే వ్యక్తి కూడా లేడు. అప్పటిదాకా బాగానే ఉన్నారు. మరి ఎలా జరిగి ఉంటుంది అంటావ్? ఏమన్నా దొరికితే కదా దర్యాప్తు చెయ్యడానికి?’’
‘‘ఇప్పుడు మన ముందు రెండు కేసులు ఉన్నాయి. ఒకటి అమర్‌ది, రెండు కమల్, మహేష్ మర్డర్స్’’ అనే్వష్ అన్నాడు.
‘‘ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఇవి హత్యలే అయితే ఒకటే కేసు రెండు కాదు’’.

04/15/2017 - 21:20

అక్కడ అంతా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా ఎలా బయటకొచ్చిందో ఓ చిరుత పిల్ల బోనులోంచి బయటకొచ్చింది.. ఆమె మీద పడబోతే అక్కడే వున్న నేను చేతికి ఏదీ అందక దాన్ని కాలితో తనే్నను.. అప్పుడది అమాంతం నా కాలు పట్టుకుని కసక్కున కొరికేసింది.. సగం పాదం దాని నోటిలో ఉండిపోయింది.. తమాషా ఏమిటంటే దాని బారిన పడి కాలు పోగొట్టుకున్నది నేనయితే..

Pages