S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

04/20/2016 - 22:14

మ. అవిచారం బని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ నీ యగ్రనం
భవుఁ డత్యున్నతశక్తియుక్తుఁడు మహీభారప్రగల్భుండుభా
ర్గవ దౌహిత్రుఁడు పాత్రుఁడీయఁదుడు లో క ఖ్యాతుఁడుండంగ నీ
భువనేతత్పభరంబుఁ బూన్బఁదగునే పూరున్ జఘన్యాత్మజున్

04/17/2016 - 22:27

ఆ. తగలి జరయు రుజయు దైవ వశంబున
నయ్యెనేని దావాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యారెంటి ఁజే
కొండురయ్య యెట్టి కుమతులైన

04/16/2016 - 22:26

క. తల వడఁక దొడఁగె నింద్రియ
ముల గర్వ మడంగె నంగములు వదలె వళీ
పలితంబు లయ్యె వగరును
దలయేరును నుక్కిసయును దరికొనుదెంచెన్

04/15/2016 - 22:36

క. దానికి భీతుఁడవై య
మ్మారవతీ ప్రార్థనం గ్రమం బొనరఁగ సం
తానము వడసిత నెదలో
దీనికి నలుగంగఁ దగునె దివ్యమునీంద్రా

04/15/2016 - 21:21

క. ఋతుమతియై పుత్రార్థము
పతిఁ గోరిన భార్యయందుఁ బ్రతికూలుండై
ఋతువిఫలత్వము సేసిన
యతనికి మఱి భ్రూణ హత్యయగు నండ్రు బుధుల్

04/14/2016 - 03:44

క. తరుణ ప్రదేశినులు మా
సరముగ వారలు యయాతి శర్మిష్ఠలఁ జూ
పిరి తండ్రియు ఁ దల్లియు నని
కర మనురాగిల్లె ఁ గన్యకాని పహంబున్
భావం: ఆ కుమారులు లలితములైన చూపుడు వేళ్ల దీర్ఘాలు కాగా వీరు మా తండ్రి మా తల్లి అని యయాతి శర్మిష్ఠలను చూపించారు. ఆ దృశ్యం చూచి అక్కడి కన్యకలసముదాయం మిక్కిలి ప్రీతిని పొందారు.
చ. పతివిహితానురాగమున భార్గవుపుత్రి యయాతి చేత సం

04/13/2016 - 05:08

సీ. కరువలి దూలుకపిల జటాలియ కరమొప్పు శిఖలుగాఁ గనక రత్న
మయజాల భూషణమలదేహ దీప్తుల తేజంబుగాఁ బ్రవి దీవ్యమాన
యాగశతంబుల నర్చితం లైన మూఁ డగ్నుల ప్రత్యక్షమైన యట్లు
దనమ్రోల శర్మిష్ఠ తనయులు గ్రీడించు చుండంగ నున్న యయ్వుర్విఱేని
ఆ. కడకు నేఁగుదెంచెఁ గన్యలు దనుజాధి
రాజౌలిలఁ దొడరాఁజ నొప్పె
దేవి దేవయాని దేవేంద్రుని దేవియ
పోలె నెంతయును విభూతి మెఱసె

04/11/2016 - 00:55

తే. బాల వయ్యు నత్యుత్తమ శీలవినయ
గౌరవాన్విత వై నిర్వకాగవృత్తి
నున్న నీ కున్నయునికిన సన్నుతాంగీ
సుతుఁడు పుట్టుట యిదిగడుఁబోద్యమయ్యె

04/10/2016 - 05:51

క. చను బొంకఁగా బ్రాణాత్యయ
మున సర్వధరాపహరణమున నథ గావ
చ్చిన బప్రార్ధమున వధూ
జన సంగమమున వివాహ సమయములందున్

04/08/2016 - 21:46

క. లలితాంగి ! శయన మొక్కడు
వెలిగా రుచిరాన్న పాన వివిధా భరణ
దుల శర్మిష్ఠ కు నిష్టము
సాలయక చేయుమని నన్ను శుక్రుడు వంచెన్

Pages