S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2020 - 01:04

న్యూఢిల్లీ/ముంబయి: ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కరోనా వైరస్‌పై యావత్ భారతావని రణన్నినాదం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు జనంలో అనూహ్యమైన, అసాధారణమైన ప్రతిస్పందనకు దారి తీసింది. జనం అంతా ఒక్కటిగా కరోనాను దరి చేరనివ్వమం టూ ఇళ్ళకే పరిమితమై ఓ ఆదర్శనీయ సందేశాన్ని అందించారు. వ్యక్తుల మధ్య సామాజిక దూరాన్ని పాటించాలన్న సందేశాన్ని త్రికరణ శుద్ధిగా పాటించారు.

03/22/2020 - 23:51

పిల్లలకు ఫిబ్రవరి నుండే పరీక్షల భయం పట్టుకుంటుంది. పరీక్షలు వస్తున్నాయనగానే మనసులో టెన్షన్ మొదలవుతుంది. అటు విద్యార్థులలోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ పరీక్షలనేవి ఎల్లప్పుడూ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయమే పరీక్షలు. భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది.

03/22/2020 - 23:50

మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ.. రాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ.. అంటూ స్ర్తిని పొగుడుతాము. ఇంకా ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహిళల్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటాము. ఇంకా గొప్పగా చెప్పాలంటే, కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ, అపురూపమైనదమ్మ ఆడజమ్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ- అంటూ మనం ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలకు రకరకాల కాంప్లిమెంట్లు ఇస్తుంటాం.

03/22/2020 - 23:40

కరోనా వైరస్ మరణాలు, దాని తీవ్రత తెలిసినప్పటి నుంచి అందరిలో ఆందోళన మొదలైంది.
షేక్‌హాండ్ ఇవ్వాలంటే భయభ్రాంతులవుతున్నారు. దేనిని ముట్టాలన్నా ఆలోచిస్తున్నారు.
సాంఘిక దూరం (సోషల్ డిస్టెన్స్) మనుషుల మధ్య మొదలైంది.
ఎవరికి వాళ్లు శుభ్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు.

03/22/2020 - 23:38

ఈ మధ్య ఓ కథ చదివాను. అవకాశాల గురించి చెప్పిన కథ ఇది. నాకు బాగా నచ్చింది. అది మీ కోసం-
ఓ ఊర్లో వున్న ఓ లైబ్రరీ అగ్ని ప్రమాదానికి గురైంది. దాదాపు అన్ని పుస్తకాలు కాలి బూడిదగా మారిపోయాయి. ఓ నాలుగైదు పుస్తకాలు అలా మిగిలిపోయాయి. అవి పెద్ద విలువైనవి కాదని వాటిని అక్కడ దగ్గర్లో పడేసి వెళ్లిపోయాడు లైబ్రేరియన్.

03/22/2020 - 23:34

కిష్కింధకాండ
*
శ్రీరాముడిని
దూషించిన వాలి
*

03/22/2020 - 23:29

‘కాలగర్భం - ఇవాల్టి ఇంటర్‌నెట్ కన్నా ఫెద్దది, గొప్పది. సన్నివేశాలు, సంఘటనలు ఇవన్నీ అందులోకి ఎన్నైనా వెళ్లిపోతాయి. గానీ వాటిని అక్కణ్నుంచి ఇవతలికి తీసుకురావడం అన్నది బిడ్డని కనడానికి తల్లి పడే ప్రసవ వేదనలాంటిది. అమ్మ కడుపులోంచి ఈ నేల మీద పడుతున్నప్పుడు అమ్మ పడే వేదన లాంటిదే శిశువుకి కూడా కలుగుతుంది. కానీ అదేదో చెప్పలేదా శిశువు..

03/22/2020 - 23:27

చిగురాకుల ఎలకోయిల స్వరం తప్పి పాడింది
గుబురాకుల గువ్వపిట్ట పొదచాటుకు చేరింది
పచ్చపచ్చని పైరులపై పిచ్చుకమ్మ బిక్కచచ్చి నక్కింది
నెమలిబాల స్తంభించి గతి తప్పింది నృత్యహేల
మొన్న లేదు నిన్న లేదు నేడెందుకు చిన్నబోయె నీ వదనం
మాయమాయె గుండె గొంతుకలనేకం చేయు నీ హసనం
ఎందులకీ నైరాశ్యం.. ఏమిటి ఈ వైఫల్యం.. ఏం జరిగిందని
ఈ వైరాగ్యం.. ఏమయ్యిందని ఈ వైవిధ్యం

03/22/2020 - 23:22

ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం మారింది. ఎవరూ ఉత్తరాలు రాసుకోవడం లేదు. అందుకు బదులుగా ఈమెయిల్, ఈ మధ్యన వాట్సాప్ ఇలాంటివి అందరూ విరివిగా వాడుకున్నారు. చేతిరాత చేతకాకుండా అయింది. తెలుగు కూడా టైప్ చేయనవసరం లేకుండా చెపితే విని రాసే వెసులుబాటు వచ్చింది. ఇక పాట, సినిమాల గురించి చెప్పనవసరమే లేదు. ఎక్కడ చూసినా అన్ని రకాల మనుషులు పాట వింటూ, లేదా వీడియో చూస్తూ కూర్చుని ఉండడం కనిపిస్తున్నది.

03/22/2020 - 23:18

మత్త॥ పట్టుబట్టి ప్రసూన పల్లవ పావడంబులు గట్టుచున్
పట్టరాని పరీమళంబును ప్రాణి కోటికి పంచుచున్
అట్టహాసముతో నటించుచు హాయి హాయిగ నూగుచున్
చెట్టుచేమలు చూడ నెంతగ చెన్ను మీరెను సృష్టలోన్

Pages