S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/17/2017 - 22:57

పాపకార్యాలు నిర్వర్తించి, ఎంత పుణ్యమార్జించినా పాత పాపభారాన్ని మోయాల్సిందే. నేను ఇంత పుణ్యాన్ని చేసాకదా మరి కాస్త పాపం చేస్తే ఏమి అంటే విధి ఊరుకోదు. కనిపించని విధి పుణ్యానికి ఏవిధంగా మంచి ఫలితాన్ని ఇస్తుందో పాపానికి కూడా శిక్ష వేయనే వేస్తుంది. ఆ పాపభారాన్ని బట్టి శిక్షలో ఎక్కువ తక్కువలుంటాయి.

12/10/2017 - 20:19

మరోసారి నిదాఘుడు ఇంటికి కట్టెలమోపును మోస్తూ దారిలో వెళ్తున్నాడు. అతనికి రాజపరివారం అడ్డువచ్చింది. ఏనుగులను రాజును తప్పించుకుని వెళ్లలేక కట్టెలమోపును దించి పక్కన పెట్టి కాసేపు అక్కడ నిలబడ్డాడు. అక్కడికి గురువైన ఋభడు వెళ్లాడు. అపుడూ నిధాఘుడు గుర్తుపట్టలేదు. గురువే కల్పించుకుని ‘నాయనా ఇక్కడ నిలబడి ఉన్నావేమి ?’ అని అడిగితే ఏనుగునెక్కి రాజు వచ్చినందువల్ల దారి లేకపోయింది అన్నాడు నిదాఘుడు.

12/10/2017 - 20:18

కృ ష్ణా! కృష్ణా అవి తలలూపాయి. ఇక నీ మాట కాదని అవి ఎటూ పోవు. మనం నిశ్చింత. నీకు చెబితే చాలు. నీవు మా మాట వింటేచాలు. మాకు బోలెడంత నిశ్చింత. అన్నాంతా ఒకేసారి .
కృష్ణుడు వారితో చిరునవ్వు చిందిస్తూ తాను కూడా పరుగెత్తి వెళ్తూ నన్ను ముట్టుకోండి చూద్దాం అన్నాడు.
అంతే అందరూ ఆ యశోదమ్మ బాలుని వెంట పరుగెత్తారు. గోవుతోడి వత్సము వెంబడించినట్టుగా.

12/10/2017 - 20:15

శ్రీ సద్గురు శివానందమూర్తిగారు సాధారణంగా కనిపించిన అసాధారణ వ్యక్తి. వ్యక్తి కాదు ఒక శక్తిఅని శివానంద మూర్తి గారి శిష్య గణం చెబుతారు. తెల్లని ధోవతీ, చొక్కా, కండువాతో నుదుట మూడు రేఖల విభూతి, కుంకుమ బొట్లతో, మెడలో రుద్రాక్షమాలతో మనకు దర్శనమిస్తారు. వీరిని సద్గురువుగా భావించి గురుదేవుల దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు అందుకున్న పలువురు వారి మనస్సులో అనుకున్న కోరికలు వెంటనే నెరవేరాయని చెబుతారు.

12/10/2017 - 20:13

రచన: డా.గుడిపాడి వి.ఆర్,ఆర్.ప్రసాద్
వెల: రూ.280/- లు.
ప్రతులు దొరుకుచోటు
డా.గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
7-8-51, ఫ్లాట్ నెం.18 నాగార్జున సాగర్ రోడ్,
హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాదు - 500 079
ఫోన్.నెం.9490947590, 9849560014
*

12/03/2017 - 21:03

‘‘అదికాదు కృష్ణా మాకు నీతోడి కూర్చుని ఆటలు ఆడుతూ పాటలు పాడతూ చల్ది తినాలని ఉంది ’అన్నారు వారు. వారు అనుకొన్న ప్రకారం తమ తమ ఇండ్లల్లో చల్ది మాకు ప్రత్యేకంగాచేసి ఇవ్వమని వారి తల్లులను అడిగారు. పిల్లలు సరదా పడుతున్నారు కదా అని వారి అమ్మలంతా రకరకాల పిండి వంటలు కూడా చేసి ఇచ్చారు. పెరుగన్నాలు, చిత్రాన్నాలు, రకరకాల వంటలు చేసి కావళ్లల్లో పెట్టివారికి ఇచ్చారు.

12/03/2017 - 20:57

జడభరతుడు వెళ్లడానికి సమాయత్తమైయ్యాడు. రహూగణుడు సాష్టాంగప్రణామం చేస్తూ ‘‘స్వామి! మీరు నాకు జ్ఞానబోధ చేయండి. నేను ఈ మమకారబంధనాలను వదిలించుకొని పరమాత్మవైపు అడుగులు వేసేటట్లు చేయండి ’’అని పదేపదే వేడుకున్నాడు.
‘‘స్వామీ నేను చాలా తప్పు చేశాను. మీలాంటివాని చేత నేను పల్లకీ మోయించుకున్నాను.నన్నుక్షమించండి’’అన్నాడు. జడభరతుడు చిన్నగా నవ్వాడు.

11/26/2017 - 20:58

బ్రహ్మలోకం
చతుర్ముఖ బ్రహ్మ ఆనందంగా శారద వీణారవాన్ని వింటున్నాడు. శారదాదేవి తన్మయత్వంతో వీణ వాయిస్తోంది. అక్కడున్న సరోవరంలో హంసలు ఆనందంతో వాయిద్వ ధ్వనికి అనుగుణంగా నడుస్తున్నాయి. నెమళ్లు ఆనందంతో క్రేంకారాలను కూడా శారదావీణాధ్వనికి అనుగుణం చేస్తున్నాయి.

11/26/2017 - 20:55

‘‘అయ్యో నేను చనిపోతే ఈ చిట్టి తండ్రిని ఎవరు చూస్తారు’’అని ఎంతో బాధపడుతూ నా చివరి శ్వాసను వదిలాను. భగవంతుడికి ఎవరి పట్లా అనురాగం కాని ద్వేషం కాని వుండవు కదా. పరమాత్మకు సర్వం సమానమే కనుక. ఎవరేది కోరుకుంటే వారికి దానే్న ఇస్తాడు కనుక నాకు మరుజన్మలో జింక శరీరాన్ని ఇచ్చాడు.

11/26/2017 - 20:52

‘గీతా’అను పదాన్ని తిరగద్రిప్పి చదివిన ‘తాగీ’ అవుతుంది. అంటే త్యాగివి కమ్మని గీత మానవునికి బోధిస్తోంది. శోకరాహిత్యమే గీతారహస్యం. సంజయడు ప్రచారం చేసిన గీతాగ్రంథం ‘్ధ’ కారంతో ప్రారంభమై ‘మ’కారంతో అంతమైంది. ధ- మ అను రెండక్షరముల మధ్యనే గీతాప్రకాశం ఉన్నది. మూర్త్భీవించిన ధర్మమే గీత.

Pages