S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

02/11/2016 - 07:06

క. యాదవ వంశంబున జగ
దాదిజుఁడగు విష్ణుదేవునంశంబున సు
త్వాదిల్లెఁ గృష్ణుడవగత
భేదుఁడు వసుదేవ దేవకీ దేవులకున్

భావం: జగత్తుకు ఆద్యుడైన మహావిష్ణువు అంశంతో శ్రీకృష్ణుడు యాదవవంశంలో దేవకీవసుదేవులకు జన్మించాడు.

క. శ్రీవెలుఁగ రోహిణికి వసు
దేవున కుదయించె విష్ణుదేవాంశమునన్
భూవంద్యుఁడనంతుఁడు బల
దేవుండు ప్రలంబ ముఖ్యదితి జాంతకుఁడై

02/10/2016 - 21:00

క. ఆ విశ్వకర్మ నిర్మిత
దేవవిమానుఁటు నిఖిల దివ్యాభరణ
శ్రీనిరచన పరితోషిత
దేవుఁడు శిల్పప్రజాపతియు నై నగదెన్

02/08/2016 - 00:47

సీ. విగతాఘఁడైన యాభృగునకు ఁ బత్రుడై చ్యవనుండు పుట్టె భార్గవవరుండు
జనవంద్యుఁడతనికి మసుకన్యకకు ఁబుట్టీ నూరుల నౌర్వుండు భూరికీర్తి
యతినికి నూర్వురు సుతులు బుచీకాదు లుదయించి రఖిల భూవిదిత తేజు
లందు బుచీకున కొందంగా జమదగ్ని యనుముని పుట్టె నాతనికి ఁబుట్టె
ఆ రలఘుమతులు సుతులు పలువురు వారిలో
బరశురాముఁడాది పురుషమూర్తి
దండితాహితుండు గొండుక యయ్యను

02/07/2016 - 01:16

సీ. మఱి యంగిరసుఁడను మానసపుత్రున కయ్యుతథ్యుండు బృహస్పతియును
సంవర్తుఁడను గుణాశ్రయ యోగసిద్ధి య న్కూఁతురు బుట్టి రక్కొడుకులందు
విభుఁడు బృహస్పతివేల్పుల కాచార్యుఁడై లోకపూజితుఁడై వెలింగె
మాసుగా నిత్రి య న్మానసపుత్రున కుద్భవించిరి ధర్మయుత చరిత్రు
ఆ. లఖిల వేద వేదులాద్యు లనేకులు
దీప్త రవిసహస్ర తేజు లనఘు
లధిక తరత పోను హత్త్వ సంభృతవిశ్వ

02/05/2016 - 20:29

క . దితి యనుదానికి సప్రతి
హతబలుఁడు హిరణ్య కశిపుఁడన బుట్టె సుతుం
దతనికి నేవురు పుట్టిరి
ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్
భావం: దక్షుడు కశ్యపుడి కిచ్చిన తన కూతుళ్లతో దితి అనే ఆమెకు హిరణ్యకశిపుడనే అవక్రమపరాక్రముడు జన్మించాడు. అతడికి బలపరాక్రమ గుణసంపన్నులైన ప్రహ్లాదుడు మొదలుగా గల అయిదుగురు కుమారులు పుట్టారు.

02/05/2016 - 06:45

క. ఆదిత్య దైత్య దానవు
లాదిగఁగల భూతరాశి దగు సంభవమున్
మేదినిఁ దదంశముల మ
ర్త్యోదయములునాకు ఁ జెప్పు మొగి నేర్పడఁగన్

02/04/2016 - 04:25

క. దితిసుత దానవ యక్ష
ప్రతతుల యంశములఁ బుట్టి ప్రజలకు విహితా
హితుల గుచుండి రనేకులు
జితకాశులు ధరణిపతులుశివుపాలాదుల్

భావం: దైత్య దానవ యక్షుల అంశలతో పెక్కుమంది శిశుపాలాది జయగర్వితులైన రాజులు జన్మించి ప్రజలకు హితులుగాను, అహితులుగాను ఉన్నారు.

02/03/2016 - 21:23

క ‘్భరి ప్రజా నిరంతర
భారము దాల్చు టిది కరము భారము దయతో
మీరీ భారమునకు ఁ బ్రతి
కారము గావించి నన్నుఁ గావుం ’డనినన్

01/31/2016 - 22:50

సీ. పరశురాముండు భీకర నిజకోపాగ్ని నుగ్రుఁడై యిరువది యొక్కమాఱు
ధాత్రీ తలం బపక్షత్త్రంబు సేసిన ఁ దత్‌క్షత్త్రసతులు సంతాన కాంక్ష
వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల దయఁజేసి ధర్మువు దప్పకుండఁ
బడసిరి పలువుర ఁగొడుకులఁ గూఁతుల నిప్పాటఁ దత్ క్షత్త్ర మెసఁగి యుర్వి
ఆ. బర్వి రాజధర్మపద్ధతి ననఘమై
జారచోర దుష్టజనుల బాధఁ
బొరయకుండ నిఖిల భూప్రజాపాలనఁ

01/30/2016 - 22:11

ఉ. సంచిత పుణ్యుఁ డంబరు హసంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితుఁడైన వాఁడు నిఖిలాగమ పుంజము నేర్పడన్ విభా
గించి జగంబులందు వెలిఁగించి సమస్త జగద్ధితంబుగాఁ
బంచమ వేద మై పరఁగు భారత సంహిత ఁ జేసి నున్నతిన్

Pages