S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

06/02/2016 - 04:56

శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదవెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులయు గరికర శీతల చ్ఛాయదచ్ఛీకరాంబు
కణముల చల్లనిగా డ్వాసపడి దాని జెంది సుఖం బున్న సింహములయు
భూసురప్రవరులు భూతబలుల్ తెచ్చి పెట్టు నీవారాలన్న పెండతతులు
గడంగి భక్షింప నొక్కట గలపియాడు చున్న
యెలకులు బిల్లుల యొండులయు సహజ
వైరివర్గంబులయు సహవాస మపుడు
సూచి ముని శక్తి కెంతయు జోద్యమంది

05/31/2016 - 22:27

చని చని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమల తాతతులం
బెసఁగిన మ్రాకుల కొమ్మల మీఁద నపేతలతాంతము లైనను బా
యని మధు పప్రకరంబులఁ జూచి జనాధిపుఁ డంత నెఱింగె ఁ దపో
వన బుది యల్లదె దివ్యము నీంద్రు నివాసము దానగు నించు నెదన్

05/30/2016 - 07:12

మానిని
ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల, జొంపములం
బూచిన మంచియ శోకములన్ సురపొన్నలఁ బొన్నల గేదఁగులం
గాచి బెడంగుగఁ బండిన యాస హకారములం గదళీ తతులం
జూచుచు వీనుల కింపెసఁగన్ వినుచున్ శుక కోకిల సుస్వరముల్

05/28/2016 - 22:52

క. కాఱడవిఁ బఱచు మృగముల
నూఱడకం దిగిచి డస్సి యున్నతని శ్రమం
బాఱఁగ నెడఁ బరితాపము
దీఱఁగ ఁ బైవీచె నన్న దీపవనంబుల్

05/27/2016 - 22:32

చ. అతిరుచిరాగతుం డయిన యాతనికిన్ హృదయప్రమోద మా
తతముగ నవ్యనంబున లతాలలనల్ మృదులానిలావన
ర్జిత కుసుమాక్షతావళులు సేసలు వెట్టినయట్లైరైరి సం
పత దళ నీ నినాద మృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్

05/26/2016 - 21:48

అమరపతి ఖాండవమునకు
రమణను వైశ్రవణు చైత్రరథమునకు సమా
సముగా దీనిని భూభా
గమునను రచియించె నొక్కొ కమలజుఁడు దయన్

05/25/2016 - 22:58

క. ఓసరిలి పఱచు మృగముల
నేసెయు డాసిన మృగముల నెగచి భూజాసిన్
వ్రేసెయుఁ జంపెను మృగయా
వ్యాసక్తి నపార ఘోర వన్యమృగాళిన్

05/24/2016 - 22:02

క. సరభస పరిచరిత మహా
శరభ ద్విపరిపు వరాహ శార్దూల మద
ద్విరదాది ప్రకర భయం
కరవన మధ్యమున నృపతి గడుఁ గడిమి మెయిన్

05/22/2016 - 21:43

క. కలయఁగ నార్పుల బొబ్బల
యులిపున నవ్వి పెన మను మహోదధిఁ బెలుచం
గలఁచెను దుష్యంత మహా
బల మందరనగము సత్త్వ భయజననం బై

05/22/2016 - 00:16

క. అతని రాజ్యంబున ను
ర్వీతలము ప్రజాసమృద్ధి వెలసె రుజశో
కాతంక క్షయ శంకా
పేతం బై ధర్మచరిత ఁ బెరుఁగుచు నుండెన్

Pages