S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/01/2018 - 20:49

పరమేశ్వరోపాసన చేసే వారు ఓం అని ఉచ్చరిస్తూ ఉంటే అమ్మవారి మంత్రోపాసన చేసేవారు శ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు.

02/01/2018 - 20:47

ఆధ్యాత్మికవాదులల్లో చాలామంది ముక్తి కోసం ఎదురుచూస్తుంటారు. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు అంటే జన్మరాహిత్యానికి, ముక్తినొందటానికి అంటుంటారు. ఈ ముక్తిని పొందాలంటే ఏం చేయాలి- కొంతమంది సన్యాసం స్వీకరించి నిస్సంగుగా ఉంటే ముక్తి వస్తుంది అంటారు. కాషాయ వస్త్రాలు ధరించి నిస్సంగుగా ఉండేవారంతా ముక్తిని పొందుతున్నారా? అంటే చెప్పలేము.

02/01/2018 - 20:43

ఒకసారి ధర్మరాజు పుణ్యక్షేత్రాలను చూచి రావాలనుకొన్నాడు. దానివల్ల మనశ్శాంతి వస్తుంది. అట్లానే చేసిన పాపం నశించి పుణ్యం వస్తుంది అనుకొన్నాడు. ఈ విషయమే శ్రీకృష్ణునితో మాట్లాడుదామని వెళ్లాడు. ధర్మరాజు కృష్ణుడు మాట్లాడుకునేటపుడు అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు కృష్ణునికి నమస్కరించాడు.
కృష్ణుడు విషయమేమిటని అడిగితే ఇలా చెప్పాడు

02/01/2018 - 20:35

సార్వకాలికమైనది, సార్వలౌకికమైనదీ భగవద్గీత. ఇది ఏ ఒక్క వ్యక్తికి, జాతికి, వర్గానికి, వాదానికి, దేశానికికే కాదు ఒక్క కాలానికి సంబంధించినది కాదు. ఆ గీత -
మమైవాంశో జీవలోకే జీవ భూతః సనాతనః
మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి (15-7)

01/31/2018 - 21:19

అకార ఉకార మకారాల సమ్మేళనం ఓమ్ కారం. ఓమ్ ఉచ్చారణ తర్వాత వినిపించే శబ్దం అర్థమాత్ర ఇది ఇందులోనే ఉంది. ఈ అర్థమాత్రను ఏకాగ్రత ద్వారా వినవచ్చు. సృష్టికి మొట్టమొదట వినిపించిన శబ్దం ‘ఓమ్’ మాత్రమే. సృష్టికి ముందు తర్వాత ఉండేది శాశ్వతమైందీ ఈ ఏకాక్షర ఓమ్ కారమే. చతుర్ముఖ బ్రహ్మ ఈ ఓమ్‌కార జపం తోనే ఋగ్వేద, యజుర్వేద సామవేదాలను గ్రహించాడు. ఓమ్ కారం సర్వశ్రేష్ఠం. సర్వోన్నతం.

01/31/2018 - 21:05

వేదం మనకు పరమ ప్రమాణం...
మరి వేదం చెప్పినట్లు మనం నడుచుకుంటున్నామా?
సహనంతో నలుగురితో కలసి నడువమని, నలుగురితో ఐకమత్యంతో ఉండమని, నలుగురితో మాట్లాడమని, జీవించమని, ప్రయాణించమని ఋగ్వేదం చెబుతుంది.

01/31/2018 - 21:03

ప్రేమ స్వరూపుడు యేసు. ప్రేమను పంచటమే ఆయన తత్వం. పాపం చేయడం మనుష్యుల సహజ గుణం. పశ్చాత్తాపం చెందటం, పరివర్తన చెందటమూ మనుషులకు సహజమే. కాని పరివర్తన చెందటం అంత సులభం కాదు. యేసు పాపం చేసినవారికి శిక్ష విధిస్తే పాపమనేది మరణించడం జరగదు. పాపం అనేది జీవించే ఉంటుంది. అసలు శిక్ష అనేది పాపానికే వేయాలి అంటారు.

01/28/2018 - 21:00

కే సరి అంజనల పుత్రుడు ఆంజనేయుడు.. ఇతడుమహాబలవంతుడు ఇలా కావడానికి కారణం బాల్యంలో సూర్యుణ్ణి పండుగా భావించి నోట కరచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడు మూర్ఛిల్లాడు. పవనుని వరప్రసాదంగా పుట్టినవాడు కనుక పవనునికి మహేంద్రునిపై కోపం వచ్చి తన్ను తాను ఉపసంహరించుకున్నాడు. గాలి లేక సర్వలోకాలు తకతకలాడాయ. సర్వదేవతలూ ఇంద్రుడితో సహా వాయుదేవుని శరణు కోరారు.

01/28/2018 - 20:58

మెల్లగా తన చేతిని ధ్రువుని శిరస్సున స్వామి ఉంచాడు. వెంటనే ఇహలోకంలోకి వచ్చిన ధ్రువుడు కన్నులు విప్పార్చి స్వామిని దర్శించాడు.స్వామి చూచిన క్షణం ఆయన కనులనుంచి అశ్రువులు కారిపోతున్నాయి. శరీరమంతా వణికిపోతున్నది. ఏదోచెప్పాలనుకొన్నాడు. కాని నోట మాటరావడంలేదు. గొంతు తడారిపోతోంది. అమితమైన సంతోషంతో ఒళ్లు పులకిస్తోంది. ధ్రువుని అవస్థను చూసి కృపాళు అయిన భగవంతుడు తనచేయి ధ్రువుని చెక్కిళ్లకు తాకించాడు.

01/28/2018 - 20:57

ఒక ఆసామి తన వ్యాపారంలో పదివేలు లాభం వచ్చిందని దాన్ని సద్వినియోగం అయ్యేట్టుగా చేయమని మనసులో భగవంతుని కోరుకుంటూ ఆసామి వస్తున్నాడు. దారిలో ఓ యువకుడు తన చేతిలో అనారోగ్యంతో ఉన్న ఒక శిశువునుపట్టుకుని అయ్యా ఎవరైనా దానం చేయండి. నా కొడుకు మృత్యువుతో పోరాడు తున్నాడు. ఒక్క పదివేల రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి. మీకు జన్మంతా ఋణ పడి ఉంటాను అని ఏడుస్తూ అరుస్తున్నాడు.

Pages