S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/24/2016 - 21:13

అరివీర భయంకరులైన రాక్షసా ధములను ఒంటిచేత్తో మట్టి కరిపించినవాడు మఱ్ఱి ఆకుపై పవళిం చిన వాడే ఒక్కడే. పాండవులను నీడలా కనిపెట్టి ఉంటూ లక్కఇంటిలో కాలి పోకుండాను, అడవుల్లో అవమానం లేకుండాను కాపాడినవాడు ఒక్కడే. దుర్యోధనాది గర్వపోతుల గర్వాన్ని అణిచివాడు, ధృతరాష్ట్రులాంటి గుడ్డివా రి మదం మణిచినవాడు ఒక్కడే.

01/24/2016 - 21:12

మనం నిత్యం పాటించే సంప్రదాయాల్లో ‘నమస్కారం’ ప్రధానమైంది. మనలోని వినయాన్ని చాటుకోవాలంటే ‘నమస్కారా’న్ని అవతలి వారి హృదయాన్ని తాకేలా నమ్రతతో కూడుకొని ఉండాలి. సంప్రదాయంలో ‘నమస్కారం’ అనే మాటకు యోగఫలసిద్ధికి చేసే ప్రణామమనే అర్ధం ఉంది. ప్రణామమంటే ‘నమస్కారమ్’ ప్రణిపాతం అని భగవద్గీత దీనే్న ప్రస్తావించింది. నమస్కారంలో మనిషి నిజాయితీ వ్యక్తవౌతుంది. ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి’ అన్నారు.

01/24/2016 - 21:12

ఆర్ష భూమియైన ఈ పుడమిపై వేద కాలంనుంచి ఎందరో జగద్గురువులు, సద్గురువులు అవతరించి లోకోద్ధరణ గావించారు. శ్రీరామకృష్ణ, వివేకానందులు, శ్రీరామతీర్థులు, శ్రీ అరవిందయోగి ఇత్యాదిగా ఆధునిక కాలంలో ప్రసిద్ధి పొందేరు. ఆ గురుపరంపరని కొనసాగిస్తూ మనమధ్య అవతరించిన సద్గురువు భగవాన్ శ్రీరమణ మహర్షి.

01/18/2016 - 08:12

సహాయం అనేది మానవత్వంతో చేయాలిగాని మన స్వలాభాల కోసం చేయకూడదు. మానవత్వానికి మించిన విలువైన వస్తువుగానీ, విద్యగానీ, మరే విషయంగానీ దైవసృష్టిలో లేనే లేదు. సృష్టినంతటినీ వీక్షిస్తున్న కళ్ళు తమ వెనుక ఏ సాంకేతిక వ్యవస్థ వలనల అలా చూడగలిగే శక్తి వచ్చిందో ఆ వ్యవస్థను మాత్రం చూడలేవు. అదేవిధంగా పరులకు సహాయం చేసేవారు, సేవ చేసేవారు కూడా మనస్సులో ఎటువంటి స్వార్థ చింతన లేకుండా వుండాలి.

01/18/2016 - 08:11

పూర్వం భృగు వంశములో జన్మించిన చ్యవన మహర్షి గొప్ప నియమంతో గర్వం, క్రోధం, హర్షం, శోకం పరిత్యజించి పనె్నండేళ్ళపాటు నీటిలో ఉండిపోయాడు. కర్రలాగ, నీటిపై తేలి ఉండే అతనివద్దకు తెలియక వచ్చిన బెస్తవారు విసిరిన పెద్ద వలలో చ్యవన మహర్షి చిక్కుకొన్నాడు. మహర్షిని గమనించిన ఆ మత్స్యకారులు భయపడుతూ తమ అపరాధాన్ని మన్నించమని అడిగారు. చ్యవనుడు ‘ఈ చేపలు నా సహజీవనమయ్యాయి.

01/11/2016 - 06:10

ధనుర్మాసంలో గోదాదేవి వ్రాసి పాడిన పాశురాలను అనుసంధానించుకొంటూ నెలరోజులు వైష్ణవాలయాలన్నీ శోభాయమానంగా ఉంటాయి. తాను ధరించి ఇచ్చిన పూమాలలనే కావాలని కోరుకుని ధరించిన శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడిని తన భక్తుడిగా ప్రకటించి తన కూతురు చేసిన పనికి నీవేమీ ప్రాయశ్చిత్తం చేసుకోనక్కర్లేదు కాని నేను నీవు పెంచి పోషించిన అయోనిజను నాకోసమే ఎదురుచూసే ఆ ఆండాళ్‌ను నేను పాణిగ్రహణం చేస్తానని మాటిచ్చాడు.

01/11/2016 - 06:07

వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరు ముగత్తు శేయరై యాల్ శెన్ఱిఱైంజి

01/11/2016 - 06:05

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చే విత్తు ఉన్
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్
......................................

01/11/2016 - 06:03

గీత మానవుణ్ణి మాధవుని స్థాయికి చేరుస్తుంది. భూతదయను పెంచుతుంది. సకల పర్రబహ్మ స్వరూపమని బోధిస్తుంది. సమ బుద్ధిని ప్రసాదిస్తుంది. సకలురను భగవంతుని అంశాలుగా చూడడానికి ప్రేరేపిస్తుంది. అటు వంటి గీత మనుష్యుల రాతలను మారుస్తుంది అంటే నిజమేకదా.. ఇహలోకంలోనే కాక భవబంధాల్ని తొలగిస్తుంది, ఆత్మసాక్షాత్కారమును కలిగిస్తుంది. శాంతిని అనుగ్రహిస్తుంది.

01/11/2016 - 05:58

వేదాలలో అసంబద్ధముగా కనపడే విషయాలు నవీన విజ్ఞానం పెరిగిన తర్వాత అద్భుత శాస్ర్తియ విజ్ఞాన అవతారాలు అవుతున్నాయి.

Pages