S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

04/17/2016 - 21:54

భక్తదయాళువు అయన పరమే శ్వరుడు భక్తులకోసం ఆకారం లేకపోయనా తన్ను తాను సృజించు కుంటూనే ఉంటాడు. తన భక్తుల కోరికలను ఈడేర్చడానికి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ అనే ప్రసిద్ధమైన క్షేత్రంలో రాజరాజేశ్వరుడుగా కొలువై య్యాడు. కోరి కొలువైన ఈ రాజ రాజేశ్వరస్వామి వారు వీరను తేడా లేకుండా తన్ను స్మరించినవారినల్లా కాపాడే రాజేశ్వరుడుగా ఖ్యాతిచెందాడు.

04/11/2016 - 00:00

త మ్ముడు లేకుండా నేనుండలేననే అన్న, అన్న పాదుకలే నా ఇలవేల్పు అనే తమ్ముడు, తండ్రి మాటే వేదం అనే కొడు కు, రాజ్యమే మిన్న రాజుకన్నా అనే భార్య, ఇలా చిత్రవిచిత్రమైన మానవ సమాజమంతా ఇక్కడే కుప్పపోసిందా అన్నట్టుగా ఉన్న రాజ్య మే అయోధ్యా రాజ్యం. త్రేతా యుగం లోనిది అయనా నేటికీ అయోధ్య పేరు చెప్తేనే చాలు ఒళ్లు పులకరించి పోతుంది.

04/10/2016 - 23:57

ఒకే మాట, ఒకే బాణం, ఒకే సతీ అంటూ యుగయుఈగాలకు చాటి చెప్పిన అవతార పురుషుడైన శ్రీ రామచంద్రమూర్తిని నేటికి ఆదర్శంగా తీసుకునే భారతదేశంలో ఆ మహానుబావుడి ఆలయం కడు రమణీయంగా గుమ్మడిదలలో అలరారుతోంది. మందిరం ఆలన పాలన నిమిత్తం ఎకరాల కొద్ది మాన్యాన్ని నాటి రాజులు కేటాయించినా పట్టించుకునే వారు లేకపోవడంతో అబ్బురపరిచే ఆలయం నిరాదరణకు గురవుతోంది.

04/04/2016 - 01:08

శిష్టరక్షణకు తన్ను తాను సృజించుకున్న అవతారుడే లక్ష్మీ నృసింహస్వామి. ఈస్వామి ఎక్కడైనా తన దైవత్వాన్ని ఎరుకపరుస్తునే ఉంటాడు. నాడు ప్రహ్లాదుడిని రక్షించటానికి స్తంభంలోంచి ఆవిర్భవించాడు.

03/27/2016 - 23:33

అత్యంత పురాతన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అమరావతి పట్టణంలోని అమరేశ్వర ఆలయం ఒకటి. ఈ పట్టణంతోపాటు ఆలయానికీ గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని మొదటి నాగులు అనే వంశం వారు పరిపాలించారు. తెలుగు వారైన వీరి కాలంలోనే అప్పటివరకూ కేవలం మాట్లాడుకోవడం వరకూ ఉన్న తెలుగు భాషకు రూపురేఖలు ఏర్పడ్డాయి. అంటే3లిపి సృష్టించబడింది. ఇలా తెలుగు లిపిలో ఉన్న మొట్టమొదటి పదం ‘నాగబు’గా ప్రసిద్ధి పొందింది.

03/20/2016 - 23:02

ఆలయాలను ధర్శించటం వెనుక శాస్ర్తియ ప్రయోజనాలు వున్నాయి. చాలామంది తమ కోరికలు తీరటానికో లేక మానసిక ప్రశాంతత కోసమో, యింకేమైనా పుణ్యం వస్తుందనో వెళుతుంటారు. కానీ అసలు దేవాలయాలు నిర్మించటానికి కారణాలు తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. గుడి అనేది ఎపుడు ఎందుకు -అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? అనే విషయమై వేదాలు చెప్తున్న అంశాలు-

03/14/2016 - 05:21

తె లంగాణారాష్ట్రంలో అదిపెద్ద వైష్ణవ క్షేత్రంగా ప్రఖ్యాతి గడించిన క్షేత్రం యాదగిరి గుట్ట. నాడు ప్రహ్లాదునికి ఆనందాన్ని గూర్చిన ఉగ్రనరసింహుడు యాదర్షి కోరిక మేరకు ఈ యాదగిరి క్షేత్రాన ఐదురూపాల్లో వెలిశాడు.

03/06/2016 - 21:11

సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తున.. మహేంద్రగిరులపై శివనామస్మరణ హోరెత్తే రోజు వచ్చింది. వయోవృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు ఎంతో భక్తితో ఆ గిరులను ఎక్కి ముక్కంటిని ఆర్తిగా భక్తితో తలచుకుంటారు. తూర్పు కనుమల్లో ముఖ్యమైన మహేంద్ర గిరులపై భారీ రాళ్లతో కట్టిన 3పాండవుల గుడులు2 ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణే.

01/18/2016 - 08:13

తెలుగు రాష్ట్రాలలో సుమారు ఏబది నృసింహ క్షేత్రములున్నవి. వాటిలో అత్యంత సుప్రసిద్ధమైనవి సింహాచలం, అహోబిలం, మంగళగిరి, వేదాద్రి, అంతర్వేది, యాదగిరి, ధర్మపురి మొదలగునవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నవి. అట్లే బెజ్జంకి నృసింహ క్షేత్రము కూడా పురాతనమైనదే, తెలంగాణ ప్రాంతములో కరీంనగర్ జిల్లా కేంద్రము నుండి హైదరాబాదు వెళ్ళే మార్గమున రాజీవ్ రహదారిలో బెజ్జంకి గ్రామము కలదు.

12/27/2015 - 22:38

లక్ష్మీనరసింహుడు
భక్తవరదుడు, భక్తవత్సలుడు, అపారదయాంబురాశి ఇట్లా భగవంతుణ్ణి నమ్మేవాళ్లు ఏపేరుతో పిలిచినా ఓ అని పలికే పరమేశ్వరుడు కృపానిధి. ఆ పరమేశ్వరుడే దుష్టలను శిక్షించినా, శిష్టులను ఆదరించినా చివరకు అందర్నీ తనలోనే ఐక్యం చేసుకొంటాడు. అందుకే ఉన్నది అంతా పరమాత్మనే. వస్తువులోను, అవస్తువులోను పరమాత్మ అంశనే ఉందని పరమభాగవతోత్తములు అంటారు.

Pages