S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2017 - 00:03

ఏలూరు, మే 1: జిల్లాలో ఎక్కడా ఎవరి విగ్రహాలు పెట్టడానికి వీలులేదని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం మీకోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పాలకోడేరు మండలం నుండి కొంతమంది కలెక్టరుకు వినతిపత్రం సమర్పిస్తూ తమ నాయకుల విగ్రహాలు ఏర్పటుచేసుకుంటామని, అనుమతి ఇవ్వాలని కోరారు.

05/02/2017 - 00:03

తాడేపల్లిగూడెం, మే 1: మట్టి మాఫియాను అడ్డుకోకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు సంబంధం లేకపోయినా మట్టి మాఫియాతో ఘర్షణలు నెలకొనడంపై సిఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. గ్రామాల్లో చెరువులు 20 నుంచి 25 అడుగుల లోతుకు తవ్వడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

05/02/2017 - 00:01

పాతశ్రీకాకుళం, మే1: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. సోమవారం కార్యక్రమంలో 17మంది ఫోన్‌చేసి సమస్యలను తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జెసి-2 పి.రజనీకాంతారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కిషోర్‌కుమార్ నిర్వహించారు. ఇందులో వంగర జెడ్పిటిసి బొత్స వాసుదేవనాయుడు ఉన్నారు.

05/02/2017 - 00:01

సారవకోట, మే 1: గడచిన ఐదేళ్ల కంటే ప్రస్తుత వేసవిలో ఎండ వేడిమి అధికంగా ఉండటంవలన ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఇండ్ల నుండి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితులు అనివార్య కారణాల ఉంటే తప్ప ప్రయాణాలు చేయడానికి ప్రజలు సాహసించడం లేదు. నిరంతరం జనసందోహంతో కళకళలాడే వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

05/02/2017 - 00:00

పాతశ్రీకాకుళం, మే 1: గ్రీవెన్స్ విభాగానికి పలు వినతులు వచ్చాయి. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ముందుగా ఆమదాలవలస మండలం నుండి మెరక ఆదినారాయణ కొత్తవలసలో రోడ్డు ఇరువైపులా మామిడి, కొబ్బరి మొక్కలు పచ్చతోరణం పథకం కింద పెంచినందున 2016 మే నుండి వేతనం మంజూరు చేయాలని కోరారు.

05/01/2017 - 23:59

ఎచ్చెర్ల, మే 1: ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా వైఫల్యం చెందారని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ,గురువారం బూత్‌కమిటీల సమావేశాలు నిర్వహించడంలో భాగంగా మండలంలోని తమ్మినాయుడుపేట, పూడివలస కమిటీలతో సమావేశం నిర్వహించారు.

05/01/2017 - 23:59

ఎచ్చెర్ల, మే 1: ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రాప్తికి అంబేద్కర్ వర్శిటీలో ఖాళీగా ఉన్న 48 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.తులసీరావు స్పష్టంచేశారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నోటిఫికేషన్ ప్రాప్తికే వివిధ విభాగాల్లో మిగిలి ఉన్న అధ్యాపక పోస్టులను విలీనం చేసి ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు.

05/01/2017 - 23:58

విజయనగరం, మే 1: సమాజంలో అందరు విద్యావంతులు కావాలని విద్యాలయాలను స్థాపించిన ఘనత పివిజిదేనని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. సోమవారం విజయనగరం మహారాజు పూసపాటి విజయరామ గజపతిరాజు (పివిజి) 94వ జయంతి వేడుకలను కోటలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేరీర్ గైడెన్స్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎయు వైస్ ఛాన్సలర్ జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

05/01/2017 - 23:57

గజపతినగరం, మే 1: కార్మికుల హక్కుల పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని సిపిఐ అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం గజపతినగరంలో 131వ మే డే వేడుకలను సిపిఐ, సిపిఎం నాయకులు ఘనంగా నిర్వహించారు. గజపతినగరం నాలుగు రోడ్లు జంక్షన్‌లో గల ఎఐటియుసి పతాకాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పలనాయుడు ఆవిష్కరించారు.

05/01/2017 - 23:56

విజయనగరం(టౌన్), మే 1: ప్రతి సోమవారం కలెక్టరు కార్యాలయంలో నిర్వహించే మీకోసం గ్రీవెన్స్‌కు పలు సమస్యలపై అర్జీలు అందాయి. ఎజెసి నాగేశ్వరరావు, డి ఆర్ ఒ జితేంద్రలు వినతులు స్వీకరించారు. వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతులకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంఘం నాయకులు యుటి ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషగిరి ఆధ్వర్యంలో మీకోసంలో వినతిపత్రం అందచేసారు.

Pages