S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

04/14/2017 - 22:51

సరే నేను ఎప్పుడు రాను, యిప్పుడు మీతో రానా.. లేకపోతే తరువాత రానా..’’
‘‘ఎప్పుడో ఎందుకు రేపు నాతో రండి.. ఫ్లైట్‌లో వెళ్లిపోదాం.. ఈ కేసు ఎంత త్వరగా తేలితే అంత మంచిది..’’

04/13/2017 - 21:23

అందరివీ పూర్తిపేర్లు తెలిస్తే బహుశా హంతకుడు దొరికిపోవచ్చు.. ఏది ఏమైనా అసలు మిస్టరీ అక్కడే, ఆ ట్రైనింగ్ సెంటర్‌లోనే ఉందనే నా నమ్మకం.. సో నెక్స్ట్.. విక్టిం బహుశా ఈ మహేష్ కావచ్చు.. లేదా ఆ రోజు.. ఆ గ్రూప్‌లో వున్న వేరెవరైనా కావచ్చు.. ఎవరికి మూడి విహారయాత్రకి ఏ హిల్ స్టేషన్‌కో వెడితే... వాళ్ళు.. అలా ఆగితే మరో హత్య జరిగే వరకూ తెలియదు.. జరిగినా నిరూపించడం కష్టం.. సో నిరూపించాలి అంటే..

04/13/2017 - 06:25

ఇంట్లో తెలియకుండా అతని వెనకే తిరిగేవాళ్లం. హోటల్స్, సినిమాలు, అప్పుడప్పుడు మందు పార్టీలు, ఇంచుమించు మా అందరి సరదా ఖర్చులూ అతనే పెట్టేవాడు.. అందుకేనేమో.. మాకు అతనితో స్నేహం వదులుకోలేని వ్యసనం అయింది..’’ చెబుతూ చెబుతూ ఆగాడు, బహుశా ఆ రోజులు గుర్తుచేసుకునేందుకేమో అన్నట్లు.

04/11/2017 - 21:34

సుమారు పదిహేడు, పద్దెనిమిది ఏళ్ల కింద మాట.. యిపుడు యిలా.. ఛ! అయి ఉంటుందా.. కొంపదీసి ఏనాటి కేసో తిరగతోడడానికి కాదు కదా ఈ ఎంక్వయిరీ? కానీ రోహిత్ హత్యకి గురయ్యాడు, కారణాలు మాత్రం ఎంత వెదికినా దొరకక.. మిస్టీరియస్ చావు కింద కేసు క్లోజ్ చేశారని తెలిసింది.. యిపుడు యితని మాటల వలన ఆదిత్య, ప్రణవ్, భార్గవ్‌లు కూడా అతని కళ్ళలో మరణ భయం స్పష్టంగా కనిపించింది.. కానీ..

04/09/2017 - 21:10

రాత్రి ఎనిమిది గంటలకు కమల్ రూంకి వస్తానని చెప్పినపుడు.. తను వెయిట్ చేస్తుంటానని, డిన్నర్‌కి అక్కడికే రమ్మనీ.. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెబుతాడు. తప్పకుండా వస్తానని మహేష్ మాట ఇచ్చాడు.

04/08/2017 - 21:05

‘‘ఓకె.. ఫ్రెండ్స్.. ఐ థింక్ వియ్ విల్ క్రేక్ ద నట్.. బీ కేర్‌ఫుల్.. అరుణ్ జల్దీ పూర్తిగా రికవర్ కా.. మరి వెళ్ళొస్తా.. బై రాహుల్..’’ కమల్ వెళ్లిపోయాడు.
తరువాత ఒక్కొక్కరుగా వాళ్ళు ముగ్గురూ బస్‌స్టాండ్ దగ్గర కలసి.. ట్రైనింగ్ సెంటర్‌కి ఉదయం ఐదు గంటలకల్లా చేరిపోయారు.
***

04/08/2017 - 05:51

‘‘మై ఫుట్... అంతే అయి ఉంటుంది..’’ అజిత్ ఆవేశంగా అన్నాడు.
‘‘అందుకే మీరు అప్పుడు అక్కడ తీసుకున్న ఫొటోస్ ఏమైనా ఉంటే.. ఓసారి చూస్తే బెటర్ ఏమో.. ఉన్నాయా..?’’ కమల్ అడిగాడు.
‘‘నా సెల్‌లో ఉన్నాయి.. అజిత్ గబగబా జేబులోంచి సెల్ తీసి ఫొటోస్ ఆన్ చేసి చూడడం మొదలుపెట్టాడు.. ఉహూ నథింగ్ స్పెషల్..’’
‘‘అలా కాదు చూడటం.. అవి నా లాప్‌టాప్‌లోకి పంపిస్తావా?’’ కమల్ అడిగాడు.
‘‘షూర్’’

04/07/2017 - 06:19

‘‘అనే్వష్.. యిది అమర్ హత్యతో మొదలవలేదు.. మొదట ఆదిత్య కులూమనాలిలో కుటుంబంతో సహా దసరాలలో వెళ్లినపుడు.. అతనిని గుర్తుతెలియని వ్యక్తులు అతని కాటేజ్ దగ్గరలోనే చంపి పడేసి పోయారు. కూడా వున్న భార్యాపిల్లలకి కూడా తెలియకుండా, అక్కడ కూడా ఏ ఆధారం దొరక్క, చివరికి ఒక మిస్టీరియస్ హత్యగా నమోదు చేసి కేస్ క్లోజ్ చేసేశారు. తరువాత భార్గవ్. అతను ఎంఎల్‌ఏగా గెలిచి ఆ సందర్భంగా తిరుపతి దర్శనానికి వెళ్లినపుడు..

04/06/2017 - 05:07

అది నిరూపించుకోగలరా.. హత్య జరిగిన ఆ రోజు.. ఆ రాత్రి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి.. దానికి కోర్టువారు అంగీకరించే సరైన ఋజువులు కావాలి.. చెప్పండి...

04/04/2017 - 21:09

అంతేకాదు ఆ నేరం చాలా తెలివిగా తన ఆజన్మ శత్రువైన అజిత్.. సవతి తమ్ముడిపైన ఉన్న కసితో అతని వస్తువులు.. అదే హత్యాస్థలంలో పోలీసులకి దొరికిన అజిత్ సెల్‌ఫోన్.. తరువాత ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెళ్లిన మాకు.. అంటే నాకు అజిత్ మిత్రుడు, సహోద్యోగుడు అయిన అనే్వష్‌లకు దొరికిన అతని స్వెట్టర్..

Pages