S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2017 - 04:09

జీడిమెట్ల, ఏప్రిల్ 30: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోల్ దందా జోరుగా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. యథేచ్ఛగా పెట్రోల్‌లో తెలుపు రంగు కిరోసిన్, ఎథలిన్ (స్పిరిట్) కెమికల్ ఆయిల్‌ను కలిపి యథేశ్చగా దందాను కొనసాగిస్తున్నారు. వాహనాలు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా పెట్రోల్‌ను వాడాల్సిందే.

05/01/2017 - 04:07

మేడ్చల్, ఏప్రిల్ 30: ఐక్య కార్యచరణ కమిటీ (జెఎసి) మేడ్చల్ జిల్లా కన్వీనర్ నాగుర్ల సంజీవరావు గుడ్‌బై చెప్పారు. ఆదివారం రాజీనామా చేశారు. మేడ్చల్ విలేఖరుల సమావేశంలో సంజీవరావు మాట్లాడుతూ జెఎసి ఆవిర్భావం నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగం కన్వీనర్‌గా ప్రస్తుతం మేడ్చల్ జిల్లా జెఎసి కన్వీనర్‌గా సంజీవరావు తన సేవలను అందించానని అన్నారు.

05/01/2017 - 04:06

ఖైరతాబాద్, ఏప్రిల్ 30: నాణ్యమైన నడవడికను నేర్పేదే ఆధ్యాత్మికత అని త్వాతిక జ్ఞాని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ఆదివారం మధురానగర్‌లో ఉన్న శ్రీసాగి రామకృష్ణం రాజు కమ్యూనిటీ హాల్‌లో స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైశాఖ మాస జ్ఞాన చైతన్య కసదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలిషా అధ్యక్షత వహించారు.

05/01/2017 - 04:05

కొందుర్గు, ఏప్రిల్ 30: తెలంగాణలో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు.

05/01/2017 - 03:58

హైదరాబాద్, ఏప్రిల్ 30: కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లు రూ. 1000 రూ. 500ల హైదరాబాద్‌లో ఇంకా పట్టుబడుతున్నాయి. పెద్ద నోట్లు రద్దయి ఐదు నెలలు గడిచినా హైదరాబాద్‌లో కొన్ని ముఠాలు రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి ఇంకా కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్, సికిందరాబాద్‌లో రద్దయిన పాత నోట్ల మార్పిడికి పాల్లడుతోన్న 8 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

05/01/2017 - 03:56

హైదరాబాద్/శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30: హైదరాబాద్ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో ఆదివారం వెలుగుచూసింది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వేములపల్లి వినీలకు, హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ జయసింహతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. కాగా వీరికి ఇద్దరు నాలుగేళ్లు, మూడేళ్ళు సంతానం.

05/01/2017 - 03:54

హైదరాబాద్, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నదని టి. జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఆరోపించారు. భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్ (సేవ్ ధర్నా చౌక్ శిబిరం)లో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి ప్రొఫెసర్ కోదండరామ్ హాజరై మద్దతు ప్రకటించారు.

05/01/2017 - 03:53

గజ్వేల్, ఏప్రిల్ 30: రాజ్యాంగం కల్పించిన హక్కులను సిఎం కెసిఆర్ కాల రాస్తున్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్ జి ల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఏఐసిసి నేత దిగ్విజయ్‌సింగ్‌తో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు.

05/01/2017 - 03:42

నూజెండ్ల, ఏప్రిల్ 30: అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్ భూసేకరణ సర్వేను ఆదివారం గుంటూరు జిల్లా నూజెండ్ల మండల రైతులు అడ్డుకున్నారు. నూజెండ్లలోని జెమిని పాల కేంద్రం సమీపంలో ఎక్స్‌ప్రెస్ హైవే అధికారుల బృందం భూములు సర్వే చేస్తున్నారనే సమాచారంతో సుమారు 200 మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సర్వే ఆపాలని అధికారుల బృందానికి హెచ్చరికలు చేశారు.

05/01/2017 - 03:40

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 30 : వేమన సాహిత్యం తెలుగు ప్రజలకు తరగని సంపద అని, తెలుగు జాతికి కీర్తి, స్ఫూర్తినింపిన కవియుగ చక్రవర్తి వేమన అని ప్రముఖ సాహితీ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ‘ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన సదస్సు’ నిర్వహించారు.

Pages