S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/23/2019 - 17:57

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అవగాహన లేక విద్యుత్ సంస్థలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 71 మెగావాట్ల సోలార్ పవర్ ఉండేదని, అది ఇపుడు 3,600 మెగావాట్లకు పెరిగిందని అన్నారు.

08/23/2019 - 13:54

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టుఅయిన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఇంకా ఊరట లభించలేదు. ఆయన అరెస్టుపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈడీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ సీబీఐ దాఖలు చేసిన కేసును ఈనెల 26కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈడీ నుంచి రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం..

08/23/2019 - 13:54

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందజేయటం, మనీల్యాండరింగ్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ ఆసియా ప‌సిఫిక్ గ్రూపులో ఆ దేశాన్ని బ్లాక్‌లిస్టు చేశారు. ఆస్ట్రేలియాలోని కెన‌బెరాలో ఎఫ్ఏటీఎఫ్ స‌మావేశం రెండు రోజుల పాటు జ‌రిగింది. ఏపీజీ త‌న రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది.

08/23/2019 - 13:53

న్యూఢిల్లీ: కర్ణాటకలో అసమ్మతి ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ మండిపడుతున్నారు. ముంబయి హోటళ్లలో విందులు, వినోదాలతో కాలం గడిపిన ఎమ్మెల్యేలంతా ‘ముంబయి బ్లూ బాయ్స్’ అని ఎద్దేవా చేశారు.

08/23/2019 - 13:51

చెన్నై: ఇస్రో ఛైర్మన్ శివన్‌కు ప్రతిష్టాత్మక అబ్దుల్ కలా అవార్డును బహుకరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చేతులు మీదుగా ఈ అవార్డును శివన్ స్వీకరించారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రతిష్ఠను పెంచుతున్న శివన్‌ను తమిళనాడు సర్కారు ఈ అవార్డకు ఎంపిక చేసింది. చంద్రయాన్ 2తో పాటు ‘సితార’ తదితర ప్రాజెక్టులు శివన్ పర్యవేక్షణలోనే రూపుదిద్దుకున్నాయి.

08/23/2019 - 13:50

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ , రాహుల్ గాంధీ, ఆజాద్ తదితరులు హాజరయ్యారు. గత మూడుసార్లు అసోం నుంచి పోటీ చేసిన ఆయన ఈసారి అక్కడ అవకాశం లేకపోవటంతో రాజస్థాన్ నుంచి పోటీ చేశారు.

08/23/2019 - 13:49

లక్నో: చదువుకునే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలుచేస్తున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భోజనంలో కూర,పప్పు, అరటిపండు, గుడ్డు ఉండేటట్లు మెను కూడా తయారుచేసి అమలుచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో మాత్రం కూరకు బదులు ఉప్పును అందిస్తున్నారు. అన్నం పెడితే అందులో ఉప్పు కలుపుకుని తినాలి.

08/23/2019 - 13:46

న్యూఢిల్లీ: త్రిపుల్ తలాక్ చట్టంపై పరిశీలన చేస్తామని, తగిన వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈమేరకు జస్టిస్ ఎస్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తలాక్ బిల్లు చట్టబద్ధతపై పరిశీలన చేస్తామని పేర్కొంది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షిద్‌కు ధర్మాసనం తెలిపింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ ధర్మాసనం కేంద్రాన్ని కోరింది.

08/23/2019 - 13:46

చెన్నై: తమిళనాడులో హై అలెర్ట్ ప్రకటించారు. శ్రీలంక తీరం నుంచి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు ప్రవేశించారని ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించారని, వీరు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై, తమిళనాడు, కొయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయి.

08/23/2019 - 13:44

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో విషాదం నెలకొన్నది. నార్త్ 24 పరగణాల జిల్లా కచువాలో కృష్ణజన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుని నలుగురు మృతిచెందారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తుల హాజరయ్యారు. దీంతో దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనపై సీఎం మమతాబెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని అందజేశారు.

Pages