S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2017 - 01:35

పంచాంగాల పట్ల సామాన్య జనానికి వున్న గందరగోళాన్ని నివృత్తి చేయాల్సి వుంది. మన ఆంధ్రదేశంలో 4 రకాల పంచాంగాలు బజారులో లభ్యమవుతున్నాయి. ఒకటి- ఆనాడు సూర్య సిద్ధాంతంలో చెప్పిన నేటి కాలానుగుణంగా మార్చకుండా చేస్తున్న గణిత సంబంధాన్ని పూర్వ పద్ధతి పంచాంగం అంటారు. ఇది శ్రీశైలంవారి ద్వారా విడుదల అవుతోంది.

03/23/2017 - 01:34

హేమలంబ ఉగాది పర్వదినము జరుపుకొనేందుకు కొంతమంది సిద్ధాంతులు అవగాహనా రాహిత్యంతో, తప్పుడు నిర్ణయాలతో ప్రజలను గందరగోళపరుస్తున్నారు. తిథి, నక్షత్రాన్ని అనుసరించి పండుగల నిర్ణయం చేస్తారు. దీన్ని అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ, ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ వివరించారు. ఇక్కడ ధర్మశాస్తప్రరంగా ఎలాంటి బేధం లేదు. కాని గణితపరంగా (దృక్సిద్ధాంతం, పూర్వపద్ధతి) వచ్చే బేధాలు మాత్రమే ఈ గందరగోళానికి కారణం.

03/23/2017 - 01:33

‘శ్రుతిశ్చ భిన్నాః స్మృతయశ్చ భిన్నాః
మహామునీనాం మతయశ్చ భిన్నాః
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనో యేన గత స్స పంథాః

03/23/2017 - 01:32

పండుగలను ఒక్కో పంచాంగంలో ఒకరకంగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఇందులో వ్యత్యాసాలు రావడానికి ప్రధానంగా తిథి, నక్షత్రాదులలో తేడాలు రావడం కారణం. కొన్ని పండుగలు తిథి ప్రాధాన్యతను కలిగి ఉంటే మరికొన్ని పండుగలు నక్షత్ర ప్రాధాన్యత కలిగి ఉంటాయి.

03/23/2017 - 01:31

జ్యోతిష్యంపై ఇటీవల కాలంలో ప్రజలకు నమ్మకం పెరిగిపోయింది. దీంతో కొందరు తమ వ్యక్తిగత ప్రచారంకోసం పండుగలను వివాదాస్పదం చేస్తున్నారు. పండుగలను ఆయా తిథి నక్షత్రాల ప్రకారం ఖరారు చేస్తారు. పంచాంగకర్తలు చాలామటుకు అనాదిగా పూర్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. మరికొందరు సూర్య సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు.

03/23/2017 - 01:30

దృక్సిద్ధ పంచాంగం ప్రకారం 2017 మార్చి 28న అమావాస్యనాడు పాడ్యమి ‘ఏష్య’మయింది. ఏష్యా అంటే ముందురోజు సూర్యోదయానికి తిథి ఉండదు. తర్వాతిరోజు సూర్యోదయానికి తిథి ఉండదు. రెండు సూర్యోదయాలను స్పృశించని తిథిని ‘ఏష్య’ అంటారు. పూర్వపద్ధతి పంచాంగం ప్రకారం 2017 మార్చి 29న సూర్యోదయం అనంతరం ఉదయం ఏడుగంటల వరకు పాడ్యమి ఉంది.

03/23/2017 - 01:28

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పండుగలపై పంచాంగకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతుల మధ్య విభేదాలు నెలకొనటం ఒక ఎత్తయితే మీడియాద్వారా బహిరంగ సవాళ్ళకు దిగటం దురదృష్టకరం. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తెలుగువారి తొలి పండుగ ఉగాది తేదీలపై వివాదం నెలకొనటం బాధాకరం.

03/23/2017 - 01:20

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. మెసేజ్ పంపడం.. షేర్ చేసుకోవడమే. ప్రస్తుతం వాట్సాప్ హంగామా ఇదీ.. సాంకేతిక విప్లవం పరుగులు తీస్తున్న నేపథ్యంలో వాట్సాప్ వినియోగం ఎక్కువైంది. చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని చిటికెలో అద్భుత దృశ్యాలను, కీలక సమాచారాన్ని, చక్కటి సందేశాలను, ఆకట్టుకునే వీడియోలను షేర్ చేసుకుంటూ ఇలా అనేక రకాలుగా యువత వాట్సాప్‌కు హ్యాట్సాప్ చెబుతున్నారు.

03/23/2017 - 01:21

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో వైశాలి ప్రాంతంలో ఒక సెంట్రల్ పార్కు వుంది. ఐతే, దానికి ఆలనా పాలనా లేక కునారిల్లిపోతోంది. చిన్ని చిన్ని పాపలు దీని దీవస్థను చూడలేక, దానిని దత్తత తీసుకున్నారు. రోజూ రెండు గంటలపాటు రుూ పార్కులోకి పోయి- మొక్కలు నాటుతూ, వాటికి సంరక్షణ చేస్తూ, పచ్చిక మెత్తల్ని పరుస్తూ- శ్రమదానం చేస్తున్నారు. ఎవరు వేసిన మొక్కకి వాళ్లే సంరక్షణ చెయ్యాలి.

03/23/2017 - 01:21

పంజాబ్‌లోని లూథియానా జిల్లాకి చెందిన కాటాన్ గ్రామ రైతు- సంపూర్ణ సింగ్‌కు ఉత్తర రైల్వే వారు ఇవ్వాల్సిన భూపరిహారం సొమ్మును ఇవ్వలేదు. 2007లో అతని గ్రామంలో వున్న భూముల్ని తీసేసుకున్నారు గానీ ఎకరాకి 25 లక్షల రూపాయల వంతున ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వనే లేదు.

Pages