S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 01:25

గుంటూరు, జనవరి 19: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై వైసిపి కార్యకర్తలు దాడికి దిగారు. గురువారం సాయంత్రం వెలగపూడి సచివాలయానికి అఖిలప్రియ వెళుతుండగా మందడం మలుపు వద్ద ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాన్వాయి ఎదురయింది. దీంతో గన్‌మెన్ దిగి సమీపంలో ఉన్న సిఐని హెచ్చరించారు. వైసిపి కార్యకర్తలు కారు వద్దకు చేరుకుని జెండా కర్రలతో, రాళ్లతో దాడిచేసేందుకు ప్రయత్నించారు.

01/20/2017 - 01:23

న్యూఢిల్లీ, జనవరి 19: ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మను సిబి ఐ కొత్త డైరెక్టర్‌గా నియమిస్తూ గురువారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె ఎస్ ఖెహర్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలతో కూడిన త్రిసభ్య కమిటీ అలోక్ కుమార్ పేరును ఆమోదించింది.

01/20/2017 - 01:21

న్యూఢిల్లీ/చెన్నై, జనవరి 19:జల్లికట్టుపై తమిళనాడు అట్టుడుకుతోంది. తమ ప్రాచీన సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ చేపట్టిన దీక్షలు మూడోరోజు గురువారమూ కొనసాగాయి. తమిళ సంఘాలు శుక్రవారం రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు డిఎంకె సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాగా జల్లికట్టుకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ గురువారం బంద్ పాటించింది. షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి.

01/20/2017 - 01:19

అమరావతి, జనవరి 19: ఆంధ్రప్రదేశ్‌కు, అమరావతికి ఆర్థిక వనరులు పెట్టుబడులను సమకూర్చడంలో చైనాకు చెందిన ‘మెకెన్సీ గ్లోబల్’ ముఖ్య భూమిక పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఇందుకోసం సంస్థలోని మేధావులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసి, తమ రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చే బాధ్యతను ఆ బృందానికి అప్పగించాలని కోరారు.

01/20/2017 - 01:16

వాషింగ్టన్, జనవరి 19: ‘మోదీజీ మీ సహకారానికి కృతజ్ఞతలు. మీ స్నేహంతో భారత అమెరికాల మధ్య అనుబంధం గతంలో కంటే మరింత బలపడింది. రక్షణ, పౌర అణు ఇంధన రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం పాదుకొల్పటంలో మనం విజయం సాధించాం’’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. మరి కొద్ది గంటల్లో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఒబామా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గురువారం ఫోన్ చేసి మాట్లాడారు.

01/20/2017 - 01:14

వాషింగ్టన్, జనవరి 19: మరికొద్ది గంటల్లో అమెరికాలో కొత్త శకం ప్రారంభం కానుంది. అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ 45వ అధ్యక్షుడిగా శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టబోతున్నారు. శుక్రవారం ఉదయం నుంచీ వాషింగ్టన్‌లో ప్రమాణ స్వీకారం జరిగే వరకూ, ఆ తరువాతా ట్రంప్ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

01/20/2017 - 01:03

శంషాబాద్, జనవరి 19: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికిడి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడు 467 గ్రాముల బంగారాన్ని తీసుకువచ్చిన్నట్లు గుర్తించి కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్వాధీనం చేసుకొని అతన్ని విచారణ నిమిత్తం నగరంలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించిన్నట్లు తెలిపారు.

01/20/2017 - 01:03

హైదరాబాద్, జనవరి 19: నగరంలో నిబంధనలకు విరుద్దంగా, ఇష్టారాజ్యంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జిహెచ్‌ఎంసి ఉక్కుపాదం మోపుతోంది.

01/20/2017 - 01:02

హైదరాబాద్, జనవరి 19: దేశంలోని 500 పై చిలుకు నగరాల్లో కొనసాగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నగరంలో చేపట్టేందుకు సమయం దగ్గరపడుతోంది. గత సంవత్సరం నిర్వహించిన ఈ సర్వేలో నగరానికి 19వ స్థానం దక్కటంతో ఈ సారైనా మెరుగైన ర్యాంకును దక్కించుకునేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

01/20/2017 - 01:01

వికారాబాద్, జనవరి 19: జాతీయ ఓటరు దినోత్సవం జనవరి 25 సందర్భంగా బూత్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో 18 సంవత్సరాలు నిండిన వారిక ఎపిక్ కార్డులను పంపిణీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ సూచించారు. గురువారం సచివాలయం నుండి నిర్వహించిన ఓటరు దినోత్సవంపై చీఫ్ ఎలక్షన్ అధికారి విడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా సబ్‌కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ దివ్య పాల్గొన్నారు.

Pages