S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/01/2017 - 21:41

అజ్ఞానాంధకారంలో దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న వారికి జ్ఞానజ్యోతిని చూపిన కరుణాంతరంగుడు శ్రీరమణుడు. ‘రమణ’లోనే ‘మరణ’మున్నదని జనన మరణ చక్రములనుండి తప్పించడానికి తరలివచ్చిన పరమదయానిధి శ్రీరమణుడు.
తన్నుదా తెలుసుకోడానికి ఆత్మవిచారణ మార్గమును జూపి అవ్యయానంద పదవికి చేర్పవిచ్చేసిన గురుమూర్తి శ్రీరమణుడు.

12/25/2016 - 22:12

విశ్వంలో ఎక్కడ విశేష వైభవము కన్నులకు గోచరించునో అది అంతయూ భగవద్విభూతియే. విశేష వైభవము లన్నియూ భగవద్విభూతులే అను విషయము మనకు అర్థమైన ఎడల ఆయా వస్తువులపై ఆరాధనాదృక్పథమే ఏర్పడును గాని అనురాగ దృక్పథము ఏర్పడదు. భగవదైశ్వర్యమే విభూతి. భగవద్విభవాతులన్నియు రామాయణ మహాభారత పురాణ గ్రంథాలలో అత్యంత వైభవంగా ఎంతో విశేషంగా తెలుపబడినవి. భగవానుని వ్యక్తరూపము లే విభూతులు.

12/18/2016 - 21:52

రవి, ధనుర్రాశిలో ప్రవేశించినపుడు వచ్చేది- ధనుర్మాసం.్ధనూరాశికి అధిపతి - బృహస్పతి. జ్ఞానప్రదాత ఈ మాసంలో అమ్మ గోదాదేవి స్వరూపాన్ని దిద్దుకుని తనంత తానుగా విల్లి పుత్తూరులోని విష్ణుచిత్తుని పూదోటలో పరిమళించింది. ఆ తల్లి గుబాళింపును తెలుసుకొని ఆనంద చిత్తంతో విష్ణుచిత్తుడు ఆ తల్లిని చేతుల్లోకి తీసుకొని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ తల్లి విష్ణు చిత్తుని తండ్రిగా తలిచింది.

12/11/2016 - 22:47

ముత్తారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం వుంది. మా పూర్వీకులైన కృష్ణరాయలగారి కోరిక తీర్చేందుకు, శ్రీ రామచంద్రుడు, భద్రాచలంలో వున్నట్లు మా గ్రామంలో కూడా వెలిసి, ముక్తివరం- ముత్తవరం- ముత్తారం రామాలయంగా దాన్ని ప్రఖ్యాతి గావించాడని ఈ ప్రాంతం వారి నమ్మకం.

12/04/2016 - 21:55

ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటియైనది, దీనికి మించినది మరియొకటి లేదు. మతాల ప్రసక్తికి అతీతంగా అందరూ చదవవల్సిన గ్రంథం. ఏ మతానికి చెందిన వారికైనా సకల మానవాళి శ్రేయస్సును కోరేదీ, జ్ఞానాన్ని ప్రసాదించేదీ భగవద్గీత. పరిశీలనం చేస్తే సర్వమత సిద్ధాంతాలకనుగుణంగా ఉన్న ఏకైక గ్రంథం భగవద్గీత.

11/27/2016 - 21:04

జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులువారు నాడు దేశంలో అనేక మతాలను సంస్కరించి, సమన్వయపరిచి షణ్మాతాలను స్థాపించి షణ్మతాచార్యునిగా ప్రసిద్ధి పొందారు. ఆ ఆరుమతాలు- సౌర, శాక్త, వైష్ణవ, గాణపత్య, శైవ, సుబ్రహ్మణ్య (కుమార) మతాలు. అన్నింటికీ కలిపి పంచదేవతారాధన ఏర్పాటుచేసి విధి విధానాలు విశదం చేశారు. కాని అందులో సుబ్రహ్మణ్యుని ప్రస్తావించలేదు.

11/20/2016 - 21:47

‘ప్రజలకు ఉపకారం చేయాలి’అనే నియమాన్ని నిత్యవ్రతంగా ఆచరించటమే ‘లోకోపకార వ్రతం’ కృత, త్రేత, ద్వాపరయుగాల నుండీ భరత వర్షంలో ఎందరో మహర్షులు, ఋషులు, రాజులు, చక్రవర్తులు, పండితులు, వేదవిదులు ప్రజలకోసం ఎంతో ప్రయోజనం చేకూర్చే శుభకార్యాలు లోకోపకారంకోసం నిర్వహించారు.

11/13/2016 - 23:27

‘‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయగ్‌ం శివః’’ అంటూ శివకేశవులు పూజలందుకునే కార్తికంలో కాశీలో గంగమ్మకు ఇచ్చే దీపహారతిని వర్ణించడానికి వేయనోర్లున్నా చాలవంటారు ఈ కార్తికపున్నమిరోజు. దేవతలంతా గంగమ్మ దర్శనంకోసం దివి నుంచిభువికి దిగివస్తారంటారు. కాశీని స్మరిస్తూ మహిళలందరూ ప్రతి జలాశయంలోనూ అరటి దొనె్నల్లో దీప ప్రకాశనం చేస్తారు.

11/06/2016 - 22:25

‘ఎరుక’ అను మాట వినగానే వేమన యోగి వంటి మహనీయులెందరో మనకు గుర్తుకొస్తారు. అసలు ఆ మాటకు గల శబ్దార్థములు తెలివి, జ్ఞానము, మెలకువ, పరిచయము, సోదె, గుర్తు, జోస్యము, Knowledge, understandind అన్నీ మనకు తెలిసినవే. ఎరుకను వ్యవహారిక ఫదముగా ఆలోచించినప్పుడు, ఎరుక మనకు రావాలంటే మనము ముందుగా సంపాదించుకోవలసిన విషయము ఓ అవగాహన మనకు తప్పక ఉండి తీరాలి.

10/23/2016 - 21:12

‘‘తైలే లక్ష్మీర్జతే గంగా దీపావళి ఆధావసేత్
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే’’

Pages