S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/23/2017 - 05:32

‘‘మెలికలు తిరిగింది చాలు. నీ వాలకం చూస్తూంటే.. ఏదో తేడాగా కనబడుతోంది.. ఇంతకీ ఎవరా అమ్మాయి..’’ సీరియస్‌గా అడిగాడు అజిత్.
‘‘మన.. మన క్లాస్‌లో ‘మహిమ’ కొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు..’’’

03/21/2017 - 21:04

ఈసురోమని రూం కొచ్చి పడ్డారు యిద్దరూ.. ఎంతలో ఎంత మార్పు.. నిన్నమొన్నదాకా నలుగురి నవ్వులతో, కబుర్లతో హోరెత్తిన ఆ గది ఇప్పుడు బావురుమంటోంది.. దిగాలుగా కూర్చుండిపోయారు.. అంతలో ఏదో గుర్తొచ్చి.. అనే్వష్ లేచి అజిత్ అలమరా వెదికాడు.. అక్కడ అతనికి ప్రియ ఇచ్చిన స్వెట్టర్ లేదు. ఏదో జరిగింది.. తమకి తెలియకుండానే.. తమ వెనకాల ఏదో కుట్ర.. ఎవరు చేశారు?

03/19/2017 - 23:13

ముద్దాయి స్వహస్తాలతో రాసిన ఆ చీటీలు.. ముద్దాయి ప్లాన్ ప్రకారం హతుడిని ఆ రాత్రి, ఉద్దేశపూర్వకంగా.. అడవిలోకి తీసుకెళ్లి మట్టుపెట్టాలన్న ప్లాన్‌తోనే.. లాటరీలో వేరే ఎవరి పేరు రాకుండా ఉండటం కోసమే.. అన్ని చీటీల్లో అమర్ పేరు మాత్రమే వ్రాసాడు యువరానర్.. నిస్సందేహంగా ఇది ప్లాన్డ్ మర్డర్..

03/19/2017 - 07:20

‘‘అవునూ.. నీకు ప్రియ ప్రెజెంట్ చేసిన స్వెట్టర్ ఎక్కడుంది?’’
‘‘రూమ్‌లోనే నా అల్మారాలో ఉంది.. ఏమిటిరా.. ఈ కేసు విషయం మానేసి ఏదేదో అడుగుతావ్? రేపు కోర్టు బోనులో నిలబడాలంటే ఏదోలా ఉందిరా.. దోషుల్ని పట్టుకోవాల్సిన నేను.. యిలా దోషిలా నిలబడాలంటే చచ్చిపోవాలనుంది..’’ విరక్తిగా అన్నాడు.

03/17/2017 - 21:19

అంటే ఆ వ్యక్తికి ఒక కాలు కొంచెం అవుడు అయి ఉండాలి.. లేదా ఒక పాదం కాస్త చిన్నది ఒకటి పెద్దది అయి ఉండాలి.. అంతేకాదు వర్షంలో సపోర్ట్‌కోసం అతను చేతి కర్ర వాడిన ఈ గుర్తు చూడండి.. ప్రతి అడుగు గుర్తుకీ కొంత దూరంగా ఒక కర్ర భూమిలో దిగబడిన గుర్తు.. దారి పొడుగునా..’’ గట్టిగా అరిచాడు ఎమోషనల్‌గా.

03/16/2017 - 21:07

‘‘చూడు మిస్టర్.. డాక్టర్ల దగ్గరా లాయర్ల దగ్గరా ఏ విషయం దాచకూడదు.. అది ఎంత చిన్న విషయమైనా.. ఎలాంటి విషయమైనా.. చెప్పు.. ఏదీ దాచకుండా చెబితేనే నేనేమైనా చేయగలిగేది..’’ అసహనంగా అన్నాడు భగవాన్...
‘‘వాడికి పెళ్లి నిశ్చయమైపోయింది.. వాళ్ల చుట్టాలమ్మాయే.. చిన్నప్పుడే అనుకున్న సంబంధం.. ఒకసారి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చేడు కూడా...’’

03/15/2017 - 21:55

‘‘సార్.. మాకూ అదే అర్థం కావడంలేదు.. ఎక్కడికి వెళ్లాడో.. ఫోన్‌కి కూడా దొరకడంలేదు.. మాకూ చాలా కంగారుగా ఉంది..’’ అనే్వష్ అన్నాడు.
‘‘అదేమిటి.. మొన్న రాత్రి మీరంతా కలిసే వెళ్లారుగా..’’

03/14/2017 - 21:16

‘‘నాకేం భయం లేదు.. అయినా రాత్రిపూట తిరగలేకపోవడానికి నేనేమైనా అమ్మాయినా.. హాయిగా దొరికిన సెలవు సద్వినియోగం చేసుకు పడుకోక అర్థరాత్రి ఈ విన్యాసాలెందుకు..’’ నవ్వుతూ కొట్టిపారేశాడు అమర్.
‘‘అరె బాబూ.. భయాన్ని కవర్ చెయ్యడానికి ట్రై చెయ్యకు.. నువ్వు వెళ్లాల్సిందే..’’
‘‘చత్.. నాకేం భయం...సరే మీ సరదా నేనెందుకు కాదనాలి, అలాగే వెళదాం.. ’’ ఒప్పుకున్నాడు అమర్.

03/12/2017 - 21:23

అదిరిపడుతున్న మనసును అదుపు చేసుకుంటూ వడివడిగా నడిచాడు.. సన్నగా మొదలైన వాన మెల్లి మెల్లిగా జోరందుకుంటూంది, చుట్టూ చిమ్మ చీకటి.. ఈ అనే్వష్‌కి బుద్ధి లేదు.. ఎప్పుడు చూసినా అడ్వెంచర్ పేరుతో ఏదో ఒక వెధవ పనిచేస్తుంటాడు. అయినా బుద్ధిలేనిది వాడికి కాదు.. వాడు రమ్మనగానే తగుదునమ్మా అని అర్ధరాత్రి బయలుదేరిన తనది.. చలితో.. భయంతో సన్నగా వణుకు బయలుదేరింది.

03/11/2017 - 21:47

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
స్వార్థపరులు అమాయకులను బలి తీసుకుంటున్నారు.
సందీప్! భారుూజాన్ చనిపోయాక నీవు మా ఇంటికి వచ్చినపుడు నీ ముఖంలో సూర్యకిరణాలను చూసాను. అప్పుడు నా మనస్సు నిన్ను హంతకుడని ఒప్పుకోలేదు. అసలు ఇటువంటి పవిత్రమైన ఆత్మ, ఇతరుల సుఖ సంతోషాల కోసం ఇంతగా త్యాగం చేసే ఆత్మ హంతకురాలు కాదు, కానే కాదు. ససేమిరా కాదు. నా అంతఃకరణ పదే పదే ఇదే చెబుతోంది.

Pages