S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2017 - 04:26

సింహాచలం, ఏప్రిల్ 30, చందనోత్సవం సందర్భంగా శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి నిజరూపం పై విసర్జించిన శ్రీగంధం సుమారు 101 కిలోలు వచ్చిందని దేవస్థానం అధికారులు తెలియజేసారు. అర్చకులు అప్పగించిన చందనాన్ని తూకం వేసి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విసర్జిత గంధం లెక్కల పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈవో ప్రత్యేకంగా కమిటీ వేసి గంధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

05/01/2017 - 04:24

ఆదిలాబాద్, ఏప్రిల్ 30: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాండగడ గ్రామంలో శనివారం అర్ధరాత్రి గాలిదుమారానికి భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది ఇండ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భీకరమైన గాలులు వీయగా గ్రామ చివరిలోని ఓ చేనులో నుండి మంటలు ఎగిసిపడి ఇండ్లకు వ్యాపించాయి. గాడనిద్రలో ఉన్న గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

05/01/2017 - 04:22

నిజామాబాద్, ఏప్రిల్ 30: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తోందని బిజెపి నేత నాగం జనార్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీల సభ్యులను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తున్నారని అన్నారు.

05/01/2017 - 04:20

సిద్దిపేట, ఏప్రిల్ 30 : ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్, పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమర్‌రెడ్డికి సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుండి ఘన స్వాగతం లభించింది.

05/01/2017 - 04:18

సిరిసిల్ల, ఏప్రిల్ 30: ప్రభుత్వం మంజూరు చేసిన 24 సబ్సిడి ట్రాక్టర్లు అధికార టిఆర్‌ఎస్ పార్టీ నాయకులే హస్తగతం చేసుకుని, అర్హులైన రైతులకు, నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సిరిసిల్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపిటిసి సభ్యుడు సూర దేవరాజ్ నిరసన తెలిపి బైటాయించారు. ఆదివారం సిరిసిల్ల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపిపి జూపెల్లి శ్రీలత అధ్యక్షతన జరిగింది.

05/01/2017 - 04:16

వరంగల్, ఏప్రిల్ 30: జన జాతర మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరకు తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 31, ఫిబవ్రరి 1,2,3 తేదీలలో మేడారం జాతర నిర్వహించాలని పూజారులు తేదీలు ఖరారు చేసారు. 31వ తేదీన సారాలమ్మ గద్దెకు చేరుకోవటం, ఫిబ్రవరి ఒకటిన సమ్మక్క గద్దెపైకి రావటం, రెండవ తేదీ జాతర, మూడవ తేదీ దేవతల వనప్రవేశంగా తేదీలను నిర్ణయించారు.

05/01/2017 - 04:13

తాండూరు, ఏప్రిల్ 30: ఉద్యమ పార్టీగా భావించి రాష్ట్ర ప్రజలు టిఆర్‌ఎస్‌ని ఆదరించి అధికారంలోకి తెచ్చారని తెలంగాణ జెఎసి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం తాండూరులో నిర్వహించిన విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా మహాసభలో కోదండరాం పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో నేడు బాధాకరమైన దినం అన్నారు.

05/01/2017 - 04:11

తాండూరు, ఏప్రిల్ 30: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పరిపాలన సాగించాలని తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని తులసీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లా విద్యావంతుల ఐక్యవేదిక మహాసభకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ ఉద్యమ పోరాటల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.

05/01/2017 - 04:10

హైదరాబాద్, ఏప్రిల్ 30: హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు రోజు రోజుకీ కుంచించుకుపోతున్నాయి. దీంతో వాటి విస్తీర్ణం క్రమేణా తగ్గిపోతోందని ఒక అధ్యయన నివేదిక వెల్లడించింది. 1978 నుంచి 2013 వరకు ఇవన్నీ దాదాపు 40 శాతం విస్తీర్ణం తగ్గిపోయిందని స్పష్టం చేసింది.

05/01/2017 - 04:09

కీసర, ఏప్రిల్ 30: లక్షలు వెచ్చించి అన్నరాయని చెరువు మరమ్మతులు చేపట్టినా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. నాగారం గ్రామంలోని అన్నరాయని చెరువును మిషన్ కాకతీయ రెండో ఫేజ్ క్రింద 65 లక్షలు మంజూరు చేయటం జరిగింది. గుత్తేదారు కేవలం చెరువుకట్ట మాత్రమే వెడల్పు చేసి చేతులు దులుపుకున్నాడు. చెరువులో పూడికతీత ద్వారా తీసిన మట్టిని చెరువుకట్టకోసం ఉపయోగించాలి.

Pages