S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

01/10/2019 - 19:57

సీ॥ అతిశయంగబుగ కల్లలాడ నేర్చితి గాని
సాటిగా సత్యముల్ పలికి యెఱుగ
సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితి గాని
ఇష్టమొందగ నిర్వహింప నేర
ఒకరి సొమ్ము కు దొసిలొగ్గ నేర్చితి గాని
చెలువుగా ధర్మంబు సేయ నేర
ధనము లియ్యంగ వ-ద్దనగ నేర్చితి గాని
శీఘ్రమిచ్చెడు నట్లు చెప్పనేర
తే॥ పంకజాతాక్ష ! నేనెంత పాతకుఁడను

01/09/2019 - 19:46

సీ. నీమీద కీర్తనల్ నిత్యగానము సేసె
రమ్యమొందింప నారదుఁడఁగాను
సావధానముగ నీ చరణ పంకజ సేవ
సలిపి మెప్పింపంగ శబరిఁగాను
బాల్యమప్పటి నుండి భక్తి నీయందున
గలుగఁగ ప్రహ్లాద ఘనుఁడఁగాను
ఘనముగా నీమీఁద గ్రంథముల్ గల్పించి
వినుతి సేయును వ్యాసమునిని గాను
తే॥ సాధుఁడను, మూర్‌కమతి మనుష్యాధముఁడను
హీనుఁడను సుమ్మి నీవు ననే్నలు కొనుము

01/09/2019 - 19:44

చం॥ సరియగు బాటలోన మనసారగ సాగగఁ బూని భూమిలో
మురియుచు సేవఁ జేయగను మోదమునందుచు నీకుమ్రొక్కరే?
యరయగ మారుదేవునిగ హారతులందెదవే ఘనంబుగా
విరియును నీదు కీర్తి పదివేలకుఁ బైబడి వత్సరమ్ములన్ !

01/08/2019 - 19:57

సీ. ఇభరాజ వరద ! నినె్నంత పిల్చినఁగాని
మారుపల్కవదేమి- వౌనితనము
మునిజనార్చిత! నిన్ను మ్రొక్కి వేడినఁ గాని
కనులఁబడవదేమి గడుసుఁ దనము?
చాల దైన్యము నొంది చాటు చొచ్చిన ఁగాని
భాగ్యమియ్యవదేమి ప్రౌఢితనము
స్థిరముగా నీ పాద సేవఁ జేసెదనన్న
దొరకఁ జాలవదేమి -్ధర్తతనము
తే: మోక్షదాయక! ఇటువంటి మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు

01/07/2019 - 20:05

సీ తల్లిదండ్రులు భార్య - తనయులాప్తులు బావ
మఱఁదులన్నలు మేనమామనగారు,
ఘనముగా బంధువుల్ -గల్గినప్పటికైన
దాను దర్లగ వెంటఁ దగిలిరారు
యముని దూతలు ప్రాణమపహరించుకపోవ
మమతతోఁబోరాడి మాన్పలేరు
బలగ మందఱు దుఃఖపడుట మాత్రమె కాని
యించుక నాయుష్య మియ్యలేరు
తే చుట్టములమీది భ్రమదీసి చూరఁబెట్టి
సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు

01/04/2019 - 20:04

సీ నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము-కన్నతల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్
నీ కటాక్షము మా కనేక ధనము
నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు నిత్యసుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య
నీ పదధ్యానంబు నిత్యజపము
తే తోయజాతాక్ష! నీ పాద తులసిదళము
భోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత!

01/03/2019 - 19:48

సీ నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము-కన్నతల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్
నీ కటాక్షము మా కనేక ధనము
నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు నిత్యసుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య
నీ పదధ్యానంబు నిత్యజపము
తే తోయజాతాక్ష! నీ పాద తులసిదళము
భోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత!

01/02/2019 - 19:48

సీ తనువులో ప్రాణముల్ -తరలిపోయెడి వేళ
నీ స్వరూపమును ధ్యా నింపవచ్చు
నిమిష మాత్రములోన నిన్నుఁజేరునుగాని
యముని చేతికిఁజిక్కి శ్రమలఁబడడు
పరమ సంతోషాన - భజన చేసెడివారి
పుణ్యమేమనవచ్చు-్భగిశనయ!
మోక్షము నీదాస- ముఖ్యుల కుఁగాని
నరక మెక్కడిదయ్య - నళిననేత్ర
తే కమలనాభ!నీ మహిమను గానలేని
తుచ్ఛులకు ముక్తి దొరుకుట దుర్లభంబు

01/01/2019 - 18:40

సీ. లోకమందెవఁడైన లోభి మానవుఁడున్న
భిక్షమర్థికి ఁజేతఁ బెట్టఁ లేడు
తాను బెట్టక యున్న దగవు పుట్టదు గాని
యొరులుపెట్టఁగఁ జూచి యోర్వలేఁడు
దాత దగ్గఱఁ జేరి తనముల్లె చెడునట్లు
చిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలుసంతసంబంధి
మేలు గల్గినఁ జాల మిడుకుచుండు
తే. శ్రీరమానాథ! యిటువంటి క్రూరునకును
భిక్షుకుల శత్రునని పేరు పెట్టవచ్చు

01/01/2019 - 03:59

సీ. తల్లిగర్భబునుండి ధనము తేఁడెవ్వఁడు
వెళ్ళిపోయెడి నాడు - వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుఁగుబంగారంబు మ్రింగబోఁడు
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటెగాని
కూడఁబెట్టిన సొమ్ము కుడువఁబోడు
పొందుగా మఱుగైన భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తే. తుదకు దొంగలకిత్తురో దొరలకవునొ
తెనె జంటీగలియ్యవా - తెరువరులకు!

Pages