S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2017 - 06:02

విజయవాడ, జనవరి 18: ఉల్లి రైతులు నష్టాలబారినపడ్డారు. గిట్టు బాటు ధరలేక కుదేలైపోయారు. కృష్టా జిల్లా పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లోని ఉల్లి రైతులు ఈ ఏడాది నష్టాలను చవిచూస్తుండగా, పెరిగిన పెట్టుబడులు, సరైన ధర లేక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. అమరావతి రాజధాని పరిధిలో భూ సమీకరణకు ప్రతిపాదించిన గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లో దాదాపు 1.000 ఎకరాల్లో ఉల్లి పంట పండిస్తున్నారు.

01/19/2017 - 06:01

న్యూఢిల్లీ, జనవరి 18: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మరిన్ని ప్రభుత్వరంగ బీమా సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఐదు ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇక్కడ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

01/19/2017 - 05:59

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటకరంగ అభివృద్ధి కార్పొరేషన్ (టిఎస్‌టిడిసి) చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. బుధవారం సోమాజిగూడలోని పర్యాటక భవన్‌లో ఇటీవల సోషల్ మీడియా ఫోరం బృందం చేసిన పరిశోధన యాత్ర వివరాలను వెల్లడించారు.

01/19/2017 - 05:58

హైదరాబాద్, జనవరి 18: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి మారిషస్ సంస్థకు అవసరమైన స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తానని, ఇందుకోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు.

01/19/2017 - 05:56

న్యూఢిల్లీ, జనవరి 18: రిలయన్స్ జియోపై ప్రత్యర్థి సంస్థలు ఒక్కొక్కటిగా టెలికామ్ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (టిడిశాట్)ను ఆశ్రయిస్తున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంచలన టెలికామ్ సంస్థ 4జి సేవలను దేశవ్యాప్తంగా ఉచితంగానే అందిస్తున్నది తెలిసిందే. అయితే ఈ ఉచిత ఆఫర్‌ను తొలుత గత నెల డిసెంబర్ 31 వరకే ప్రకటించిన జియో.. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 31దాకా పొడిగించింది.

01/19/2017 - 05:49

విజయవాడ (కల్చరల్), జనవరి 18: శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 28వ తేదీ శనివారం వరకు శ్రీ లక్ష్మీ పౌండరీక యజ్ఞసహిత శ్రీవారి నిత్యోత్సవాలు స్వరాజ్య మైదానంలో నిర్వహిస్తున్నట్లు గరిమెళ్ల నానయ్య చౌదరి తెలిపారు.

01/19/2017 - 05:49

పటమట, జనవరి 18: ప్రతి పక్షనాయడు జగన్‌మోహన్ రెడ్డి అమరావతి వస్తే రాజధాని భూముల రేట్లు పడిపోవటం ఖాయమని తెదేపా జనరల్ సెక్రటరీ నారా లోకేష్ హెచ్చరించారు. బుధవారం సిద్దార్ధ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియం ప్రారంభోత్సవ అనంతరం మిడియాతో ఆయన మాట్లాడారు. గురువారం జగన్ అమరావతి వస్తున్న నేపధ్యంలో నారా లోకేష్ స్పందించారు.

01/19/2017 - 05:48

కూచిపూడి, జనవరి 18: ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పామర్రు నియోజకవర్గంలో దళితుల మనోభావాలకు అనుగుణంగా రానున్న ఎన్నికల్లో వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సీటు కేటాయిస్తారన్న నమ్మకం ఉందని మాజీ ఎమ్మెల్యే డివై దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

01/19/2017 - 05:47

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 18: అపరాల రైతులను ఎలుకలు బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలోని మినుము పైరు పూత, పిందె, కాయ దశలో ఉండటంతో ఎలుకల బెడద ఎక్కువైందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరం పొలంలో బుట్టలు పెడితే 100 నుంచి 150కి పైగా ఎలుకలు పడుతున్నాయని, ఒక ఎలుకను పట్టినందుకు రూ.15 నుండి రూ.20ల వరకు చెల్లించాల్సి వస్తుందని, మొత్తంగా ఎకరాకు రూ.2వేలకు పైగా అదనపు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు.

01/19/2017 - 05:50

మచిలీపట్నం, జనవరి 18: తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాపింప చేసిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు అని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు 21వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు.

Pages