S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2017 - 00:12

అమరావతి, మే 1: రానున్న ఎన్నికల్లో మెజారిటీ పార్లమెంటు, దానితోపాటు అధిక సంఖ్యలో శాసనసభ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిల వ్యవస్థ మంత్రులను పరుగులు పెట్టిస్తోంది.

05/02/2017 - 00:12

విజయవాడ, మే 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. అవినీతిని అదుపులో ఉంచాలని.. ఇందుకోసం స్పెషల్ కోర్ట్స్ యాక్ట్‌ను రూపొందించాలన్నారు.

05/02/2017 - 00:09

ఎర్రగుంట్ల,మే 1: రాయలసీమ థర్మల్‌పవర్ ప్రాజెక్టుకు 2017 సంవత్సరానికి గాను బెస్ట్‌మేనేజ్‌మెంట్ అవార్డు లభించింది. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడ కనె్వన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ చేతులమీదుగా ఆర్టీపీపీ సిఇఓ శ్రీరాములు ఈ అవార్డును అందుకున్నారు.

05/02/2017 - 00:08

కడప,మే 1: జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని నీటి ఎద్దడి నివారణకు నిధుల కొరత లేదని సంబంధిత అధికారులు, సంబంధిత సిబ్బంది గ్రామాలకు వెళ్లి నీటి సమస్య పరిష్కరించాలని, ప్రస్తుతం రూ.21కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డిలు సోమవారం ఆర్‌అండ్‌బిలో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు.

05/02/2017 - 00:08

జమ్మలమడుగు, మే 1: వేసవి సెలవులకు ముందే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం చాలా కసరత్తుచేసింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అభిప్రాయాలను తీసుకుంది. అయితే సంఘాలతో చర్చలు జరిపినా ప్రక్రియపై ఇప్పటికీ సరైనస్పష్టత రాలేదు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన నెలకొంది.

05/02/2017 - 00:07

వల్లూరు,మే 1: పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం హరిహరుల రథోత్సవం అత్యంత వైభవంగా భక్తుల హరిహరనామస్మరణలతో జరిగింది. సోమవారం మొదటగా క్షేత్రాధిపతి అయిన వైద్యనాదేశ్వరునికి రథోత్సవాన్ని పీఠాధిపతి ప్రత్యేకపూజలు నిర్వహించి ప్రారంభించారు. కామాక్షిమాత సమేతుడైన శ్రీవైద్యనాదేశ్వరస్వామివారు పురవీధుల్లో ఊరేగారు.

05/02/2017 - 00:07

కడప,మే 1: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దూకుడుకు కళ్లెం వేసి కడప జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని టిడిపి అధిష్ఠానం ఇప్పటినుంచే కరసత్తు చేపట్టింది. ఇందుకు నియోజకవర్గాల వారీగా నేతల పనితీరు, బలాబలాలపై నివేదికలు సిద్ధమవుతున్నాయి.

05/02/2017 - 00:05

ఏలూరు, మే 1 : జిల్లాలో ప్రజా సంక్షేమానికి, వారికి సేవలందించేందుకు ఎంతగానో కష్టపడుతున్నామని, ఈ పరిస్థితుల్లో 53 శాతం మంది పాలనపై సంతృప్తితో వున్నట్లు ఇటీవల ఒక సర్వేలో తేలిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. అయితే దీన్ని 80 శాతానికి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఎంత కష్టపడినా కొంతమంది చేస్తున్న అవినీతి చేటు తెస్తోందని పేర్కొన్నారు.

05/02/2017 - 00:05

చింతలపూడి, మే 1: చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో పిడుగుపడి విద్యార్థి మృతిచెందాడు. తగరం దిలీప్ (14) మొక్కజొన్న తోటలో పనిచేస్తుండగా సోమవారం మధ్యాహ్నం పిడుగు పడడంతో మృతిచెందాడు. అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామానికి చెందిన దిలీప్ తన తల్లితో కలసి అమ్మమ్మగారి ఊరైన యర్రంపల్లి వచ్చాడు.

05/02/2017 - 00:04

తాడేపల్లిగూడెం, మే 1: సాగు, తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్, తాడిపూడి కాలువ పనులపై సమీక్ష నిర్వహించారు.

Pages