S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

02/01/2018 - 20:41

రూపమే లేని భగవంతుడు లింగాకారంలో ఉద్భవించి బ్రహ్మావిష్ణువులకే అహంకార నిర్మూలనం చేశాడు. ఆ శివయ్యనే కాళేశ్వర లింగంగాను, ముక్తేశ్వరలింగంగాను రూపు దాల్చి శ్రీ కాళేశ్వర క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు.

01/31/2018 - 21:16

ఇలా వెళ్లాలి...
కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో బనగానపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం వుంది. కర్నూలు వరకు వచ్చి అక్కడ నుంచి బస్సులో యాగంటికి చేరుకోవచ్చు. అలాగే బనగానపల్లి వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

01/31/2018 - 21:10

హిందువుల ప్రత్యక్ష దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించే రోజు ‘తైపూసం’. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం మలేసియా రాజధాని కౌలంపూర్‌కు సమీపంలోని బటు గుహల్లో కొలువైవున్న మురుగన్‌ను దర్శించుకునేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు 272 మెట్లు ఎక్కాల్సివుంటుంది. ఇక్కడి మార్గాలన్నీ భక్తజన సందోహంతో కిటకిటలాడాయ.

01/22/2018 - 23:53

పవిత్ర భారతావనిలోని అనేక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పాలమూరు జిల్లాలోని సంగమేశ్వరము ఒకటి. ఇది కృష్ణ, తుంగభద్రలకూడలిగా ప్రసిద్ధమైంది. ఈ కూడలి గ్రామ వాసులు ఒక్కోచోట కాక పలుప్రదేశాల్లో నివసిస్తున్నట్టు తెలుస్తుంది. అలంపురం పట్టణంలో పునఃనిర్మించిన సంగమేశ్వరుని, ప్రతి శివరాత్రి ఉత్సవాలకు కూడలి గ్రామవాసులు శ్రమ, ప్రయాసలు పడి అందరు కలిసి, ఆ దేవదేవుని శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు.

01/14/2018 - 18:44

కోనసీమలో తరతరాలనుండి సంక్రాంతికి వెలుగుల్లో వైభవోపేతంగా ప్రభలీనుతున్న ఉత్సవాలు జగ్గన్నతోట ప్రభల తీర్థాలు.
మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్యకాలంలో సంక్రాంతిపండుగమూడవ రోజున జరుపుకునే కనుమపండుగదినాన కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత ప్రాచీనమైనది, చారిత్రాత్మకమైనదీ ప్రభల తీర్థం.

12/31/2017 - 20:49

శనేశ్వరుని గురించి తెలియని వారుండరు. శనికి ప్రీతి కలిగించాలని శనేశ్వరుని వల్ల బాధలు ఉండకూడదని శనేశ్వరునికి తైలాభిషేకాలు, శనికి ప్రదక్షిణలు చేస్తుంటారు. శని పూజలను కూడా చేస్తారు. తిలలు దానం చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయ్యప్ప పూజ చేస్తే శని సంతోషిస్తాడని మాలదీక్షలు కూడా చేపడుతారు.

12/17/2017 - 22:53

సర్వం జగన్నాథం. జగన్నాథుడు లేని విశ్వాన్ని వూహించలేం. అన్నింటా తానైఅన్నీ తానై ఉన్నవాడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, కర్త కర్మక్రియ మూడింటిని స్వయంగా నడిపించేవాడే జగన్నాథుడు. అన్నీ తానై ఉండి కూడా రూపనామాలు లేనివాడుగా, నిస్సంగుడుగా, నిర్విచారుడు, నిర్వికల్పుడుగా అగోచరంగా ఉంటాడు. ఆ అగోచరుడే గోచరుడై అర్చామూర్తిగా అర్చనలందు కుంటాడు. తన్ను ఆరాధించువారి మనోకామనలు తీర్చే భగవత్స్వరూపుడుగా భాసిస్తాడు.

11/19/2017 - 21:22

క లియుగ దైవం అయ్యప్ప ఆరాధాన రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ధర్మశాస్త అయ్యప్ప గురించి కాస్తో కూస్తో తెలియని వారుండరు. వయస్సు తారతమ్యంలేకుండా అయ్యప్పమాలాధారణ పట్ల అందరూ మక్కువ చూపడం నేటి కాలంలో ఆశ్చర్యానందాలు కలిగిస్తున్నాయ.

11/13/2017 - 00:38

‘‘పరమాత్ముడైన హరి పట్టపురాణిని నీవు
ధరమము విచారించ తగు నీకు అమ్మా..’’
......
అలరులు కురియగ నాడనదే
అలకల గులుకుల నలవేలుమంగ..
....
ప్రేమగా శ్రీవేంకటనాధుడి ప్రసాదాన్ని స్వయంగా తినిపించి తిరుమల క్షేత్రానికి దారి చూపినఅమ్మ శ్రీ పద్మావతీదేవిని గురించి అన్నమయ్య ఇలా పాడుతూ తరించాడు. ఆ అలకల కులుకుల రాణి అమ్మవారు ...

11/05/2017 - 21:53

చె న్నైలో అతి పెద్ద ఆలయం తిరుచునాపల్లి ఆలయం. ఈ ఆలయవైశిష్ట్యాన్ని గురించి ఇక్కడి స్థలపురాణాలు, చారిత్రికాధారాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఈ ఆలయం సుమారు 10వేల అడుగుల పొడవులోను, 60 వేల అడుగుల వెడల్పుతోను ఉందా అనిపిస్తుంది. సుమారుగా ఈ గుడి 156 ఏకరాలుండవచ్చుని ఇక్కడివారు చెప్తారు.

Pages