S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

02/03/2016 - 21:26

‘ప్రభువు తనకు దూరమవుతాడా’ ఆలోచనకే ఆమె హృదయ వేదన మిక్కుటమయింది. అన్నింటికీ ఆ విరూపాక్షుడే సాక్షి అనుకున్నది. మంజరి ఎపుడు వచ్చిందో చిన్నాదేవి భుజంమీద చేయి వేసి పిలిచేదాకా తెలీలేదు.
‘‘చిన్నాజీ! నేనంతా విన్నాను. నీ నిర్ణయంలో ఎంత త్యాగముందో రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి’’.
‘‘ఏమో! నా ప్రభువు లేని జీవితం మాత్రం నేనూహించలేను’’ చిన్నాదేవి మంజరిని కౌగిలించుకుని రోదించింది.

01/31/2016 - 22:57

తన రాయలు ప్రభువైనాడు గదా! తననింక గుర్తుంచుకుంటాడా! మనసు నిండా సంతాప మేఘాలు కమ్ముకుంటున్నాయి. తనవల్ల రాయల కీర్తికి ఎటువంటి మచ్చ రాకూడదు. పట్టమహిషి పదవిమీద కూడా ఆమెకి ఆశలేదు. రాయలే ఆమెకి సర్వస్వం. ఆమె అతనికి ప్రియురాలు, భార్య, అర్థాంగి, రాణి కూడా. మంజరి ముద్ర పట్టి ‘కృష్ణనృత్యం’ చేస్తున్నది.

01/30/2016 - 22:13

‘‘నా బొందిలో ప్రాణం వున్నంతవరకు నేను నిన్ను వదులుకోలేను మంజూ! మనది జన్మజన్మల బంధం’’ ఆమెను కౌగిట చేర్చుకున్నాడు చంద్రప్ప.
మంజరి అతన్ని వదలలేక వదలలేక వెళ్లింది.

01/29/2016 - 23:08

చిన్నాదేవికి నిద్రపట్టడంలేదు. కళ్ళు మూసినా, తెరిచినా ప్రభువు సుందర రూపమే మెదులుతోంది. కదిలితే తల్లికి నిద్రాభంగం అవుతుందని అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది.

01/29/2016 - 05:14

‘‘అమృతా! అటు చూడు! అక్కడ రాయలవారి అంతఃపురం వుండేది. దాని చుట్టూ ఇది విశిష్టమైన మహానగరంగా నిర్మితమైంది. సుమారు ఏడు మైళ్ళ చుట్టుకొలత కలిగి బలిష్ఠంగా యాభై అడుగుల ఎత్తు పది అడుగుల వెడల్పు గల ప్రాకారం ఉండేది. దీని ప్రధాన ద్వారాన్ని ఇరవై వేల మంది అశ్వికులు రాత్రింబవళ్ళు కాపలా కాసేవారు.
‘‘అభీ! కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం అని ప్రసిద్ధి కెక్కింది గదా!’’

01/28/2016 - 03:56

అమృతకి కృష్ణశాస్ర్తీగారి పాట గుర్తొచ్చింది.
‘‘రాల లోపల పూలు పూచిన
రామ మందిర లీల
ఆరామ సుందర హేల
రాలలో హదృయాలు మ్రోగిన రాచకేళీశాల
ఆరామమందిర లీల
నిన్నటిదా మరి మొన్నటిదా ఆది
ఎన్ని జన్మల గాధ!’’

01/27/2016 - 20:52

‘‘అలా అనకు అమ్మూ! మనతో వచ్చేది డ్రైవర్ కం గైడ్. నేను ఆర్కియాలజీ విద్యార్థినే! అయినా మనం చదువుకోని ఎన్నో విషయాలు స్థానికులకు తెలుస్తాయి...’’ నవ్వాడు.
‘‘వాటి ఆధారాలుంటాయా?’’ అనుమానంగా అడిగింది.
‘‘ఉండకపోవచ్చు.. కానీ జనశ్రుతిలో పుట్టిన కథలుండొచ్చు...’’

01/23/2016 - 20:41

‘‘అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా!!..’’
ఘంటసాల గళంలోంచి ఉత్తేజకరంగా అద్భుతగీతం ఆడియో మంద్ర స్థాయిలో విన్పిస్తోంది.

01/22/2016 - 20:35

అంతేగాని, ఈళ్ళకాడ నేను డబ్బులూ తీసుకోవడమేంది! నా భార్యను ఇక్కడ వుంచి పోవడమేంది!? అసలు నా భార్యను ఏం జేశారో? యాడదాశారో? చెప్పమని నేనొస్తే మీరంతా కలిసి ఉల్టా నామీదనే నేరం మోపి నన్ను ఎర్రోన్ని జెయ్యాలని చూస్తున్నారా?’’ అంటూ ధైర్యంగా బదులిచ్చాడు ఎల్లయ్య. అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తూ నిల్చున్న కానిస్టేబుల్స్ ‘‘పాపం! ఈ ఊరోడెవడోగాని వీడి కర్మకాలి ఇయ్యాల వీళ్ళ పాలబడ్డాడు.

01/20/2016 - 22:48

‘‘మీ ప్రయత్నంలో ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా సమానంగా స్వీకరించండి. అదే నా రిక్వెస్ట్’’ అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన డాక్టర్ ఎందుకో ఒక్కసారిగా గంభీరంగా మారిపోతూ అన్నారు.

Pages