S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/12/2016 - 23:42

ఆదిలాబాద్, మే 12: వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం చేయూతనివ్వాలని, పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా సమస్యలపై ఢిల్లీకి వెళ్ళిన మంత్రులు స్థానిక ఎంపి గెడం నగేష్‌తో కలిసి ముందుగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంతగితేతో జిల్లా సమస్యలపై చర్చించారు.

05/12/2016 - 23:42

నిర్మల్, మే 12: నిర్మల్ వ్యవసాయ డివిజన్ పరిధిలో 2016-17 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ ప్రణాళికలు అధికారులు సిద్దం చేశారు. డివిజన్ పరిధిలోని నిర్మల్, దిలావర్‌పూర్, సారంగాపూర్, కుంటాల మండలాల్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, సోయాబీన్, పసుపు, పత్తి, జొన్న, నువ్వులు, పప్పు దినుసులు, సన్‌ఫ్లవర్, ఇతర కూరగాయల పంటలను ఎక్కువగా సాగుచేస్తారు.

05/12/2016 - 23:41

సిర్పూర్(టి), మే 12: సిర్పూర్‌టి మండలంలోని టోంకిని సమీపంలో పెన్‌గంగాలో భర్త విడాకులు ఇవ్వడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్‌కు చెందిన మోర్లె అనిత (38) ఆమె భర్త మోర్లె సురేష్ విడాకులు ఇవ్వడంతో మనస్థాపం చెందిన ఆమె మంగళవారం టోంకిని సమీపంలోని పెన్‌గంగాలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

05/12/2016 - 23:39

ఒక రాష్ట్రంలో విధించిన రాష్టప్రతి పాలనను కేవలం రెండు గంటల పాటు తొలగించడం విచిత్రమైన రాజ్యాంగ పరిణామం. మే 10న ఉత్తరఖండ్‌లో ఇలా తొలగించడం సర్వోన్నత న్యాయస్థానం మేనెల ఆరవ తేదీన ఇచ్చిన తీర్పు ఫలితం విచిత్రంకావచ్చు గాక, వినూతన ప్రజాస్వామ్యపు సంప్రదాయాలు అంకురిస్తుండడం నిరంతర రాజ్యాంగపు పరిణామ ప్రగతికి చిహ్నం.

05/12/2016 - 23:36

స్వతంత్ర భారతదేశంలో విలక్షణమైన రాజకీయ, ఆర్థిక సైద్ధాంతిక భూమిక ఏర్పడటం కోసం విశేషంగా పోరాడిన, కోట్లాది మంది యువతను దేశభక్తి భావనతో ఉర్రూతలూగించిన, నేడు ఢిల్లీలో అధికారంలో ఉండిన భారతీయ జనతాపార్టీకి సైద్ధాంతిక పునాది ఏర్పరచిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు ఆచార్య బలరాజ్ మధోక్ మే 2న ఢిల్లీలో మృతి చెందారు.

05/12/2016 - 23:34

వేదాలకు విద్యారణ్య భాష్యాన్ని ప్రసాదించి, దేశభక్తిని ప్రజ్వరింపజేసి, అనైక్యతను పారద్రోలి, నిర్వీర్యులైన దేశ నాయకులందరినీ కలిపి ఒక రాజకీయ శక్తిగా నడిపించిన రాజనీతి దురంధరుడు, పరిపూర్ణ వేదవిజ్ఞాన సిద్ధుడు, మాధవ మంత్రి అయిన శ్రీ విద్యారణ్యస్వామి.

05/12/2016 - 23:30

మన దేశంలోని అన్ని నగరాలలో, పట్టణాలలో జన సమ్మర్ధమైన ప్రాంతాలలో, రహదారి రోడ్లపైన వివిధ రకాలైన మతపరమైన కట్టడాలు, అడ్డంగా తిష్ఠవేసి ఉంటాయి. వీటిలో మందిరాలు, గురుద్వారాలు, సమాధులు, చర్చిలు, మసీదులు ఉన్నాయి. నేటి ఆధునిక సమాజంలోని ప్రజలు ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితాలకు అలవాటై దూర ప్రాంతాలకు ప్రయాణించి ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకొంటున్నారు.

05/12/2016 - 23:29

నాగరిక సమాజం ఈ భూమిపై వర్ధిల్లుతున్న నాటినుండి హిందు మతం ప్రాచుర్యంలో వుంది. హిందు మతం అనేది ఒక మతం కంటే మానవుల శాస్తబ్రద్ధ జీవిత విధానం అంటే సమంజసంగా వుంటుంది. హిందు మతంలో వున్న అనేక సత్సంప్రదాయాలు, నియమావళి నుండి రూపురేఖలు మార్చుకొని అనేక ఇతర మతాలు ఉద్భవించాయి.

05/12/2016 - 23:23

నిజామాబాద్, మే 12: రాష్ట్రంలో కాంట్రాక్టు వెట్టిచాకిరీ ఉండకూడదంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను చేర్చి మంత్రివర్గంలో తీర్మానం చేసే వరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవ చూపినప్పటికీ, క్షేత్ర స్థాయిలోని ప్రభుత్వ శాఖల అధికారులు మాత్రం క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేసే విషయంలో అలసత్వ వైఖరిని అవలంబిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

05/12/2016 - 23:22

నవీపేట, మే 12: నవీపేట మండలంలోని పోతంగల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. ఈ గ్రామాన్ని ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త దత్తత తీసుకుని వసతుల కల్పనకు చొరవ చూపడంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మరింత తోడ్పాటును అందించేందుకు వీలుగా కలెక్టర్ గురువారం పోతంగల్ గ్రామాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో భేటీ అయ్యారు.

Pages