S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 02:43

హైదరాబాద్, ఆగస్టు 28: గీతం ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఇ విద్యార్థిని మానస జొన్నలగడ్డ మిస్ అండ్ మిసెస్ ఇండియా ఏషియా పసిఫిక్ -2017 టైటిల్ విజేతగా నిలిచినట్టు గీతం వర్శిటీ ప్రొ వైస్ ఛాన్సలర్ ఎన్ శివప్రసాద్ చెప్పారు.

08/29/2017 - 02:35

షాద్‌నగర్ టౌన్: డిండి ఆయకట్టు ఎత్తు పెంచి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వకుండా డిండి ఆయకట్టు ఎత్తు పెంచి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వడంలో అంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు.

08/29/2017 - 02:33

హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమంలో వచ్చే ప్రతి పిటిషన్‌ను వెబ్‌సైట్‌లో పెట్టాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. అంతేగాక, వచ్చిన ప్రతి పిటిషన్‌ను ఏడురోజుల్లో పరిష్కరించాలన్నారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

08/29/2017 - 02:33

హైదరాబాద్: రానున్న కొత్త సంవత్సరానికల్లా నగరంలోని వీధులు, రోడ్లన్నీ ఎల్‌ఇడి వెలుగులతో నిండనున్నాయి. అంతేగాక, పెద్ద ఎత్తున ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేయటంలో దేశంలోనే జిహెచ్‌ఎంసి మొదటి స్థానంలో నిలిచింది. నగరంలో సుమారు 4.54లక్షల వీది దీపాలు, వీటి నిర్వహణకు ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించటమే గాక, నెలకు విద్యుత్ బిల్లులను సైతం బల్దియా కోట్లలో భరిస్తోంది.

08/29/2017 - 02:32

శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కిలోన్నర బంగారాన్ని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు కౌలాలంపూర్ నుంచి ఒక్కరు కలిసి సోమవారం తెల్లవారుఝామున శంషాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

08/29/2017 - 02:32

హైదరాబాద్: సాధారణంగా ఒకరు వినియోగించి పక్కన పారేసే వస్తువులు ఇతరులకు ఎంతో అవసరంగా మారుతాయి. అంతేగాక, మన నిత్యం జీవితంలో వినియోగించే పుస్తకాలు, దుస్తులు, బూట్లు, స్వెట్టర్లు వంతి ఇతరాత్ర సామాగ్రిని వినియోగించిన తర్వాత రోడ్డుపై ఇష్టారాజ్యంగా పారవేయకుండా ఓ పద్దతి ప్రకారం అవి అవసరమున్న వారికి అందించేందుకు జిహెచ్‌ఎంసి ప్రారంభించిన ‘వాల్ ఆఫ్ కైండ్‌నెస్’ సేవా కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది.

08/29/2017 - 02:25

న్యూఢిల్లీ, ఆగస్టు 28: చైనాలో సెప్టెంబర్ మూడు నుండి జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బాయికాట్ చేసేందుకు సిద్ధపడినందుకే డోక్లామ్ నుండి తమ సైన్యాలను ఉపసంహరించుకునేందుకు చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా సభ్యులుగా ఉన్న బ్రిక్స్ దేశాల అధినాయకుల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ మూడు నుండి మూడు రోజులపాటు జరుగుతుంది.

08/29/2017 - 02:25

న్యూఢిల్లీ, ఆగస్టు 28: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపు కేసు విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు సోమవారం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదికను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

08/29/2017 - 02:24

లక్నో, ఆగస్టు 28: మతం పేరుతో హింసను సహించేది లేదని, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను బిఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేస్తూ డేరా సచ్చాసౌదా అనుయాయులు హింసాకాండకు పాల్పడిన తర్వాత హర్యానా ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రశ్నించారు.

08/29/2017 - 02:24

చండీగఢ్, ఆగస్టు 28: పదిహేనేళ్ల నాటి జంట మానభంగాల కేసులో డేరా సచ్చా అధినేత గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన వారసుడిగా కొడుకు జస్మీత్ ఇన్సాన్ నియమితులయ్యారు. గుర్మీత్ వారసుడెవరన్న దానిపై సోమవారం విస్తృత స్థాయిలో ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఆయన తల్లి నసీబ్ కౌర్ ఈ నిర్ణయం ప్రకటించారు. గుర్మీత్ కుమారుడు, తన మనవడైన ఇన్సాన్‌కు ఈ పదవి కట్టబెట్టారు.

Pages