S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/01/2018 - 20:45

వర్తమాన కాలంలో సనాతన వాఙ్మయంలో మన శాస్త్రాలలో పురాణేతిహాసాలలో, మరీ ముఖ్యంగా వేదాలలోని శాస్త్ర విజ్ఞానానికి నేటి సమాజం చేరుకోలేని దూరాన్ని చేరిపోయింది. వాటిని అధ్యయనం చేయడం అర్థం చేసుకోవడం చేతకాక, చులకన చేసి మాట్లాడటం, హేళన చేయడం ఒక నాగరికతగా భావించడం విడ్డూరం. కాలధర్మం అనుకున్నా, కాలదోషం అనుకున్నా, యుగయుగాలుగా సంతరించుకున్న, సంపాదించుకున్న భారతీయ విజ్ఞానవీచికలు కనుమరుగైన విషయం సత్యం.

01/31/2018 - 21:18

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందుడిందు బరమేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వడనాదిమధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

01/28/2018 - 21:04

ఆపద్బాంధవుడు అనాధరక్షకుడిగా పిలిస్తే పలికే దైవంగా కలియుగ శ్రీవేంకటేశ్వరునికి త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను భక్తులున్నారనడానికి వేలాది సంవత్సరాల చరిత్ర వున్న జమలాపురంలో వెలసిన స్వయంభూ శ్రీవేంకటేశ్వరుడే నిదర్శనమని చరిత్ర చెపుతోంది.

01/22/2018 - 23:52

అనంతకోటి కిరణుడు- తేజమయుడు- దినకరుడు- వే వెలుగుల జ్యోతిర్మయుడు- త్రైలోక్య చూడామణి- దినమణి- ఆదిత్యుడు- శుభదాయకుడు- లోకరక్షకుడు- భక్త్భాష్ట వరప్రదుడు- మార్తాండుడు, సత్య, ధర్మ దయామూర్తిగా, ఆదిదేవునిగా యుగయుగాలలో ఆరాధింపబడుచున్నాడు సూర్యభగవానుడు. కర్మసాక్షి.

01/14/2018 - 18:52

శ బరిమలై స్వామియే శరణం అయ్యప్ప అన్న నినాదాలతో మారు మ్రోగుతుండగా అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామిని ఆభరణాలతో అలంకరించి, హారతి ఇచ్చే సమయంలోనే, ఆలయానికి ఈశాన్య దిశలో ఉండే పర్వతాలపై మకరజ్యోతి దర్శనమిస్తుంది. స్వయంగా ఆ జ్యోతి దర్శనం చేసుకోవాలని మాలలు ధరించి స్వాములు కోటానుకోట్లమంది జనం శబరిమలైలో వేచి ఉంటారు. అందరూ చేతులెత్తి స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ గొంతెత్తి తన్మయత్వంతో పలుకుతుంటారు.

01/07/2018 - 23:04

‘‘మరకత మహాదేవ రక్ష రక్ష - మరకత శివలింగ రక్ష రక్ష’’ అంటూ ఒక్కసారి పఠించినంత మాత్రాన భోళాశంకరుడు అపార కృపాకటాక్షాన్ని భక్తులపై గుమ్మరిస్తాడు. ఈ స్వామి మరకత మహాదేవ సోమేశ్వరస్వామి! ప్రాతఃకాలంలో సూర్యుని కిరణాలు ఇక్కడి శివలింగంపై పడి అత్యద్భుతంగా మరకత మణులతో ఆవిర్భవించిన లింగంగా మహా శివుడు దర్శన మిస్తాడు.

12/31/2017 - 20:51

మన సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో ఏ పని చేసినా దానికో ప్రత్యేకత - విశిష్టత ఉండడం సహజం. మనం భగవంతుని దర్శించడానికి ఆలయ దర్శనం చేసుకొంటూ ఉంటాం. అన్నింటా తానై ఉన్నప్పటికీ దైవాన్ని మనం ప్రత్యేకమైన ఆలయాల్లో దర్శనమూర్తిగా కొలువై ఉన్నాడని నమ్ముతాం. ఆ ఆలయాలకు వెళ్లి దైవాన్ని దర్శించుకొంటాం. అలా ఆ శుద్ధసత్వగుణస్వరూపుణ్ణి దర్శించుకోవడానికి మనం ముందుగా శారీరిక శుద్ధిని పాటిస్తాం.

12/24/2017 - 23:59

29న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ..
*

12/17/2017 - 23:00

పన్నిద్దరు ఆళ్వారులలో ప్రముఖ స్థానం అందుకున్నా గోదాదేవి చరిత్ర పావనమైనది. భక్తి , కళా, సామ్రాజ్యాలను తన అసమాన ప్రతిభతో ప్రకాశింపచేసిన విజయనగర సార్వభౌములు సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు ఆదేశానుసారం ‘‘ఆముక్తమాల్యద’’ అను అద్భుతమైన ప్రబంధాన్ని రచించి, తద్వారా గోదా వైభవం చరిత్రను మనకందించారు.

12/10/2017 - 20:10

‘తిరుప్పావై’ అనేది గోదాదేవి విరచితమైన ద్రావిడ ప్రబంధం. ఇది ద్రావిడ వేదంగా ప్రసిద్ధికెక్కింది. తిరు అంటే శ్రీ, లక్ష్మి, సంపద, మోక్షం అనే అర్థాలున్నాయి. పావై అంటేవ్రతం, పాటలతో కూర్చిన మాల అనీ అర్థాలు ఉన్నాయి.

Pages