S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/17/2018 - 06:58

విశాఖపట్నం, అక్టోబర్ 16: స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా ప్రతిపాదించిన ఏరియా బేస్డ్ డవలప్‌మెంట్ పనులను దసరా తరువాత ప్రారంభించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.

10/17/2018 - 06:57

జగదాంబ, అక్టోబర్ 16: తిత్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాలకు తీవ్ర నష్టం వాటిల్లిన కారణంగా తిత్లీ తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకొవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు.

10/17/2018 - 06:30

విజయనగరం, అక్టోబర్ 16: జిల్లాను నిన్న మొన్నటి వరకు డెంగ్యూ పట్టిపీడించగా, తాజాగా స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సాలూరు పట్టణానికి చెందిన బోనుమంతి వౌనిక (24) అలియాస్ సంతోషి స్వైన్‌ఫ్లూ వ్యాధితో విశాఖలోని చెస్ట్ ఆసుపత్రిలో మృతి చెందింది.

10/17/2018 - 06:34

నల్లగొండ, అక్టోబర్ 16: నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కుప్పలు పోసి కొనుగోలు కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు మంగళవారం సాయంత్రం తమ ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో రాస్తారోకోకు దిగారు. దీంతో రైతులపై నల్లగొండ పోలీసులు దౌర్జన్యకరంగా ప్రవర్తించిన ఘటన పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది.

10/17/2018 - 06:48

అల్లాదుర్గం, అక్టోబర్ 16: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు పెట్టడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కాదా అని అందోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. ప్రజలు ఐదు సంవత్సరాల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెరాస ప్రభుత్వం తొమ్మిది నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో అభివృద్ధి వెనక్కిపోయిందన్నారు.

10/17/2018 - 06:28

విజయవాడ, అక్టోబర్ 16: విజయవాడ కనకదుర్గ ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబుకు మరోసారి అవమానం ఎదురైంది. దీంతో కొంతసేపు ఆయన పాత ఆశీర్వాద మండపం వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే మూలా నక్షత్రం, సరస్వతీ దేవి అవతారం రోజు ఆయనను దర్శనానికి, కార్యాలయంలోకి అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారడం తెలిసిందే.

10/17/2018 - 06:45

మహబూబ్‌నగర్, అక్టోబర్ 16: చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వమంటే బర్రెలు, గొర్రెలు, చేపపిల్లలు అంటూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో యువత తగిన బుద్ధి చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి, మద్దూర్ మండలాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోటార్ బైక్‌ర్యాలీ, రోడ్‌షోను నిర్వహించారు.

10/17/2018 - 06:26

లింగాల, అక్టోబర్ 16: పురుగుల మందుతాగి మాజీ మావోయిస్టు గుండూరి శ్రీను అలియాస్ రమాకాంత్(45) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అంబడిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎఎస్సై అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.

10/17/2018 - 06:25

కామారెడ్డి, అక్టోబర్ 16: యువకుల బలిదానాల కారణంగా చలించిపోయిన సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారని శాసనమండలి ప్రతిపక్ష నేత, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కామారెడ్డి, పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పార్టీలో చేరిక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

10/17/2018 - 05:53

గుంటూరు, అక్టోబర్ 16: దేశంలోని విపక్షాలన్నీ ఏకమైనా 2019 ఎన్నికల్లో నరేంద్రమోదీయే తిరిగి ప్రధానిపీఠం అధిరోహిస్తారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ స్పష్టంచేశారు. స్థానిక ఇన్నర్ రింగురోడ్డులో ఎస్సీ చైతన్య వేదిక సభ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది.

Pages