S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నమాట

10/08/2016 - 04:33

ఐదేళ్ల కింద ఒక అర్ధరాత్రి-
సి.ఐ.ఎ., అమెరికన్ నేవీ, ఆర్మీల ప్రత్యేక బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో అల్‌ఖైదా రాక్షసుడు బిన్‌లాడెన్ కొంపమీద మెరపు దాడిచేసి, వాడిని చంపి సముద్రంలో పారేశాయి. ఇదిగో ఇలా చేశాం అని అంతా అయ్యాక అమెరికా ప్రెసిడెంటు ప్రకటించాడు. అన్ని పార్టీలు, ప్రతిపక్ష నాయకులు, మొత్తం మీడియా ‘శభాష్’ అన్నాయి.

10/01/2016 - 03:04

చేతకానివాడు ప్రతి అవకాశంలో ఒక సమస్యను చూస్తాడు. చేవగలవాడు ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని చూస్తాడు. నరేంద్ర మోదీ నిస్సందేహంగా చేవగలిగినవాడు. పట్టపగ్గాలు లేకుండా పేట్రేగుతున్న పాక్‌కి కీలెరిగి వాతమీద వాత పెట్టగలిగిన మొనగాడు.

09/24/2016 - 01:40

యుద్ధాన్ని ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. మన దేశంలో మాత్రం న్యూస్ చానెళ్లు ప్రకటిస్తాయి.

09/17/2016 - 04:50

నిజం చెప్పులేసుకునేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందట!
కాశ్మీర్ సమస్యకు, ముఖ్యంగా ఆక్రమిత కాశ్మీర్‌కి సంబంధించినంత వరకూ ఒకటి తక్కువ డెబ్భైఏళ్లు లేటుగా ఇప్పుడిప్పుడే నిజం చెప్పులేసుకున్నది.

09/09/2016 - 01:59

అదే మాట. అదే పాట. అక్షరమ్ముక్క తేడా లేదు. నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక సహాయం గురించి కేంద్ర బిజెపి సర్కారు రెండేళ్లకు పైగా వినిపిస్తున్న రికార్డునే ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మొన్న మళ్లీ వేశారు. విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటిల్లిన కష్టనష్టాలు మహా ప్రభువులకు బాగా తెలుసు. అన్యాయానికి లోనైన ఆంధ్రను అన్ని విధాల ఆదుకోవడానికి వారు కంకణం కట్టుకున్నారు.

06/04/2016 - 04:40

పొట్టిబావ కాంగిరెస్సు
మేజరయ్యేదెప్పుడు?
పెంటకుప్ప పెరిగి మేరు
పర్వతమైనప్పుడు

05/21/2016 - 03:24

పదిహేనేళ్ల కిందటి ముచ్చట.
కేంద్ర హోంమంత్రి కూడా అయిన బిజెపి లోహ పురుషుడు ఎల్.కె.ఆడ్వాణీ గారు ఆకాశమార్గాన అసోం రాజధాని గువాహతికి పెద్ద పనిమీద విచ్చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అసోం గణ పరిషత్ (ఎ.జి.పి.)కీ బి.జె.పి.కీ అలయెన్సు. సీట్ల వాటా ఎవరికెంతో తేలాల్సి ఉంది.

05/14/2016 - 00:53

అధికారం ఉన్నది దుర్వినియోగం చేయడానికి.
ఇది కాంగ్రెసు వారి రాజనీతి. పవరు రుచి మరిగాక భాజపాకూ బాగానే ఒంటబట్టింది.

04/23/2016 - 21:07

we, the people of India... ... hereby adopt, enact and give to ourselves this Constitution.
భారత ప్రజలమైన మేము... ... ఇందుమూలముగా ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, చట్ట ప్రతిపత్తినిచ్చి, మాకు మేము ఇచ్చుకొనుచున్నాము.
-అని ప్రకటిస్తుంది మన రాజ్యాంగం పీఠిక.

04/02/2016 - 05:12

అసలు రహస్యం బయటపడనే లేదు.
ప్రపంచంలోకెల్లా పెద్ద మిస్టరీ ముడి ఇంకా విడనే లేదు.
జాతీయ వీరుడు, యావద్భారతానికి ప్రియతమ నాయకుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి కొత్తగా బయటపడ్డ కొద్ది వివరాలు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.

Pages