S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/10/2017 - 22:25

అనంతనామధేయునికి నామకరణోత్సవానికి నేను కర్తను కావడం ఎంత అదృష్టం అనుకొన్నాడు గర్గమహర్షి. గర్గుడు నందుని పిలిచి నామకరణోత్సవానికి ఏర్పాట్లు ఏవిధంగా చేయాలో చెప్పి చేయించాడు. ముందుగా రోహిణీ దేవికి పుట్టిన పిల్లవానికి నామకరణం చేస్తూ ఈ శిశువు పెరిగి పెద్దవాడై వంశానికే బలంగా తయారు అవుతాడు కనుక బలరాముడు అన్న పేరు స్థిరం చేయమని చెప్పారు.

09/10/2017 - 22:22

పాణిని బహుముఖ ప్రజ్ఞాశాలి. సంస్కృత భాషను చక్కగా తీర్చిదిద్దిన అసామాన్య ప్రతిభావేత్త. వ్యాకరణం, వేదాంగం, వేదాలలోని భాగాలు అక్షరాల ఉచ్ఛారణను నిర్ధారిస్తుంది. పాణిని మహా పండితుడు. ఇతడు క్రీపూ 7వ శతాబ్దానికి చెందినవాడుగా ఆధారాలు లభించాయి. పాకిస్తాన్‌లో ప్రవహించే సింధూనది ఒడ్డున వున్న నేటి లాహోర్ పట్టణాన్ని పూర్వం ‘శలాతుర’ అని వ్యవహరించేవారు. ఆ శలాతురయే పాణిని యొక్క జన్మస్థలం.

09/10/2017 - 21:10

ద్రౌపదిని పరిశీలించినప్పుడు నేటి సమాజంలోని సామాన్య స్ర్తి కనిపిస్తుంది. ఆమె యజ్ఞంలో పుట్టినా, కురువంశంలో మెట్టినా, జనవంద్యుల నుబొందినా, అతిపరాక్రమ వీరులను భర్తలుగా పొందినా ద్రౌపదిలో ఒక సామాన్యస్ర్తినే ఎక్కువగా కనబడుతుంది. ఆమె సంగ్రామానికి హేతువుగా, ప్రేరక శక్తిగా కనిపిస్తుంది.

09/03/2017 - 22:40

‘వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు బాండు భూ
వరునకు గోడలైతి జనవంద్యుల బొందితి , నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ , సహజన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజనాభ! యిన్ని ట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్... అని సగర్వంగా మహాభారత ఉద్యోగపర్వంలో చెప్పుకున్న ద్రౌపది నాటికి నేటికి ఆదర్శవనిత.

09/03/2017 - 22:35

ఎక్కడలేని సుడిగాలి రూపంలో తృణావర్తుడను రాక్షసుడు వచ్చాడు. ఊర్లు పోలాలన్నింటా పోడుగాలి వచ్చింది. ఇళ్లు, మనుషులు అంతా ఎగిరిపోతున్నారా అంటూ రుంయి రుంయి అంటూ గాలి మహాశబ్దంతో వీచసాగింది. ఈ గాలిని చూచి ఇంతకుమునుపెన్నడు ఇంతటి సుడిగాలి రాలేదని అనుకొంటూనే గాలికి ఎగిరి వెళ్లేవస్తువులను పట్టుకోవాలంటూ యశోద నెమ్మదిగా కృష్ణుని నేలపై పడుకోబెట్టి లేచింది.

09/03/2017 - 22:42

ఉపాధులన్నింటిలో మనుష్యుని ఉపాధి ఉత్తమోత్తమమైనది. ఆత్మదీప్తి ప్రకాశం కలిగిన మనుష్యులు తక్కిన జంతువులవలె ఉదర పోషణతో తృప్తి చెందక యుక్తాయుక్త వివేకం, ఆత్మకల్యాణ జ్ఞానం మొదలైన సాధనలతో మోక్షాన్ని సాధించగలుగుతున్నారు. ఈశ్వరుడే అన్నింటికీ కారణమని తెలుసు కొన్నాడు. భగవంతుని నుంచి పుట్టినదంతా ప్రళయ కాలంలో తిరిగి భగవంతునిలోకి లీనమ వుతుంది.

08/27/2017 - 22:48

చిన్నపిల్లవాడు చెప్పినదంతా విన్న చిత్రకేతువులో వ్యామోహం వీడింది. నశ్వరమైన దాన్ని వదిలిపెట్టేసాడు. శాశ్వితమూ, నిత్యమూ , సత్యమూ యైన నారాయణుని గూర్చి తెలుపమని నారద మహర్షిని వేడుకున్నాడు. నారదుడు చిత్రకేతువుకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రోచ్చారణ తో చిత్రకేతువు ఆనందించాడు. ఏడు రాత్రుళ్లు ఏడు పగళ్లుసమాధినిష్ఠుడై హరిధ్యానం చేశాడు.

08/27/2017 - 22:43

ఎంత దిష్టి తీసేసినా ఇంకా బెదురు తగ్గని గోపవనితలు యశోదకు దిష్టుల గురించే చెప్పసాగారు. యశోద అవి అన్నీవిని మరింత కంగారుపడింది. తనకుమారునికి ఆపదలే కలుగకూడదని ముక్కోటి దేవతలను ప్రార్థించింది. గోపకాంతలు కూడా ఆమె చుట్టూత చేరి గోపాలునికి ‘‘మా పుణ్యాలరాశీ!

08/27/2017 - 22:37

పుట్టిన జీవి మరణించక తప్పదు. మరణించిన జీవి మరలా పుట్టడం తప్పదు. అయతే మరణించిన జీవి మరలా పుట్టుతూనే ఉందా లేదా అన్నది తెలియని విషయం కాని పుట్టిన ప్రతి జీవి మాత్రం మరణిస్తూనే ఉంది. ఈ జననమరణాల మధ్య ఉన్న జీవితం లో చేసే మంచిచెడులు మాత్రం వాటి ఫలితాలను ఆ జీవే భరిస్తుందనేది అందరూ చెప్పేదే. ఏదైనా కష్టం వచ్చిన పుడు ఇదిగో నీవీ పాపం చేసి ఉన్నావు కనుక నీ కీ కష్టం ప్రాప్తించింది అని అంటారు.

08/20/2017 - 23:30

‘‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!’’

Pages