S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/17/2019 - 20:10

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

08/17/2019 - 20:06

ఉన్నట్టుండి
ఏదో నిప్పు రాజుకుంటుంది
ఒక వాక్యమై
ఒక నినాదమై!

ఉన్నట్టుండి
ఏదో ఊహ పురుడు పోసుకుంటుంది
ఒక పదమై
ఒక ప్రవాహమై!

ఉన్నట్టుండి
ఏదో ఆవేశం ఎగసిపడుతుంది
ఒక ఉప్పెనై
ఒక కవిత్వమై!

ఉన్నట్టుండి
ఏదో నిర్వేదం పెనవేసుకుంటుంది
ఒక గాయమై
ఒక గేయమై!

08/17/2019 - 20:06

భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ తీజ్ పండుగ బంజారా గిరిజనులలో బలమైన విశ్వాసం వుంది. పూర్వం తండాలలో కాలం కాకపోవడంతో తీవ్ర కరువు వచ్చినప్పుడు లోకం సుభిక్షంగా వుండాలని పెళ్లికాని యువతులతో ఈ తీజ్ పండుగ నిర్వహించే వారని గిరిజన బంజారా పెద్దలు చెబుతున్నారు. తీజ్ పండుగలో కీలకంగా మారిన పెళ్లికాని యువతులకు త్వరగా మంచి లక్షణాలు గల వరుడు లభించి వివాహం అవుతుందని విశ్వాసం.

08/17/2019 - 19:59

‘మైగాడ్! ఆ వచ్చింది విజయ్ నాయక్‌కి సంబంధించిన వాళ్లు కాదు కదా? అతనికి మన ముగ్గురి మీదా అనుమానం ఉంది’ అన్నాడు అనిల్ భయంగా.
‘అతనికెలా తెలుస్తుంది? అతనెక్కడికో దూర ప్రాంతాల కెళ్లాడని విన్నాను’ అన్నాడు కాంతారావు.

,
08/17/2019 - 19:55

గడిపిన క్షణాలను, గడిచిన సంఘటనలను మధుర జ్ఞాపకాలుగా మన ముందుంచేవి ఫొటోలు. ఒక చిత్రం వేవేల భావాలకు సమాహారం. కదిలే కాలాన్ని బంధించే శక్తి ఒక్క ఫొటోకే ఉంది. గతాన్ని కళ్ల ముందు ఉంచే సాధనం, చరిత్రను వర్తమానంతో చూపడం ఒక్క ఛాయాచిత్రానికే సాధ్యం. బంధాలకూ, అనుబంధాలకూ బాసటగా నిలబడగలదు. ఒక మాట వింటే కొన్ని రోజుల తర్వాత మరచిపోవచ్చు. ఒక వాక్యం చదివితే కొన్ని నెలల తరువాత మరచిపోవచ్చు.

08/17/2019 - 19:48

ఆహార ఫదార్థాలుగా వండుకుని తినదగిన ఆకు కూరలు, పూల కూరల గురించి అనేక విశేషాలు చర్చించాం. ఆకు కూరలు, పూల కూరలు, దుంప కూరలు, కాయగూరల్లో ఏవి ఎక్కువ బలవర్థకమైనవి, శక్తిదాయకమైనవి చాలా మంది ఉత్తరాల ద్వారానూ, ఫోన్ల ద్వారానూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు శాస్త్ర ప్రమాణం ఏమీ లేదు. పెద్దల అనుభవమే ప్రమాణం... కాయగూరలే ఎక్కువ శక్తివంతమైనవని!
కాయగూరల్ని ఇగురు కూరలుగానూ, వేపుడు కూరలుగానూ వండుతుంటారు.

08/17/2019 - 19:46

జీవితం
గొప్ప యుద్ధ క్షేత్రం
పోరాడితేనే
గెలుపు జెండా ఎగిరేది

జీవితం
ఆటుపోటుల కడలి
ఎదురేగితేనే
తుఫానులు తలొగ్గేది

జీవితం
ఆటుపోటుల కడలి
ఎదురేగితేనే
తుఫానులు తలొగ్గేది

జీవితం
సవాళ్ల బరి
దమ్ము చూపెడితేనే
విజయం గులామయ్యేది

జీవితం
ముళ్లబాట
వనమాలివైతేనే
పూలబాట గుబాళించేది

08/17/2019 - 19:43

నల్లని తారురోడ్డు మీద కారు సాఫీగా సాగిపోతోంది. ఆ ప్రయాణం ఎంతవరకూ అలా సాగుతుందో ఎవరికి తెలుసు? కాసేపటికి రోడ్డు మీద గతుకులు రావచ్చు. డ్రైవర్ రెప్పపాటు కునుకు వేస్తే అర్థాంతరంగా అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోవచ్చు. జీవితం అంటే అంతే గదా!

08/17/2019 - 19:36

సంపాదన లేకపోయినా ఇనె్వస్ట్ చేయవచ్చు. ఇదేదో లాటరీ కాదు. లక్కీ స్కీం అంత కన్నా కాదు. ఇది నిజం. జీవితంలో విజయం సాధించే వారు ఆచరించి చూపిన మార్గం. సాధారణంగా 20 వరకు చదువు సాగుతుంది. ఆ తరువాత ఉద్యోగ వేట వెంటనే ఫలిస్తే, 20 నుంచి 25 ఏళ్ల వయసు నుంచి సంపాదన మొదలవుతుంది. ముందు చూపు ఉన్న వారు అప్పటి నుంచి పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌ను ప్రారంభించవచ్చు. ఇది చాలా మంది చేసేదే.

08/17/2019 - 19:35

ధనము దర్పము ధరనేలుతున్నవి
పదవులు పెత్తనములు గుత్తగ జమానా నడిపిస్తున్నవి
నీవు పుట్టినప్పటికి.. నేటికి...
స్వాతంత్య్రమా పరతంత్రవే నీవింకను..
నీవు తెచ్చిన మార్పు లేదు.. ఓదార్పు లేదు
దానికెన్నటికి నీ నుండి
సరైన తీర్పు లేదు.
తెల్లదొరలు చెఱ పెట్టిండ్రు ఆనాడు
నల్లదొరలు నిన్నంగట్లకు నెట్టినారు నేడు
సగటు బడుగు బీదా బిక్కీ దళితుడు

Pages