S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2017 - 03:38

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 30: సాంస్కృతిక ప్రాచీన ప్రాశస్థ్యం కలిగిన చారిత్రక రాజమహేంద్రవరం గోదావరి తీరం కళాకారులతో కోలాహలంగా మారింది. రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం కందుకూరి నాటక రంగస్థల పురస్కారాలు, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, నంది నాటకోత్సవ బహుమతుల ప్రదానోత్సవంగా వైభవంగా జరిగింది.

05/01/2017 - 03:21

కోచి, ఏప్రిల్ 30: ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రి మండలిలోని ఎవరినయినా విచారణకు పిలిచే అధికారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి)కి ఉందని ఆ కమిటీ చైర్మన్ కెవి థామస్ ఆదివారం పునరుద్ఘాటించారు.

05/01/2017 - 03:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఆదివారం రాత్రి ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సోమవారం భేటీ అవుతారు. అణు ఇంధన సరఫరా దేశాల బృందంలో భారత సభ్యత్వం, కౌంటర్ టెర్రరిజం, వ్యాపార వాణిజ్య సహకారంపై ఇద్దరు నేతలు చర్చిస్తారు.

05/01/2017 - 03:18

సియోల్, ఏప్రిల్ 30: అమెరికాతోపాటు దాని మిత్ర దేశమైన కొరియా భారీస్థాయిలో నిర్వహించిన వార్షిక సైనిక విన్యాసాలను ఆదివారం ముగించాయి. అయితే ఈ ఇరు దేశాలు ప్రత్యేకంగా సంయుక్త నావికాదళ విన్యాసాలను కొనసాగిస్తుండటంతో ఉత్తర కొరియా తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

05/01/2017 - 03:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ముంబయి-గోవా మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులు త్వరలో సకల సదుపాయాలు అనుభవించనున్నారు. సాధారణంగా విమానాల్లో లభించే సెలబ్రిటీ చెఫ్‌లు వండిన ఆహారం, టీ, కాఫీ వెండింగ్ మిషన్లు, వ్యక్తిగత ఎల్‌సిడి టీవీలు లాంటివి ఇకపై ఈ మార్గంలోని రైల్లో ప్రయాణికులకు లభించనున్నాయి.

05/01/2017 - 03:10

గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 30: పిన్న వయస్సులోనే తన తపో, ధ్యాన, జ్ఞానశక్తిని సమస్త మానవాళి కోసం ధారపోసి, ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకన రెండు పర్యాయాలకు పైగా పర్యటించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతం మన ప్రాచీన హైందవ సనాతన ధర్మానికి దేదీప్యమానంగా వెలిగే దీపస్తంభమని విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి శ్లాఘించారు.

05/01/2017 - 03:06

విజయవాడ, ఏప్రిల్ 30: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ జీవుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని సిఎం గుర్తుచేశారు. శ్రమ సంస్కృతిని ప్రతి ఒక్కరు గౌరవించాలని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి తను శ్రమనే నమ్ముకున్నానని తెలిపారు.

05/01/2017 - 03:05

గుంటూరు, ఏప్రిల్ 30: ఒకపక్క కరవుతో అల్లాడుతూ, మరోపక్క గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి సమస్యలను గాలికొదిలేసి మందీమార్బలాన్ని వెంటేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేయటం ఎంతవరకు సమంజసమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆక్షేపించారు.

05/01/2017 - 03:04

అమరావతి, ఏప్రిల్ 30: ప్రభుత్వంలో ఐదుగురు సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ యువనేత లోకేష్ నెంబర్-టూగా రూపాంతరం చెందుతున్నారు. వివిధ శాఖలతో ముడిపడిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చినబాబును తెలంగాణ మంత్రి కెటిఆర్ మాదిరిగా ఆ స్థానానికి చేర్చేందుకు దోహదపడుతోంది. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేష్ ఇప్పటివరకూ వరుసగా నిర్వహిస్తున్న సమీక్షల వివరాలేమీ బయటకు రావడం లేదు.

05/01/2017 - 02:58

హైదరాబాద్, ఏప్రిల్ 30: భూ సేకరణ బిల్లుపై రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయటపెడుతోందని మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

Pages